సీసన్ - టైమ్ రెండింటితో సంబంధం లేకుండా ఎప్పుడంటే అప్పుడు తినే బెస్ట్ సింపుల్ రెసిపీ పెరుగు ఇడ్లీ. ఎప్పుడు తిన్నా సూపర్ అనిపించే బెస్ట్ పెరుగు ఇడ్లీ రెసిపీ స్టెప్ బై స్టెప్ ఇమేజెస్ ఇంకా వీడియోతో ఉంది చూడండి.

“పెరుగు ఇడ్లీ” రెసిపీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ పెరుగు ఇడ్లీ నేను మొదటి సారి చెన్నైలో పెళ్లిలో తిన్నాను, చాలా నచ్చేసింది. ఆ రెసిపీనే నా తీరులో చిన్న మార్పులు బెస్ట్ టెస్ట్ వచ్చేలా చెబుతున్న.

పెరుగు ఇడ్లీ లంచ్ బాక్సులకి కూడా చాలా పర్ఫెక్ట్. ఇంకా ఇడ్లీలు మిగిలిపోయినా సాయంత్రాలు ఇలా పెరుగు ఇడ్లీ చేసుకోవచ్చు.

ఈ సింపుల్ పెరుగు ఇడ్లీ రెసిపీ స్టెప్ బై స్టెప్ ఇమేజెస్ ఇంకా వీడియోతో ఉంది చూడండి.

Curd Idly | Curd Idli | Dahi idli | Thayir Idli | How to Make Curd Idli Recipe | Perugu Idli

టిప్స్

  1. పెరుగు చల్లనిది పలుచనిది అయి ఉండాలి. చిక్కని పెరుగు పోస్తే పెరుగులోని నీరు పీల్చి ఇడ్లీ పైన పెరుగు గట్టిగా పేరుకుంటుంది. కాబట్టి పెరుగుని నీళ్ళతో పలుచన చేసుకోండి

  2. ఇడ్లీ మిగిలిపోయినవి లేదా కాస్త గట్టిగా ఉంటే కాసిని నీళ్ళు ఇడ్లీ పైన చిలకరించి మృదువుగా అయ్యేలా చేసుకోండి. లేదంటే పెరుగులోని నీటిని ఇడ్లీ పీల్చి, గట్టిగా హల్వాలా అవుతుంది.

  3. నేను చల్ల మిరపకాయ తాలింపులో వేశాను, మీరు ఎండు మిర్చి కూడా వేసుకోవచ్చు.

  4. ఆఖరున దానిమ్మ గింజలు వేసి సర్వ చేశాను. మీకు నచ్చితే తీపి బూందీ కూడా వేసుకోవచ్చు.

పెరుగు ఇడ్లీ | దహీ ఇడ్లీ - రెసిపీ వీడియో

Curd Idly | Curd Idli | Dahi idli | Thayir Idli | How to Make Curd Idli Recipe | Perugu Idli

Breakfast Recipes | vegetarian
  • Prep Time 2 mins
  • Resting Time 1 hr
  • Total Time 1 hr 2 mins
  • Servings 4

కావాల్సిన పదార్ధాలు

  • 7 - 8 ఇడ్లీలు
  • 1/2 liter పెరుగు
  • ఉప్పు – రుచికి సరిపడా
  • 1 tbsp పంచదార
  • తాలింపు కోసం
  • 1 tbsp నూనె
  • 1 tsp ఆవాలు
  • 1/2 tsp జీలకర్ర
  • 2 రెబ్బలు కరివేపాకు
  • 1 పచ్చిమిర్చి (తరుగు)
  • ఇంగువా – చిటికెడు
  • 1 - 2 చల్ల మిరపకాయ
  • 1/4 cup దానిమ్మ గింజలు

విధానం

  1. పలుచని చల్లని పెరుగు లో ఉప్పు పంచదార వేసి కలిపి గంట సేపు ఫ్రిజ్లో ఉంచండి.
  2. తాలింపు కోసం నూనె వేడి చేసి తాలింపు కోసం ఉంచిన పదార్ధాలన్నీ వేసి వేపి పక్కనుంచుకోండి
  3. ఇడ్లీ చల్లరినవి అయితే ఇడ్లీ తడిచేలా కాసిని నీళ్ళు చల్లుకుని పైన పెరుగు పోసుకోండి
  4. తరువాత పైన తాలింపు ఇంకా దానిమ్మ గింజలు వేసి సర్వ చేసుకోండి, లేదా గంట పాటు ఫ్రిజ్లో ఉంచి సర్వ చేసుకోండి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

2 comments

Curd Idly | Curd Idli | Dahi idli | Thayir Idli | How to Make Curd Idli Recipe | Perugu Idli