దాల్ కిచిడి | దాల్ కిచిడి రెసిపీ | రెస్టారెంట్ స్టైల్ దాల్ కిచిడి రెసిపీ
దాల్ కిచిడి రెసిపీ- అన్నం పెసరపప్పుని మెత్తగా ఉడికించి ఉల్లి టమాటో వెల్లులి వేసి ఘుభాళించేలా పెట్టె తాలింపుతో యమా అద్భుతంగా ఉండే రెస్టారెంట్ స్టైల్ దాల్ కిచిడి రెసిపీ.
ఎప్పుడూ అన్నం కూర కాకుండా ఒక సారి ఈ కిచిడి ప్రయత్నించండి చాలా తృప్తిగా తింటారు ఆ పూట. వెల్లూలి గుభాళింపుతో ఎంత తిన్నా చాలా రుచిగా ఉంటుంది.
ఉత్తరాది వారికి కిచిడీలు అనేకం ప్రాంతాన్ని బట్టి అలాగే ఈ కిచిడి రెస్టారెంట్లో చేసే తీరు కిచిడి. చాలా రుచిగా కుదిరే ఈ కిచిడి చేసే ముందు కింద టిప్స్ ని అర్ధం చేసుకుని చేయండి బెస్ట్ దాల్ కిచిడిని ఆశ్వాదించండి.

టిప్స్
బియ్యం పప్పు అది ఉడికించి తీరు :
● కిచిడి బియ్యం పప్పు సమానంగా తీసుకోవాలి. రెండింటిని కనీసం గంట సేపైనా నానబెట్టుకోవాలి. ● పప్పు బియ్యంని మెత్తగా గుజ్జుగా ఉడికించుకోడానికి కనీసం లీటర్ పైన నీరు అవసరం అవుతుంది. అంత నీరు ఒకే సారి పోసి ఉడికిస్తే కుక్కర్లోంచి నీరు వచ్చేస్తుంది అందుకే కప్పుకి మూడు కప్పుల నీరు పోసి ఉడికించి మిగిలినది తరువాత పోసి ఉడికించుకోండి.
తాలింపు:
● కిచిడికి తాలింపు ఊపిరి లాంటిది అందుకే తాలింపుని గుభాళించేలా ఎర్రగా వేపుకోకపోతే అన్నీ చెప్పినట్లే చేసినా అంత గొప్ప రుచిగా అనిపించదు కిచిడి. ● కిచిడి తాలింపుకి నూనెలో జీలకర్ర పడీ పడగానే చిట్లాల్లి అప్పుడు మాంచి పరిమళం వస్తుంది.
వేడి నీరు:
● కిచిడిని పలుచన చేసుకోడానికి వేడి నీరు పోసుకుంటే అప్పటిదాకా మసాలాల్లో ఉడికిన అన్నం అక్కడినుండి ఇంకొంచెం ఉడుకుతుంది. అదే మీరు చల్లని నీరు పోస్తే ఉడికి విడుదలైన మసాలాలు పరిమళం దిగిపోతుంది. కాబట్టి వేడి నీరుతో పలుచన చేసుకోండి.
కిచిడి గట్టి పడితే:
● సాధారణంగా కిచిడి చల్లారుతున్న కొద్దీ గట్టిగ ముద్దలా అవుతుంది. అందుకే కిచిడి చేసుకునేప్పుడే కాస్త పలుచగా చేసుకుంటే చల్లారినా మృదువుగా జారుగా ఉంటుంది.
దాల్ కిచిడి | దాల్ కిచిడి రెసిపీ | రెస్టారెంట్ స్టైల్ దాల్ కిచిడి రెసిపీ - రెసిపీ వీడియో
Dal khichdi | Restaurant style Dal Khichdi | Dal khichdi Recipe | Dal Kichidi
Prep Time 5 mins
Soaking Time 1 hr
Cook Time 30 mins
Total Time 1 hr 35 mins
Servings 5
కావాల్సిన పదార్ధాలు
-
బియ్యం పప్పు వండుకోడానికి:
- ½ cup పెసరపప్పు
- ½ cup బియ్యం
- 1 tsp నెయ్యి
- 750 ml నీరు
- ¼ tsp పసుపు
- కిచిడి తయారీకి:
- 2 tbsp నూనె
- 3 tbsp నెయ్యి
- ½ tsp జీలకర్ర
- 1 tsp అల్లం
- 1 tbsp వెల్లులి
- 2 పచ్చిమిర్చి చీలికలు
- 2 piches ఇంగువ
- ½ cup ఉల్లిపాయ తరుగు
- ½ cup టమాటో తరుగు
- 1 litre వేడి నీరు
- కొత్తిమీర - కొద్దిగా
- 1 tbsp ధనియాల పొడి
- ½ tsp జీలకర్ర పొడి
- 1 tsp కారం
- ఉప్పు - రుచికి సరిపడా
- వేడి నీరు - లీటర్ పైన ఉండాలి
- ఆఖరికి తాలింపు కోసం:
- 2 tbsp నెయ్యి
- 2 ఎండుమిర్చి
- ½ tsp జీలకర్ర
- 1 tsp వెల్లులి తరుగు
- ¼ tsp కాశ్మిరీ కారం
విధానం
-
పప్పుని బియ్యం ని గంట సేపు నానబెట్టి కుక్కర్లో వేసి అందులో నెయ్యి పసుపు వేసి మెత్తగా ఉడికించి పక్కనుంచుకోండి.
-
కిచిడి కోసం నూనె నెయ్యి వేడి చేసి అందులో జీలకర్ర అల్లం అపచ్చిమిర్చి వెల్లులి ఇంగువ వేసి వేపుకోండి.
-
జీలకర్ర చిట్లి వెల్లులి మగ్గిన తరువాత ఉల్లిపాయ తరుగు వేసి బంగారు రంగు వచ్చేదాకా వేపుకోండి.
-
ఉల్లి రంగు మారిన తరువాత టమాటో ముక్కలు వేసి టమాటో మెత్తబడే దాకా వేపుకోండి. టమాటో మెత్తబడ్డాక కారం పసుపు జీలకర్ర పొడి ధనియాల పొడి వేసి మసాలాలు మాడకుండా వేపుకోండి.
-
వేగిన మసాలాల్లో మెత్తగా ఉడికించుకున్న అన్నం కొద్దిగా నీరు వేసి మెత్తగా గుజ్జుగా అయ్యేదాకా ఎనుపుకోండి.
-
అన్నం కాస్త గుజ్జుగా అయ్యాక మిగిలిన వేడి నీరు కూడా పోసి 4-5 నిమిషాలు అడుగుపెట్టకుండా కలుపుతూ ఉడికించుకోండి.
-
దింపే ముందు ఉప్పు కొత్తిమీర తరుగు వేసి కలిపి దింపేసుకోండి.
-
నెయ్యి వేడి ఆఖరి తాలింపు సామాగ్రీ అంతా వేసి గుభాళించేలా తాలింపు వేపి స్టవ్ ఆపేసి కారం వేసి కలిపి కిచిడి పైన వేసి వేడివేడిగా వడ్డించండి.

Leave a comment ×
4 comments