దహీ ఆలూ | చపాతీ రైస్ లోకి పర్ఫెక్ట్ కర్రీ దహీ ఆలూ కర్రీ

Curries
5.0 AVERAGE
1 Comments

చపాతీ రైస్ లోకి పర్ఫెక్ట్ కర్రీ దహీ ఆలూ కర్రీ. ఈ టేస్టీ కర్రీ రెసిపీ స్టెప్ బై స్టెప్ ఇమేజెస్ ఇంకా వీడియోతో ఉంది చూడండి.

ఆలూ గడ్డతో కూరలు అనేకం, అందులో ఈ ఆలూ గడ్డ కూర కాస్త ప్రేత్యేకం. ఘాటుగా, పుల్లగా, కారంగా ఘుమఘుమలాడిపోతూ చిక్కని పెరుగు గ్రేవీతో చాలా రుచిగా ఉంటుంది.

“దహీ ఆలూ” రెసిపీ ఉత్తర భారత దేశంలో దాదాపుగా రాష్ట్రానికి ఒక్కోతీరుగా చేస్తారు. ఇంకా దాభాల్లో రెస్టారెంట్లలో మరో తీరుగా చేస్తారు! నేను బీహార్, ఉత్తర ప్రేదేశ్ రాష్ట్రాల తీరులో చేస్తున్నా!

ఏ దహీ ఆలూ రెసిపీ చాలా సింపుల్, కొన్ని టిప్స్ పాటిస్తూ చేస్తే బెస్ట్ కర్రీ వస్తుంది.

Dahi Aloo | Dahi wale Aloo recipe | Potato Yogurt Curry | How to make Dahi Aloo Curry

టిప్స్

ఆలూ:

  1. ఆలూని పూర్తిగా ఉడికించకూడదు. 80% మాత్రమే ఉడికికించి వేపుకోవాలి. మిగిలిన 20% దుంప కూరలో మగ్గిపోతుంది.

  2. నేను బేబీ ఆలూ వాడాను, మీరు కావాలంటే ఉడికిన పెద్ద దుంపని నాలుగు లేదా ఆరు సగాలుగా వాడుకోవచ్చు.

  3. ఆలూ ముందు నూనెలో ఎర్రగా వేగాలి అప్పుడు కూర రుచిగా ఉంటుంది.

కలోనజీ:

  1. కలోనజీ వేస్తే కూర ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నచ్చని వారు, లేదా లేని వారు వదిలేవచ్చు.

పెరుగు:

  1. చిలికిన పెరుగు వేసే ముందు స్టవ్ ఆపేసి పెరుగు వేసి కూరలో కలిసే దాకా బాగా కలిపి తరువాత సన్నని సెగ మీద నూనె పైకి తేలేదాక ఉడికించుకోవాలి, అప్పుడు పెరుగు తరకలుగా అవ్వదు.

కారం :

  1. కూరలో వేసే పచ్చిమిర్చి, మిరియాల ఘాటు సరిపోతుంది, కారం అవసరం ఉండదు. రుచి చూసి కారం కావాలనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు.

దహీ ఆలూ | చపాతీ రైస్ లోకి పర్ఫెక్ట్ కర్రీ దహీ ఆలూ కర్రీ - రెసిపీ వీడియో

Dahi Aloo | Dahi wale Aloo recipe | Potato Yogurt Curry | How to make Dahi Aloo Curry

Curries | vegetarian
  • Prep Time 5 mins
  • Cook Time 25 mins
  • Total Time 30 mins
  • Servings 4

కావాల్సిన పదార్ధాలు

  • 300 gms 80% ఉడికించిన బేబీ ఆలూ
  • 2 చిటికెళ్లు ఇంగువ
  • ఉప్పు – కొద్దిగా
  • 1/2 tsp మిరియాల పొడి
  • 3 tbsp నూనె
  • కూర కోసం
  • 1/2 tsp జీలకర్ర
  • 2 చిటికెళ్లు కలోనజీ
  • 1 cup ఉల్లిపాయ తరుగు
  • 1 tbsp అల్లం వెల్లులి ముద్ద
  • 5 పచ్చిమిర్చి
  • ఉప్పు
  • 2 చిటికెళ్లు పసుపు
  • 1/2 tsp మిరియాల పొడి
  • 1/2 tsp గరం మసాలా
  • 1 tsp ధనియాల పొడి
  • 1/2 tsp వేయించిన జీలకర్ర పొడి
  • 1/2 cup టొమాటో పేస్ట్
  • 300 gms చిలికిన పెరుగు
  • 2 tbsp నూనె
  • 2 tbsps కొత్తిమీర తరుగు

విధానం

  1. నూనె లో ఉడికించిన ఆలూ వేసి ఆలూ పైన ఎర్రగా వచ్చేదాకా వేపుకోవాలి. ఆలూ రంగు మారుతుండగా ఇంగువ , ఉప్పు , మిరియాల పొడి వేసి ఎర్రగా వేపి ఆలూని పక్కకు తీసుకోండి.
  2. అదే మూకుడులో 2 tbsp నూనె వేడి చేసి అందులో జీలకర్ర, కలోనజీ వేసి వేపుకోవాలి. తరువాత ఉల్లిపాయ తరుగు వేసి ఎర్రగా వేపుకోవాలి.
  3. ఉల్లిపాయ లేత గులాబీ రంగులోకి మారగానే అల్లం వెల్లులి ముద్ద వేసి వేపుకోవాలి.
  4. తరువాత ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, పచ్చిమిర్చి వేసి వేపుకోవాలి.
  5. తరువాత టొమాటో పేస్ట్ వేసి టొమాటో వేగి నూనె పైకి తేలేదాక వేపుకోవాలి. తరువాత వేపుకున్న ఆలూ వేసి 3 నిమిషాలు వేపుకోవాలి.
  6. స్టవ్ ఆపేసి చిలికిన పెరుగు వేసి కూరలో కలిసేదాకా బాగా కలిపి, తరువాత స్టవ్ ఆన్ చేసి సన్నని సెగ మీద మూత పెట్టి నూనె పైకి తేలేదాక కూరని ఉడికించాలి.
  7. నూనె పైకి తేలాక కొత్తిమీర తరుగు చల్లి దింపేసుకోవాలి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

1 comments

  • S
    Saran
    Recipe Rating:
    Super sir my mother prepared like you me and my sister loved the recipe
Dahi Aloo | Dahi wale Aloo recipe | Potato Yogurt Curry | How to make Dahi Aloo Curry