రుచికి రుచి ఆరోగ్యం ఇంకా సూపర్ ఈసీ ఆంధ్రుల స్పెషల్ దిబ్బ రొట్టి రెసిపీ. బాచిలర్స్ కూడా సునాయాసంగా చేయగలిగే బెస్ట్ టిఫిన్ దిబ్బ రొట్టి రెసిపీ స్టెప్ బై స్టెప్ ఇమేజెస్ ఇంకా వీడియోతో వివరంగా ఉంది చూడండి.

బయట కరకరలాడుతూ లోపల మెత్తగా కేక్లా అనిపించే తరతరాలనాటి తెలుగు వారి రెసిపీ దిబ్బ రొట్టి. దిబ్బ రొట్టి టిఫిన్గా లంచ్ బాక్సులకి లేదా డిన్నర్గా ఎలా అయినా పర్ఫెక్ట్.

ఈ దిబ్బరొట్టి రెసిపీ పెద్దగా ప్రీ- ప్రిపరేషన్ అవసరం లేదు, జస్ట్ పిండి పోసి 25 నిమిషాలు వదిలేస్తే చాలు తయారు.

ఇంత సింపుల్ రెసిపీకి కొన్ని కచ్చితమైన పద్ధతులు వేసే పదార్ధాలు ఉన్నాయి, వాటిని బట్టే రుచి ఆధారపడి ఉంటుంది. దిబ్బ రొట్టి రెసిపీని హెల్తీగా ఎలా చేయాలి ఇంకా ఏ ఏ తీరుల్లో చేసుకోవచ్చు, ఏవేవి నంజుకుని తినవచ్చు లాంటివన్నీ చాలా వివరంగా ఉంచాను టిప్స్లో చూడండి.

టిప్స్

దిబ్బ రొట్టి పిండి:

నేను చేసిన విధానం:

  1. సాధారణంగా దిబ్బ రొట్టికి అందరూ కప్పు మినపప్పుకి 2.5 లేదా మూడు కప్పుల ఇడ్లీ రవ్వ పోసి చేస్తారు. ఇది ఇడ్లీ పిండే! మినపపిండిలో నానబెట్టిన రవ్వ వేసి కలిపి రాత్రంతా పులియబెట్టి దిబ్బ రొట్టి చేసుకోవచ్చు, లేదా అప్పటికప్పుడు రుబ్బిన పిండితోనూ చేసుకోవచ్చు. ఇది ఒక విధానం.

రెండవ విధానం:

  1. ఇప్పుడు ఇడ్లీ రవ్వ వాడుతున్నారు గాని వెనుకటికి సన్నగా మరాడించిన బియ్యం రవ్వనే నానబెట్టి మినపపిండిలో కలిపేవారు. అంటే కప్పు మినపప్పుకి 2.5- 3 కప్పుల బియ్యం రవ్వ. ఇప్పటికీ ఆంధ్రలోని గోదావరి జిల్లాల వారు బియ్యం రవ్వ వాడి చేసే వారున్నారు.

మూడవ విధానం:

  1. ఆరోగ్యంగా కావాలంటే పొట్టు మినపప్పు, బియ్యం రవ్వ, లేదా ఇడ్లీ రవ్వ వాడి చేసుకోవచ్చు. ఇడ్లీ రవ్వకి బదులు ఉప్పుడు బియ్యం వేసి పప్పు రుబ్బి కూడా చేసుకోవచ్చు, కానీ కాస్త బరకగా ఉంటే బాగుంటుంది పిండి. ఎక్కువ కరకరాలడాలంటే రవ్వ కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు.

నాలుగవ విధానం:

  1. నేను వేరుశెనగ నూనే వాడి చేశాను, మీరు స్వచ్ఛమైన వెన్నతోనూ కాల్చుకోవచ్చు, ఇంకా కొందరు ఇంగువని నూనెలో మరిగించి ఆ ఇంగువ నూనెతో చేస్తారు. మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు. దిబ్బ రొట్టె కాల్చడానికి:

  2. దిబ్బ రొట్టె కాస్ట్ ఐరన్ లేదా అడుగు మందంగా ఉండే ఇనుప మూకుళ్లలో కాలితే వచ్చే రుచి నాన్ స్టిక్ పాన్లా మీద రాదు. ఇనుప ముకుళ్ల మీద చేసే దిబ్బ రొట్టె మాడదు పైగా కరకరలాడుతూ ఉంటుంది. ఇనుప మూకుళ్ళు లేని వారు అడుగు మందంగా ఉండే ప్రెషర్ కుక్కర్లోనూ చేసుకోవచ్చు.

  3. సాధారంగా స్ట్రీట్ ఫుడ్గా దొరికే దిబ్బ రొట్టి ధం మీద కాలుస్తారు. అంటే దిబ్బ రొట్టి పైన ప్లేట్ పెట్టి దాని మీద కాలిన బొగ్గులు వేసి రెండు వైపులా ఎర్రగా కాల్చి ఇస్తారు. ఇళ్ళలో చేసే వారికి ఆ ధం విధానం కాస్త ఇబ్బంది అందుకే నేను ఒక వైపు కాలిన తరువాత పెనం మీద వేసి కాసేపు ఎర్రగా కాల్చాను. మీరు కావాలంటే ఒకే వైపు ఎర్రగా కాల్చి తినవచ్చు.

బెల్లం పానకం:

  1. దిబ్బ రొట్టికి బెల్లం పానకం బెస్ట్ జోడీ. గోదావరి జిల్లాలో బెల్లం తయారయ్యే బట్టీల దగ్గర బెల్లంగా గట్టిగా తయారవ్వడానికి ముందు చెరుకు రసం బాగా మరిగి మరిగి చిక్కని తేనెలా అవుతుంది, అలాంటప్పుడు ఆ పానకాన్ని వడకట్టి సీసాల్లో పోసి ప్రేత్యేకంగా అమ్ముతారు. అక్కడి వారు ఆ చెరుకు పానాకాన్నే ఇష్టంగా తింటారు. ఆలాంటి పానకం అన్నీ ప్రాంతాల వారికి దొరకడం కష్టం అందుకే ½ కప్పు బెల్లంలో కాసిని నీళ్ళు పోసి మరిగించి జిగురు పాకం వచ్చాక దింపి వడకట్టి చేసినది కూడా దాదాపుగా అదే రుచితో ఉంటుంది. కాబట్టి దిబ్బ రొట్టి చేసినప్పుడు ఇలా బెల్లం పానకం చేసుకోండి.

పొడులు & పచ్చళ్లు:

  1. దిబ్బ రొట్టి బెల్లం పానకంతో పాటు కారం పొడి, బొంబాయ్ చట్నీ, కొబ్బరి పచ్చడి అల్లం పచ్చడి ఇలా దేనితో తిన్నా చాలా రుచిగా ఉంటుంది.

ఆఖరుగా:

  1. దిబ్బ రొట్టె పిండి (ఇడ్లీ పిండి) ని ఎప్పుడు ముకుడుకి ¾ భాగం వరకే పోయాలి. రొట్టె కాలేప్పుడు పిండి కొద్దిగా పైకి పొంగుతుంది.

దిబ్బ రొట్టి - రెసిపీ వీడియో

Dibba rotti recipe | How to make Andhra Minapa Rotti Recipe

Breakfast Recipes | vegetarian
  • Prep Time 1 min
  • Cook Time 25 mins
  • Total Time 26 mins
  • Servings 5

కావాల్సిన పదార్ధాలు

  • 350 gms ఇడ్లీ పిండి
  • ఉప్పు
  • 1 tsp జీలకర్ర
  • 3 tbsp నీళ్ళు
  • 1/3 cup నూనె

విధానం

  1. ఇడ్లీ పిండిలో ఉప్పు జీలకర్ర కొద్దిగా నీళ్ళు వేసి బాగా బీట్ చేసుకోండి (బీట్ చేస్తే బాగా పొంగుతుంది).
  2. అడుగు మందంగా ఉండే ముకుడు అంతా నూనె పూసి ఉంచండి (పర్ఫెక్ట్ దిబ్బ రొట్టి కాల్చడానికి టిప్స్ చూడండి ).
  3. నూనె రాసిన మూకుడులో మిగిలిన నూనె పోసి వేడి చేసుకోండి. తరువాత ఇడ్లీ పిండి అంతా పోసి మధ్యలో నీళ్ళు నింపిన గ్లాస్ గుచ్చి మూత పెట్టి సన్నని సెగ మీద 25 నిమిషాలు వదిలేయండి.
  4. 25 నిమిషాల తరువాత టూత్ పిక్ గుచ్చండి. పుల్లకి పిండి అంటుకోకుండా క్లీన్గా వస్తే దిబ్బ రొట్టె లోపల ఉడికినట్లే, ఇంకా అడుగు ఎర్రగా కాలీ ఉంటుంది.
  5. తరువాత మధ్యలో ఉంచిన నీళ్ళ గ్లాస్ని తీసేయండి. అట్లకాడతో అడుగు నుండి తీస్తే సులభంగా వచ్చేస్తుంది. (దిబ్బ రొట్టె తయారయ్యింది నచ్చితే ఇలా తినేవచ్చు లేదా).
  6. పెనం మీద 1 tbsp నూనె వేడి చేసి దిబ్బ రొట్టె పై వైపు పెనం మీద వేసి 10 నిమిషాలు సన్నని సెగ మీద వదిలేస్తే ఎర్రగా కాలుతుంది.
  7. రెండు వైపులా కాలిన దిబ్బ రొట్టిని చెరుకు/బెల్లం పానకంతో లేదా మీకు నచ్చిన పొడి చట్నీతో ఆస్వాదించండి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

6 comments