నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది అనే మాట చాలా సార్లు వినే ఉంటారు మీరు, నిజంగా అలాంటి గొప్ప రెసిపీ రుచి చూడాలంటే మాత్రం రెస్టారెంట్ స్టైల్ దహీ కబాబ్ రుచి చూడాల్సిందే.

బయట కరకరలాడుతూ లోపల వెన్నలా మృదువుగా ఉంటుంది. నోట్లో పెట్టుకుంటే ఎప్పుడు గొంతులోకి దిగిందో కూడా తెలియని అంత గొప్పగా ఉంటుంది ఈ కబాబ్. పార్టీలకి పర్ఫెక్ట్ స్టార్టర్. ఈ రెసిపీని సృష్టించిన వారిని ఎంత పొగిడినా తక్కువే అనిపిస్తుంది.

కబాబ్లో వేసిన పదార్ధాల కాంబినేషన్ చాలా గొప్పగా అనిపిస్తుంది, కబాబ్లో వేసిన ప్రతీ పదార్ధం తగిన మోతాదులో చాలా బాలెన్స్డ్గా ఉంటుంది.

ఈ సింపుల్ కబాబ్ చేసే ముందు ఒక్క సారి టిప్స్ చూసి చేయండి మీకు అన్ని అనుమానాలు తొలగిపోతాయి ఇంకా చేసే ప్రతీ సారి ఒకే రుచి గ్యారంటీ!!!

మీరు ఈ రెసిపీని కూడా ఇష్టపడవచ్చు పనీర్ పాప్ కార్న్

టిప్స్

పెరుగు:

  1. కమ్మని చిక్కని గేదె పాల పెరుగు ఒక బట్టలో వేసి గట్టిగా మూట కట్టి దాన్ని ఒక జల్లెడ లో ఉంచండి. ఇంకా పెరుగు మూట మీద బరువు పెట్టి రాత్రంతా ఫ్రిజ్లో వదిలేయాలి అప్పుడు పెరుగులోని నీరు పోయి పనీర్లాంటి మృదువైన గట్టి పెరుగు మిగులుతుంది. పెరుగు ఫ్రిగ్లో ఉంచితేనే పులిసిపోదు, కమ్మగా ఉంటుంది.

ఉల్లి పచ్చిమిర్చి అల్లం:

  1. వేసే మూడు పదార్ధాలు చాలా సన్నని తురుము వేసుకోవాలి. కూరకి తరిగినట్లు పెద్ద ముక్కలు వేయకండి. అవసరమైతే పచ్చిమిర్చి అల్లం తురుముకోండి

నిమ్మరసం:

  1. నేను వాడిన పెరుగు కమ్మగా ఉంది కాబట్టి కొద్దిగా నిమ్మరసం రుచి కోసం వేశాను. మీరు వాడే పెరుగు పిలుపుని బట్టి నిమ్మరసం వేసుకోండి, లేదా వదిలేయండి

పనీర్, చీస్:

  1. మృదువైన పెరుగుని కబాబ్ మాదిరి పట్టి ఉంచడానికి చీస్ ఉపయోగపడుతుంది. పనీర్ తురుము పెరుగు ముద్ద నూనెలో వేగినా కరిగిపోకుండా కబాబ్ మాదిరి మందంగా వత్తుకున్న ఆకారంలోనే ఉండేలా చేస్తుంది.

నూనె:

  1. ఈ కబాబ్కి కచ్చితంగా కబాబ్ నూనెలో మునిగేలా ఉండాలి. అప్పుడే అన్ని వైపులా త్వరగా వేగి గట్టి పడుతుంది. కొద్దిగా నూనె పోసి పెనం మీద కాల్చుకుంటే ఒక్కోసారి అడుగుపెట్టి మృదువుగా ఉండే కబాబ్ విరిగిపోవొచ్చు.

దహీ కబాబ్ - రెసిపీ వీడియో

Dahi kebab| Dahi Kabab | Restaurant Style Dahi kebab

Starters | vegetarian
  • Prep Time 15 mins
  • Cook Time 15 mins
  • Resting Time 3 hrs
  • Total Time 3 hrs 30 mins

కావాల్సిన పదార్ధాలు

  • 1/2 litre చిక్కని కమ్మని పెరుగు
  • 1 tbsp పచ్చిమిర్చి తురుము
  • 1 tbsp ఉల్లిపాయ సన్నని తరుగు
  • 1/2 tbsp అల్లం సన్నని తురుము
  • ఉప్పు (కొద్దిగా)
  • 1/2 tbsp చాట్ మసాలా
  • 2-3 tbsp వేపిన సెనగపప్పు పొడి
  • 1/2 Cup పనీర్ తురుము
  • 1/2 Cup ప్రొసెస్డ్ చీస్ తురుము
  • 1 1/2 Cup బ్రేడ్ పొడి
  • నూనె వేపుకోండి
  • 2 tbsp కొత్తిమీర

విధానం

  1. కమ్మని పెరుగుని బట్ట వేసి గట్టిగా మూట కట్టి జల్లెడలో పెట్టి మూట మీద బడుగు ఉంచి రాత్రంతా లేదా 2-3 గంటలు ఫ్రిజ్లో ఉంచితే పెరుగు పులిసిపోదు
  2. పానీర్ల గట్టిపడ్డ పెరుగులో మిగిలిన సామాగ్రీ ½ కప్పు బ్రేడ్ పొడి వేసి బాగా చెంచాతో కలుపుకోండి
  3. పెద్ద నిమ్మకాయంత ఉండ తీసుకుని ఫ్యాటీ మాదిరి వట్టి మిగిలిన బ్రేడ్ పొడిలో నెమ్మదిగా రోల్ చేసుకోండి.
  4. బ్రేడ్ పొడి బాగా కోటింగ్ ఇచ్చిన తరువాత గంట సేపైనా ఫ్రిజ్లో ఉంచితే కబాబ్లు గట్టి పడతాయ్.
  5. గట్టి పడ్డ కబాబ్ని వేడి నూనెలో వేసి మీడియం ఫ్లేమ్ మీద మాంచి ఎర్రటి రంగు వచ్చేదాకా వేపుకుని తీసుకోండి,
  6. పుదీనా చట్నీతో సర్వ్ చేసుకోండి.ఈ కబాబ్లు వేడిగానే రుచిగా ఉంటాయి అని గమనించండి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.