దహి బల్లా | చాట్ బండి దగ్గర దొరికే మృదువైన దహీ భల్లా

Snacks
5.0 AVERAGE
1 Comments

చాట్ బండి దగ్గర దొరికే మృదువైన దహీ భల్లా చేయాలనుకుంటున్నారా? అయితే పర్ఫెక్ట్ రెసిపీ స్టెప్ బై స్టెప్ ఇమేజెస్ ఇంకా వీడియోతో ఉంది చూడండి.

“దహీ భల్లా” రెసిపీ ఉత్తరభారత దేశంలో ప్రాంతానికి ఒక తీరుగా చేయడం చూశాను, తిన్నాను. ఢిల్లీ, రాజస్థాన్ వైపు మినపప్పు, పెసరపప్పు కలిపి ఎక్కువగా దహీ భల్లా చేస్తారు. బెంగాల్, ఒరిస్సా, మధ్యప్రదేశ్, గుజరాత్ వైపు అచ్చంగా మినపప్పుతోనే చేస్తారు.

నేను కూడా అచ్చంగా మినపప్పుతోనే చేస్తున్నాను. వేసవి కాలంలో “దహీ భల్లా” రుచి ఇంకా పెరుగుతుంది అనిపిస్తుంది నాకు.

“దహీ భల్లా” రెసిపీ దక్షిణ భారతదేశంలో తాలింపు పెట్టి చేసే పెరుగు వడ లాంటిదే, కానీ దహీ భల్లాలో తాలింపు ఉండదు ఇంకా తీపి, పులుపు, కారంతో పాటు ఇంకా పైన కారప్పూస, దానిమ్మ గింజలు, బీట్రూట్ తురుము ఇలా ఏదో చల్లి ఇస్తారు.

“దహీ భల్లా” రెసిపీ లో వాడే పుదీనా చట్నీ, చింతపండుతో చట్నీ కూడా ఈ రెసిపీలో ఉన్నాయి చూడండి.

పుదీనా చట్నీ కోసం:

  1. పుదీనా చట్నీ కోసం ఉంచిన పదార్ధాలన్నీ వేసి మెత్తని పేస్ట్ చేసుకోండి కొద్దిగా నీళ్ళు చేర్చి. చింతపండు చట్నీ కోసం:

  2. నూనె వేడి చేసి అందులో బిర్యానీ ఆకు, దంచిన ధనియాలు, సొంపు వేసి మాంచి సువాసన వచ్చేదాకా వేపుకోవాలి.

  3. వేగిన మసాలాలో చింతపండు పులుసుతో పాటు మిగిలిన పదార్ధాలన్నీ వేసి చిక్కగా జిగురుజిగురుగా వచ్చేదాకా సన్నని సెగ మీద మరిగించి దించి చల్లార్చుకోండి.

Dahi Bhalla | Summer Special Snack Curd Bhalla | How to make Dahi Bhalla Recipe | Tips to Make Soft Bhalla

టిప్స్

భల్లాలు గుల్లగా మృదువుగా రావాలంటే:

  1. మినపప్పుని ఎప్పుడైనా మిక్సీలో కంటే గ్రైండర్లో రుబ్బితే చాలా మృదువుగా ఉంటాయి బొండాలు.

  2. నేను కట్ షార్ట్లో చేశా ఈ రెసిపీ. అంటే పప్పు మిక్సీలో రుబ్బి వంటసోడా వేసి బాగా బీట్ చేశా. ఇలా చేసినా బొండాలు మృదువుగానే వస్తాయ్. వంట సోడా ఇష్టం లేని వారు ఎక్కువసేపు రుబ్బిన పిండిని 5-6 నిమిషాలు బీట్ చేసుకోవాలి. అప్పుడు బొండాలు వేస్తే బాగా గుల్లగా వస్తాయ్.

పెరుగు:

  1. బాగా చల్లని పెరుగులో పంచదార కలిపి తరకలు లేకుండా చిలికి మళ్ళీ ఫ్రిజ్లో ఉంచి అప్పటికప్పుడు చల్లగా సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది దహీ భల్లా.

  2. ఇంకా బొండాలు కూడా బాగా చల్లని నీళ్ళలో వేసి ఫ్రిజ్లో రెండు గంటలు నానబెడితే చల్లగా చాలా బాగుంటాయ్.

  3. బొండాలలోంచి నీరు 70% మాత్రమే పిండుకోవాలి. పూర్తిగా పిండితే పెరుగలోని నీరుని పీల్చి గట్టిగా క్రీమ్లా అయిపోతుంది పెరుగు.

స్వీట్ చట్నీ:

  1. స్వీట్ చట్నీలు చాలా తీరుల్లో చేస్తారు, కొందరు ఖర్జూరం కూడా వేస్తారు. నేను కేవలం చింతపండు పంచదార వేసి చేశాను. మీరు పంచదారకి బదులు బెల్లం కూడా వాడుకోవచ్చు.

  2. స్వీట్ చెట్నీ జిగురు పాకం వచ్చేదాకా మరిగిస్తేనే ఫ్రిజ్లో రెండు నెలల పైన నిలవ ఉంటుంది.

దహి బల్లా | చాట్ బండి దగ్గర దొరికే మృదువైన దహీ భల్లా - రెసిపీ వీడియో

Dahi Bhalla | Summer Special Snack Curd Bhalla | How to make Dahi Bhalla Recipe | Tips to Make Soft Bhalla

Snacks | vegetarian
  • Prep Time 30 mins
  • Resting Time 1 hr
  • Total Time 1 hr 30 mins
  • Servings 6

కావాల్సిన పదార్ధాలు

  • దహీ భల్లా కోసం
  • 1/2 liter పెరుగు
  • 1/4 cup పంచదార
  • 1 cup మినపప్పు
  • ఉప్పు
  • 1 tsp సొంపు
  • 2 tbsp జీడిపప్పు పులుకులు
  • 10 ఎండు ద్రాక్ష తరిగినవి
  • 1/4 tsp వంట సోడా
  • నీళ్ళు – కొద్దిగా
  • నూనె వేపడానికి
  • చల్లని నీళ్ళు బొండాలు నానబెట్టడానికి
  • 1 tsp వేయించిన జీలకర్ర పొడి
  • 1 tsp కారం
  • కొత్తిమీర – చిన్న కట్ట
  • 1/2 cup నైలాన్ సేవ్
  • పుదీనా చట్నీ కోసం
  • 1 పుదీనా
  • 1 కొత్తిమీర
  • ఉప్పు
  • 1.5 tbsp నిమ్మకాయ రసం
  • 3 పచ్చిమిర్చి
  • చింతపండు స్వీట్ చట్నీ
  • 1 tbsp నూనె
  • 2 బిర్యానీ ఆకులు
  • 1 tsp సొంపు
  • 1 tbsp నలిపిన ధనియాలు
  • 300 ml చింతపండు పులుసు (150 gm చింతపండు నుండి తీసినది)
  • 1 tsp కారం
  • 1 tsp వేయించిన జీలకర్ర పొడి
  • 3/4 tsp ధనియాల పొడి
  • ఉప్పు
  • 1 tsp నల్ల ఉప్పు
  • 250 gm పంచదార/ బెల్లం

విధానం

  1. దహీ భల్లా కోసం చల్లని పెరుగు లో పంచదార వేసి కరిగించి ఫ్రిజ్లో రెండు గంటలు ఉంచండి
  2. 5 గంటలు నానబెట్టిన మినపప్పుని మెత్తగా గట్టిగా ఎక్కువసేపు రుబ్బుకోవాలి
  3. రుబ్బుకున్న పిండిలో జీడిపప్పు, కీసమిస్స్, సొంపు, ఉప్పు, వంట సోడా తగినన్ని నీళ్ళు పోసి బాగా కలుపుతూ బీట్ చేసుకోవాలి( ఒక సారి టిప్స్ చూడండి)
  4. మరిగే వేడి నూనెలో బొండాలు వేసుకోండి, బొండాలు ఎర్రగా కరకరలాడేట్టు వేపుకుని తీసుకోండి.
  5. వేపిన బొండాలని చల్లని నీళ్ళలో వేసి ఫ్రిజ్లో కనీసం గంటైనా ఉంచాలి. అప్పుడు అసలైన మజా తిన్తున్నప్పుడు
  6. ఫ్రిజ్లోంచి తీసిన బొండాలలోంచి నీటి 70% మాత్రేమే పిండి ఒక బోల్లోకి తీసుకోండి
  7. భల్లాలు కొన్ని ఒక బౌల్లోకి తీసుకోండి, దాని మీద చల్లని చిలికిన పెరుగు పోసుకోండి, పెరుగు మీద పుదీనా చట్నీ, చింతపండు చట్నీ, వేయించిన జీలకర్ర పొడి కొద్దిగా, కారం కొద్దిగా చల్లుకోవాలి.
  8. ఆఖరుగా సన్న కారప్పూస కొత్తిమీర తరుగు కొద్దిగా చల్లుకుని సర్వే చేసుకోవాలి.
  9. పుదీనా చట్నీ కోసం: పుదీనా చట్నీ కోసం ఉంచిన పదార్ధాలన్నీ వేసి మెత్తని పేస్ట్ చేసుకోండి కొద్దిగా నీళ్
  10. చింతపండు చట్నీ కోసం: నూనె వేడి చేసి అందులో బిర్యానీ ఆకు, దంచిన ధనియాలు, సొంపు వేసి మాంచి సువాసన వచ్చేదాకా వేపుకోవాలి.
  11. వేగిన మసాలాలో చింతపండు పులుసుతో పాటు మిగిలిన పదార్ధాలన్నీ వేసి చిక్కగా జిగురుజిగురుగా వచ్చేదాకా సన్నని సెగ మీద మరిగించి దించి చల్లార్చుకోండి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

1 comments

  • M
    Magicwoman
    Recipe Rating:
    Awesome recipe! Will surely try. I love all your recipes ❤️
Dahi Bhalla | Summer Special Snack Curd Bhalla | How to make Dahi Bhalla Recipe | Tips to Make Soft Bhalla