దహీ పోహా | అటుకుల దద్దోజనం
వినాయకచవితి ప్రసాదంగా మహారాష్ట్రాలో ఎంతో ప్రసిద్ధి ఈ దహీ పోహా. కేవలం 5 నిమిషాల్లో తయారయ్యే ఈ ప్రసాదం గణేష్ చతుర్ధీ పందిళ్ళలో ప్రసాదంగా ఇస్తారు మహారాష్ట్రాలో.
దహీ పోహా ప్రసాదంగానే కాదు ఇన్స్టంట్గా చేసుకునే కమ్మని టిఫిన్. దహీ పోహ మేము వేసవి చాలా ఎక్కువగా చేస్తుంటాము. దహీ పోహా రెసిపీ దాదాపుగా దద్దోజనంలాగానే ఉంటుంది. కానీ తాలింపు కాస్త భిన్నం అంతే.

టిప్స్
-
దహీ పోహాకి మాదంగా ఉండే అటుకులని నీళ్ళలో కడిగి జల్లెడలో వేసి వదిలేస్తే 5 నిమిషాలకి పొడిపొడిగా అవుతాయ్.
-
మహారాష్ట్రా వారు కేవలం ఆవాలు, జీలకర్ర, చల్ల మిరపకాయలతో తాలింపు పెడతారు. నచ్చితే మినపప్పు శెనగపప్పు పచ్చిమిర్చి అల్లం కూడా వేసి కూడా తాలింపు పెట్టుకోవచ్చు.
-
పోహా చేసిన వెంటనే అంటే 30 నిమిషాలకి తినగలిగితే బాగుంటుంది లేదంటే పెరుగులో బాగా మెత్తగా నాని ముద్దగా అవుతుంది.
-
పోహాకి వాడే పెరుగు కాస్త పలుచగా చేసుకుంటే పోహాలో వేశాక గట్టిగా అవ్వదు
దహీ పోహా | అటుకుల దద్దోజనం - రెసిపీ వీడియో
Curd poha | Dahi poha | Maharashtrian Gopalkala Recipe
Prep Time 2 mins
Cook Time 2 mins
Total Time 4 mins
Servings 2
కావాల్సిన పదార్ధాలు
- 1 cup మందంగా ఉండే అటుకులు
- 1 1/4 cup పెరుగు
- 1 tsp నూనె
- 1/2 tsp ఆవాలు
- 1/2 tsp జీలకర్ర
- 2 చల్ల మిరపకాయలు
- 1 రెబ్బ కరివేపాకు
విధానం
-
కడిగి ఆరబెట్టిన అటుకులలో పెరుగు ఉప్పు కలిపి పక్కనుంచుకోండి.
-
నూనె వేడి చేసి అందులో ఆవాలు జీలకర్ర మిరపకాయలు కరివేపాకు వేసి తాలింపు పెట్టి అటుకులలో కలిపేసుకోవాలి.
-
ఇది పోహా వెంటనే తింటే చాలా రుచిగా ఉంటుంది.

Leave a comment ×