కరకరలాడుతూ అక్కడక్కడ జీడిపప్పు పలుకులు తగులుతూ ఎంతో రుచిగా ఉండే హైదరాబాద్ మటన్ ఛుడ్వా ఒక్కసారి చేసి ఉంచుకుంటే కనీసం నెల రోజుల పైన నిల్వ ఉంటుంది. నిజం చెప్తున్నాను మీరు ఈ రెసిపీని తినకపోతే చాలా మిస్ అయినట్లే!!!

వేడి వేడి పప్పు అన్నంతో పప్పు చారు, రసం అన్నంతో నంజుకుతినాడికి పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ మటన్ ఛుడ్వా. రెసిపీ చాలా సులభం మసాలాలాతో మటన్ మెత్తగా ఉడికించి నూనెలో వేపి మసాలా పొడులు చల్లి దింపేసుకోవడమే. కానీ, కొన్ని కచ్చితమైన టిప్స్ పాటించాలి అప్పుడే మటన్ మాడకుండా కారకరాలలాడేట్టు వేగుతుంది.

మీరు ఈ రెసిపీని కూడా ఇష్టపడవచ్చు రాయలసీమ స్టైల్ మటన్ ఫ్రై

ఇలాంటి చిట్టి చిట్కాలు చాలానే ఉన్నాయ్ వాటికోసం కింద టిప్స్ చుడండి.

టిప్స్

మటన్:

  1. ఈ ఛుడ్వాకి కచ్చితంగా ఎముకలు లేని లేత మాంసం అవసరం.

  2. మాంసం కుక్కర్లో వేసి నిదానంగా మీడియం ఫ్లేమ్ మీద మెత్తగా ఉడికిపోవాలి. మాంసం ముక్క పట్టి నలిపితే ముక్క చిదిరిపోవాలి, అంత మెత్తగా ఉడకాలి.

మటన్ వేపే తీరు:

  1. మెత్తగా ఉడికిన మటన్ని నూనెలో వేసి మీడియం ఫ్లేమ్ మీదే మధ్యమధ్యలో కలుపుతూ ఎర్రగా వేపుకోవాలి.

  2. కిలో మాంసం నాకు ఎర్రగా వేగడానికి 25 నిమిషాల సమయం పట్టింది.

  3. మాంసం నూనెలోనే ఎర్రగా కారకరాలడేట్టు వేపితే చల్లారాక మాడినట్లు అవుతుంది. ఎర్రగానే వేగాలి కానీ ముదురు ఎరుపు రంగులోకి వేపకండి. అలా వేపితే చల్లారాక మాడినట్లుగా అవుతుంది ఛుడ్వా

మటన్ ఛుడ్వా - రెసిపీ వీడియో

Mutton Chudwa | How to make Mutton Chudwa

Mutton Recipes | nonvegetarian
  • Prep Time 1 min
  • Cook Time 1 hr
  • Total Time 1 hr 1 min
  • Serves 10

కావాల్సిన పదార్ధాలు

  • మాంసానికి మసాలాలు పట్టించడానికి:
  • 1 kg లేత మాంసం
  • 1 tbsp అల్లం వెల్లులి పేస్ట్
  • 1 tbsp ధనియాల పొడి
  • 1/2 tbsp వేపిన జీలకర్ర పొడి
  • ఉప్పు
  • 1 tbsp కారం
  • 1/2 tbsp పసుపు
  • 1 tbsp నూనె
  • 750 ml నీరు
  • ఛుడ్వా వేపడానికి:
  • 3/4 Cup నూనె
  • 1/3 Cup జీడిపప్పు
  • 2 tbsp అల్లం వెల్లులి పేస్ట్
  • 3 Sprigs కరివేపాకు
  • 6-7 ఎండు మిర్చి
  • 1-2 tbsp కారం
  • 1 tbsp చాట్ మసాలా

విధానం

  1. మాంసానికి మసాలాలు పట్టించి నీరు పోసి మీడియం ఫ్లేమ్ మీద 7-8 విజిల్స్ ఉడికించాలి
  2. అవిరి పోయాక మూత తీసి చూస్తే ఇంకా కొంచెం నీరు ఉంటుంది , అప్పుడు మీడియం ఫ్లేమ్ మీద నీరు పూర్తిగా ఇగిరిపోయి ముక్క మెత్తగా అయ్యేదాకా ఉడికించాలి
  3. ఉడికిన మాంసం ముక్కలని పూర్తిగా చల్లార్చాలి. చల్లారిన ముక్కలని దారాల్లా నలిపి తీయాలి
  4. మూకుడులో నూనె వేడి చేసి అందులో జీడిపప్పు వేసి ఎర్రగా వేపి తీసుకోండి. అలాగే కరివేపాకు ఎండు మిర్చి కూడా వేసి వేపుకుని తీసుకోండి
  5. ఇప్పుడు మిగిలియున్న నూనెలో అల్లం వెల్లులి పేస్ట్ దారాల్లా తీసుకున్న మాంసం వేసి మీడియం ఫ్లేమ్ మీద మధ్య మధ్యలో కలుపుతూ ఎర్రగా వేపుకోవాలి
  6. సుమారుగా 25-30 నిమిషాలలో మాంసంలోని నీరు ఇగిరిపోయి కారకరాలలాడడం మొదలవుతుంది, అప్పుడు స్టవ్ ఆపేసి చాట్ మసాలా కారం వేపిన జీడిపప్పు కరివేపాకు ఎండుమిర్చి వేసి బాగా టాస్ చేసి పూర్తిగా చల్లార్చాలి.
  7. ఛుడ్వా పూర్తిగా చల్లారిన తరువాత గాలి చొరని డబ్బాలో పెట్టి ఉంచుకుంటే కనీసం నెల పైన నిలవ ఉంటుంది. పప్పు అన్నంతో లేదా నెయ్యి వేసిన అన్నంతో కలుపుకు తిన్నా చాలా రుచిగా ఉంటుంది.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

1 comments