దద్యోజనం | దద్యోజనం రెసిపి | ప్రసాదం దద్యోజనం

ప్రసాదం దద్యోజనంకమ్మని ఆవుపాలు పెరుగులో మెత్తగా ఉడికించుకున్న అన్నం ఉప్పు మిరియాలు అల్లం ముక్కలు వేసి చేసే ఈ ప్రసాదం లలిత సహస్రనామం లో 512వ నామంగా చెబ్బడినది.

ఋషులు చెప్పిన శాస్త్రీయమైన దధ్యోజనం ప్రసాదం మీ కోసం. సంస్కృతంలో పెరుగుని “దధి” అంటారు అదే కాలక్రమేణా హిందీలో దహీగా మారింది. ఈ దద్యోజనం మాములుగా తాలింపు పెట్టి చేసే పెరుగన్నం కాదు. ఇది చాలా భిన్నంగా సులభంగా ఉంటుంది.

లలితా సహస్రాల్లో 512 వ నామంలో దధ్యన్నాసక్తహృదయా అని కనిపిస్తుంది అంటే అమ్మకి దధితో చేసే అన్నం అంటే ప్రీతీ అని. ఇంకా ఈ దధీ అన్నాన్ని గర్భవతి నాలుగవ నెలలో క్రమం తప్పకుండ ఉసిరికాయంత పరిమాణంలో తింటే ఆ నెలలో గర్భంలోని శిశువుకి ఏరపడాల్సిన అవయవాల్లో ఎలాంటి దోషం లేకుండా పుష్టినిస్తుంది.

ఈ చక్కని ప్రసాదాన్ని తయారు చేసే ముందు కింద టిప్స్ చుడండి.

టిప్స్

అన్నం వండుకునే తీరు:

*బియ్యాన్ని నానబెట్టి ఒకటికి నాలుగు నీరు పోసి వండితే అన్నం మీఠా ఉడుకుతుంది. కుక్కర్ లో అయితే ఒకటికి మూడు నీరు పోసుకుంటే సరిపోతుంది. ఏది ఏమైనా అన్నం మెత్తగా ఉండాలండి.

పెరుగు:

*సాధారణంగా ప్రసాదాలకి ఆవు పాల పెరుగు వాడుకోదలిస్తే శ్రేష్టం, లేని వారు పిలవని గేదె పాల పెరుగు వాడుకోండి. ప్రసాదానికి పులిసిన పదార్ధాలు పనికి రావు కాబట్టి పిలవని కమ్మని పెరుగు వాడుకోండి.

మిరియాలు:

*మిరియాలు పచ్చివే వేసుకోవాలి, కావాలంటే దంచి అయినా వేసుకోవచ్చు

అల్లం:

*చెక్కు తీసుకున్న సన్నని అల్లం ముక్కలు వేసుకోండి. ఈ పెరుగన్నంలో కారమంతా అల్లం మిరియాల ఘాటుతోనే కాబట్టి మీ రుచికి తగినట్లు వేసుకోండి.

దద్యోజనం | దద్యోజనం రెసిపి | ప్రసాదం దద్యోజనం - రెసిపీ వీడియో

Daddojanam | Dadyojanam | Lalitha sahasranamam Dadyojanam | Dadyojanam Recipe | temple style curd rice

Prasadam | vegetarian
  • Prep Time 2 mins
  • Soaking Time 1 hr
  • Cook Time 20 mins
  • Resting Time 20 mins
  • Total Time 1 hr 42 mins
  • Servings 10

కావాల్సిన పదార్ధాలు

  • ½ litre ఆవు పాల పెరుగు
  • ½ cup బియ్యం
  • 2 spoons ఉప్పు
  • 1 tbsp మిరియాలు
  • 1 ½ spoons అల్లం
  • 3-4 cups నీరు

విధానం

  1. నానబెట్టుకున్న బియ్యంలో విడిగా వండుకునే తీరులో అయితే ఒకటికి నాలుగు రేట్లు నీరు, కుక్కర్లో అయితే ఒకటికి మూడు నీరు పోసి అన్నాన్ని మెత్తగా వండుకోండి.
  2. వండుకున్న అన్నంలో పెరుగు తప్ప మిగిలిన పదార్ధాలన్నీ వేసి అన్నాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి.
  3. చల్లారిన అన్నంలో పెరుగు కొత్తిమీర తరుగు వేసి కలిపి అమ్మకి నైవేద్యం నివేదించి మీరు తీసుకోండి, అందరికి పంచండి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.