మటన్ పులావ్ కుక్కర్లో | 100% బెస్ట్ మటన్ పులావ్ కుక్కర్లో

నా స్టైల్ ఈసీ మటన్ పులావ్ రెసిపీ బ్యాచిలర్స్, వంట రానివారు కూడా ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ సింపుల్ రెసిపీ స్టెప్ బై స్టెప్ ఇమేజెస్ ఇంకా వీడియోతో ఉంది చూడండి.

బెస్ట్ మటన్ పులావ్ చేయడం ఎంత ఈసీనో ఈ రెసిపీ ఫాలో అయితే తెలుస్తుంది. చికెన్ పులావ్ కంటే మటన్ పులావ్ కాస్త కష్టమని ఎక్కువగా చేయరు. కానీ చేసే తీరుమీద ఆధారపడి ఉంది అంటాను నేను. ఈ రెసిపీ చూస్తే మీకే తెలుస్తుంది, సింపుల్గా బెస్ట్ మటన్ పులావ్ ఎలా చేయాలో.

బెస్ట్ మటన్ పులావ్ అని ఎందుకన్నానంటే ఎప్పుడు చేసినా ఒకేలాంటి రుచితో పాటు అన్నీ ఇంట్లో ఉండే పదార్ధాలతో తయారువుతుంది కాబట్టి.

Try Chicken Pulao in Pressure Cooker and Prawns Pulao

Easy Mutton Pulao in a cooker | Mutton Pulav Recipe | How to make Mutton Pulao in Cooker | Mutton Pulao in Pressure Cooker

టిప్స్

  1. మటన్ ఎప్పుడు లేతగా ఉంటే త్వరగా ఉడుకుతుంది పులావ్ రుచిగా కూడా ఉంటుంది.

  2. మటన్ కడిగి కొద్దిగా నీళ్ళు పోసి 2 tsp ఉప్పు వేసి నానబెడితే మటన్ త్వరగా ఉడుకుతుంది.

  3. మటన్ ఉదకడానికి పోసిన నీరు మటన్ ఉడికాక ఒక కప్పు దాకా ఉంటుంది. తరువాత మిగిలిన నీరు బియ్యనికి సమానంగా కంటే కాస్త ఎక్కువ పోసుకోవాలి. అంటే నేను 1.5 కప్పుల బియ్యం తీసుకుంటే దీనికి 2 కప్పుల నీరు అవసరమవుతుంది. ఇది మటన్ ఉడకగా మిగిలిన నీరుతో కలిపి.

  4. ఇదే సోనా మసూరి బియ్యంతో అయితే 1.5 కప్పుల బియ్యనికి 2.5 కప్పుల నీరు అవసమవుతుంది. రెండు కూతలు రానివ్వాలి. తరువాత 20 నిమిషాలు రెస్ట్ ఇవాలి స్టవ్ ఆపేసి.

మటన్ పులావ్ కుక్కర్లో | 100% బెస్ట్ మటన్ పులావ్ కుక్కర్లో - రెసిపీ వీడియో

Easy Mutton Pulao in a cooker | Mutton Pulav Recipe | How to make Mutton Pulao in Cooker | Mutton Pulao in Pressure Cooker

Mutton Recipes | nonvegetarian
  • Prep Time 15 mins
  • Cook Time 25 mins
  • Resting Time 20 mins
  • Total Time 1 hr
  • Servings 3

కావాల్సిన పదార్ధాలు

  • 4 tbsp నూనె/నెయ్యి
  • 2 ఇంచులు దాల్చిన చెక్క
  • 6 లవంగాలు
  • 6 యాలకలు
  • 1 tsp షాహీ జీరా
  • 1 నల్ల యాలక
  • 1 బిరియానీ ఆకు
  • 1 cup ఉల్లిపాయ చీలికలు
  • 6 పచ్చిమిర్చి చీలికలు
  • 1 tsp గరం మసాలా
  • పసుపు – రెండు చిటికెళ్లు
  • 1/2 tsp వేయించిన జీలకర్ర పొడి
  • ఉప్పు
  • 1.5 tbsp అల్లం వెల్లులి ముద్దా
  • 2 tbsp ఎండిన గులాబీ రేకులు/ రోజ్ వాటర్ (1 tsp)
  • 1.5 cup బాసమతి బియ్యం (గంట సేపు నానబెట్టుకోవాలి) - 250 gm)
  • 300 gm మటన్ (2 గంటలు ఉప్పు వేసిన నీళ్ళలో నానబెట్టినది)
  • 1.5 cup మటన్ ఉడికించడానికి నీరు
  • 1 cup పులావ్ వండడానికి నీరు

విధానం

  1. కుక్కర్ లో నూనె పోసి అందులో చెక్కా, లవంగాలు, దాల్చిన చెక్క, నల్ల యాలక, యాలకలు, షాహీ జీరా వేసి వేపుకోవాలి
  2. ఉల్లిపాయ, పచ్చిమిర్చి చీలికలు వేసి ఉల్లిపాయని ఎర్రగా వేపుకోవాలి
  3. ఉల్లిపాయలు ఎర్రబడుతుండగా అల్లం వెల్లులి ముద్ద వేసి వేపుకోవాలి
  4. మటన్ వేసి 4-5 నిమిషాలు వేపుకోవాలి. వేపుకున్న మటన్లో కారం జీలకర్ర పొడి, ఉప్పు, పసుపు తగినన్ని నీళ్ళు పోసి మటన్ మెత్తగా ఉడ కనివ్వండి.
  5. మటన్ ఉడికిన తరువాత నీరు 1 కప్పు ఉంటుంది. అందులో నానబెట్టిన బియ్యం, ఉప్పు, మరో కప్పు కంటే కాస్త తక్కువ నీరు, ఎండిన గులాబీ రేకులు వేసి కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 1 విసిల్ రానిచ్చి స్టవ్ ఆపేసి 20 నిమిషాలు వదిలేయండి.
  6. 20 నిమిషాల తరువాత అట్లకాడతో అడుగునుండి కలిపి మిర్చీ కా సాలన్ ఇంకా పెరుగు చట్నీతో సర్వ్ చేసుకోండి

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

1 comments

  • B
    Bramha
    Recipe Rating:
    Sir ,you said to add mirchi powder hear and garam masala in vedio, which one Is correct.
Easy Mutton Pulao in a cooker | Mutton Pulav Recipe | How to make Mutton Pulao in Cooker | Mutton Pulao in Pressure Cooker