ఎండు రొయ్యలు టొమాటో తొక్కు పచ్చడి | మనం మరిచిపోయిన ఎండు రొయ్యలు టొమాటో తొక్కు పచ్చడి

రొయ్యలు అంటే ఇష్టపడే వారికి తిన్నకొద్దీ తినాలనిపించే ఆంధ్రా స్పెషల్ “ఎండు రొయ్యలు టొమాటో తొక్కు పచ్చడి” చేసి పెట్టండి చాలా తృప్తిగా భోజనం చేస్తారు. వేడిగా అన్నం రొట్టెలు ఎందులోకైనా చాలా రుచిగా ఉండే ఈ తొక్కు పచ్చడి సతెవ బై స్టెప్ ఇమేజెస్ ఇంకా వీడియో ఉంది చూడండి.

పాతకాలం వంటలే వంటలు. వేసేవి నాలుగైదు పదార్ధాలే అయినా, చేసే తీరులోనే ఉంది రుచి. ఈ సింపుల్ ఎండు రొయ్యలు టొమాటో తొక్కు పచ్చడి స్మోకీ ఫ్లేవర్తో చాలా రుచిగా ఉంటుంది, పైగా ఈ పచ్చడి వారం పైన నిలవ ఉంటుంది కూడా. ఎండు రొయ్యలు అంటే ఇష్టపడని వారు కూడా ఇలా చేస్తే ఎంతో ఇష్టంగా తింటారు.

Dry Prawns Tomato Chutney | Dried Prawn Chutney | Dry Prawns Tomato Thokku Chutney | How to make Dry Prawns Chutney

టిప్స్

రొయ్యలు:

  1. రొయ్య పొట్టు అంటే ఎండిన రొయ్య పిల్లలు. ఇవి పాకెట్స్లో ఇంకా విడిగా కూడా దొరుకుతాయ్

  2. రొయ్య పొట్టు సెగ మీద కలుపుతూ చెమ్మారే దాకా వేపుకుంటే చాలు, అప్పుడు పచ్చడికి మాంచి రుచి. ఎక్కువగా వేపితే చేదుగా ఉంటుంది పచ్చడి

టొమాటో:

  1. నేను నాటు పుల్లని టొమాటోలు వాడాను, అవైతేనే పుల్లగా ఉంటుంది పచ్చడి. మీకు పుల్లని టొమాటోలు దొరకనట్లైతే మామూలు టొమాటోలు వాడి ఆఖరున కాస్త నిమ్మరసం పిండుకోండి

కారం:

  1. నేను పచ్చళ్ల కారం వాడాను కాబట్టి 2.1/2 tbsp వాడాను, మీరు మామూలు కారం వాడినట్లైతే కొంచెం పెంచుకోండి.

    నూనె:

  2. ఈ పచ్చడిలో నూనె కాస్త ఎక్కువగా ఉండాలి, అప్పుడు పచ్చడి రుచిగా ఉంటుంది నిలవా ఉంటుంది.

ఎండు రొయ్యలు టొమాటో తొక్కు పచ్చడి | మనం మరిచిపోయిన ఎండు రొయ్యలు టొమాటో తొక్కు పచ్చడి - రెసిపీ వీడియో

Dry Prawns Tomato Chutney | Dried Prawn Chutney | Dry Prawns Tomato Thokku Chutney | How to make Dry Prawns Chutney

Pickles & Chutneys | nonvegetarian
  • Prep Time 5 mins
  • Cook Time 25 mins
  • Total Time 30 mins
  • Servings 6

కావాల్సిన పదార్ధాలు

  • 1 cup రొయ్య పొట్టు
  • 10 వెల్లులి
  • 300 gm టొమాటోలు
  • 1 1/2 cup ఉల్లిపాయ
  • 2 పచ్చిమిర్చి
  • 3 ఎండు మిర్చి
  • 1 tsp ఆవాలు
  • 1 tsp మినపప్పు
  • 1/4 tsp పసుపు
  • 2 tsp ధనియాల పొడి
  • 2 1/2 tsp కారం
  • ఉప్పు
  • 2 రెబ్బలు కరివేపాకు
  • 1/3 cup నూనె

విధానం

  1. రొయ్య పొట్టుని మూకుడులో వేసి మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ 2-3 నిమిషాలు సెగ తగిలేలా వేపితే రొయ్యకి ఉండే సన్నని పొట్టు ఊడుతుంది
  2. వేపిన రొయ్యలని జల్లేడలో వేసి రొయ్యలపైన పైన నీళ్ళు పోసి కడగండి. అలాగే వెల్లులిని దంచుకోండి
  3. కడిగిన రొయ్యలలో కొద్దిగా నూనె, ఉప్పు, దంచిన వెల్లులి వేసి బాగా కలుపుకోండి
  4. రొయ్యలు ఉన్న జల్లెడతో పాటు పొయ్యి మీద పెట్టి 3-4 నిమిషాలు కలుపుతూ వేపుకోవాలి(ఎక్కువగా వేపితే చేదుగా అవుతుంది) వేగిన రొయ్యలని దింపి పక్కనుంచుకోండి
  5. ముకుడులో నూనె వేసి టొమాటోలు వేసి మూతపెట్టి మీడియం ఫ్లేమ్ మీద మధ్యమధ్యన కలుపుతూ మగ్గించుకోవాలి. 15 నిమిషాలకి టొమాటోలు మెత్తగా మగ్గుతాయ్ అప్పుడు గరితతో గుజ్జుగా చేసి దింపేసుకోండి
  6. ముకుడులో మిగిలిన నూనె పోసి వేడి చేసి అందులో ఆవాలు మినపప్పు ఎండుమిర్చి వేసి వేపుకోవాలి
  7. వేగిన తాలింపులో ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేసి ఉల్లిపాయలు మెత్తగా మగ్గనివాలి. మగ్గిన ఉల్లిపాయాల్లో ఉప్పు, ధనియాల పొడి, కారం, టొమాటో గుజ్జు వేసి నూనె పైకి తేలేదాక మూతపెట్టి మీడియం ఫ్లేమ్ మీద మగ్గనివ్వాలి
  8. నూనె పైకి తేలాక వేపుకున్న రొయ్య పొట్టు వేసి బాగా కలిపి మూత పెట్టి నూనె పైకి తేలేదాక వేపి దింపేసుకోవాలి. ఈ తొక్కు కనీసం వారం రోజులు నిలవ ఉంటుంది.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

Dry Prawns Tomato Chutney | Dried Prawn Chutney | Dry Prawns Tomato Thokku Chutney | How to make Dry Prawns Chutney