తమలపాకు అన్నం
ఘాటుగా కారంగా కమ్మగా తమలపాకుల సువాసనతో ఎంతో రుచిగా ఉండే రెసిపీ తమలపాకు అన్నం. ఈ అన్నం లంచ్ బాక్సులకి పర్ఫెక్ట్, ఇంకా అన్నం మిగిలిపోయినా ఘుమఘుమలాడే ఈ సింపుల్ తమలపాకు అన్నం చేసి పెడితే ఇష్టంగా తినేస్తారు.
సాధారణంగా దక్షిణభారత దేశం అన్నంతో ఎన్ని వంటకాలో అన్నీ వేటికవే ప్రేత్యేకం. ఈ తమలపాకుల అన్నంకూడా అంతే! నేను ఇది వరకు తమలపాకుల చారు రెసిపీ పోస్ట్ చేసిన రోజు నుండి నాకు తమలపాకుతో ఏదైనా రెసిపీ చేయాలని ఎంతగానో ఆలోచించా, కొన్ని సార్లు కొన్ని కాంబినేషన్స్తో కుదిరేది కాదు, ఆఖరుకి అసలు తమలపాకు ఫ్లేవర్ని అర్ధం చేసుకుని దాని సువాసనని రుచిని నిలుపుతూ చేస్తే బాగుంటుంది కాదా అనిపించి ఈ కాంబినేషన్తో చేశా మా టీమ్ అందరికీ నచ్చింది, కాబట్టి అదే రెసిపీ పోస్ట్ చేస్తున్నా!

టిప్స్
తమలపాకులు:
-
ఈ కొలత అన్నానికి చిన్నవి అయితే 6-7 పెద్ద ఆకులు అయితే 5 చాలు. అంత కంటే వేస్తే ఆకు ఘాటుకి తినలేరు.
-
తమలపాకు వేసి 3 నిమిషాలు వేపితే చాలు అంతకంటే వేగితే ఆకు పరిమళం తగ్గిపోతుంది.
వెల్లులి:
పొడిలో నేను వెల్లులి వేసాను. నచ్చని వారు మినపప్పుతో పాటు పచ్చికొబ్బరిని వేపి పొడి చేసుకుని వాడుకోవచ్చు.
చిన్న మార్పులు:
నచ్చితే ఉల్లిపాయ వేగిన తరువాత ఒక్క టమాటో వేసి మెత్తగా మగ్గించుకుని అన్నంలో కలుపుకున్న రుచిగా ఉంటుంది
తమలపాకు అన్నం - రెసిపీ వీడియో
Easy Betel Leaves Rice with Leftover Rice
Prep Time 20 mins
Cook Time 10 mins
Total Time 30 mins
Servings 4
కావాల్సిన పదార్ధాలు
- 5 తమలపాకులు తరుగు
- 1 cup ఉల్లిపాయ
- 4 tbsp నూనె
- ఉప్పు - రుచికి సరిపడా
- 1/2 tsp పసుపు
- 1 tsp ఆవాలు
- 1/2 tsp జీలకర్ర
- 1.5 cup బియ్యాన్ని పొడి పొడిగా వండుకున్న అన్నం
-
పొడి కోసం
- 2 tbsp మినపప్పు
- 5 ఎండుమిర్చి
- 10 వెల్లులి
- 2 tbsp నువ్వులు
విధానం
-
మినపప్పు వెల్లులి వేసి మినపప్పు మాంచి సువాసన వచ్చేదాకా వేపుకోవాలి.
-
పప్పు రంగు మారుతుండగా ఎండుమిర్చి వేసి వేపుకోవాలి ఆ తరువాత నువ్వులు వేసి చిట్లనిచ్చి మీకేసీలో వేసి మెత్తని పొడి చేసుకోండి (వెల్లులి తినని వారు టిప్స్ చుడండి).
-
నూనె వేడి చేసి అందులో ఆవాలు జీలకర్ర వేసి చిట్లనివ్వాలి.
-
ఆవాలు జీలకర్ర వేగాక ఉల్లిపాయ తరుగు ఉప్పు పసుపు వేసి ఉల్లిపాయ మెత్తబడేదాకా వేపుకోవాలి.
-
ఉల్లిపాయ మెత్తబడ్డాక తమలపాకు తరుగు వేసి 3 నిమిషాలు వేపుకుంటే చాలు.
-
తరువాత పొడి పొడిగా వండుకున్న అన్నం మినపప్పు పొడి వేసి హై ఫ్లేమ్ మీద 3-4 నిమిషాలు టాస్ చేసి దింపేసుకోండి.

Leave a comment ×
7 comments