డ్రై ఫ్రూట్ పాయసం | డ్రై ఫ్రూట్ ఖీర్

Dry Fruit Payasam డ్రై ఫ్రూప్ట్స్ ని నానబెట్టి బరకగా రుబ్బి పాలల్లో దగ్గరగా ఉడికించి చేసే ఈ సింపుల్ పాయసం రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం. 

  • పండుగే కానివ్వండి లేదా చిన్న పార్టీనే అవ్వొచ్చు ఈ సింపుల్ డ్రై ఫ్రూట్స్ పాయసం చేసి చుడండి గ్లాసులు గ్లాసులు లాగించేస్తారు. 

  • సాధారణంగా డ్రై ఫ్రూట్స్ తినడానికి చిన్న పిల్లలు మారం చేస్తుంటారు అలాంటి వారికి చల్లగా ఎంతో రుచిగా ఉండే ఈ పాయసం ఇవ్వండి తప్పక గ్లాసు ఖాళీ చేసి తీరుతారు!!!

టిప్స్

డ్రై ఫ్రూట్స్:

  • డ్రై ఫ్రూట్స్ ఇవే కాదు మీకు నచ్చినవి మితంగా వేసుకోవచ్చు.

సేమియా/సగ్గుబియ్యం:

  • ఈ పాయసంలో డ్రై ఫ్రూట్స్ తప్ప ఇంకేవి ఉండవు కాబట్టి మీకు నచ్చితే సేమియాని ఉడికించి కొద్దిగా కలుపుకోవచ్చు అలాగే సగ్గుబియ్యం అయినా ఉడికించి కలుపుకుని చేసుకోవచ్చు.

పంచదార:

  • ఇక్కడ మీరు పంచదారకి బదులు కరిగించిన బెల్లం పోసుకోవచ్చు లేదా పాయసం అంతా తయారయ్యాక తేనె కూడా వేసుకోవచ్చు.

డ్రై ఫ్రూట్ పాయసం | డ్రై ఫ్రూట్ ఖీర్ - రెసిపీ వీడియో

Dry Fruit Payasam | Dry Fruit Kheer | How to make kheer | vismai food kheer

Sweets | vegetarian
  • Prep Time 1 min
  • Soaking Time 1 hr
  • Cook Time 20 mins
  • Total Time 1 hr 21 mins
  • Servings 4

కావాల్సిన పదార్ధాలు

  • ¼ cup జీడిపప్పు
  • ¼ cup బాదాం
  • 4 అంజీరాలు
  • 3 ఎండు ఖర్జూరం
  • 1 tbsp గసగసాలు
  • 1 litre చిక్కని పాలు
  • కుంకుమ పువ్వు
  • ¼ - ⅓ cup పంచదార
  • ¼ tsp యాలకల పొడి
  • ⅛ tsp జాజికాయ పొడి

విధానం

  1. డ్రై ఫ్రూట్స్ అన్ని విడివిడిగా వేడి నీరు పోసి కనీసం గంట సేపు నానబెట్టుకోండి.
  2. గంట తరువాత ముందు జీడిపప్పు బాదాం వేసి బరకగా పలకులుగా గ్రైండ్ చేసుకోండి.
  3. తరువాత మిగిలిన పదార్ధాలన్నీ వేసి రవ్వగా గ్రైండ్ చేసుకోండి.
  4. చిక్కని పాలల్లో కుంకుమ పువ్వు, బరకగా రుబ్బుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి పాలు ముప్పావు అంటే 750ml అయ్యేవరకు కలుపుతూ మరిగిస్తూనే ఉండాలి. సరిగ్గా కలపకపోతే అడుగుపట్టేస్తుంది.
  5. 750ml అయ్యాక, పంచదార వేసి 2-3 నిమిషాలు మరిగించండి.
  6. దింపే ముందు జాజికాయ పొడి, యాలకలు పొడి వేసి కలిపి చల్లార్చి ఫ్రిజ్లో 2-3 గంటలు ఉంచి చల్లగా సర్వ్ చేయండి

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.