రాయలసీమ స్టైల్ మటన్ ఫ్రై | మటన్ వేపుడు
మటన్ వేపుడు అంటే ఇష్టమా అయితే రాయలసీమలో చేసే మటన్ వేపుడు వేపపుడు చేసినా బెస్ట్గా వస్తుంది. మటన్ వేపుడు స్టెప్ బై స్టెప్ ఇమేజెస్ ఇంకా వీడియో ఉంది చూడండి.
మటన్ వేపుడు అన్ని ప్రాంతాల్లో చేస్తారు కాని రాయలసీమ ప్రాంతంలో చేసే మటన్ ఫ్రై చాలా కారంగా ఘాటుగా ఉంటుంది. కారం అంటే ఇష్టపడే వారికి మళ్ళీ మళ్ళీ తినేలా ఉంటుంది.
ఈ మటన్ వేపుడు ప్రేత్యేకించి కర్నూల్, చిత్తూర్ జిల్లాల్లో చాలా ఎక్కువగా చేస్తుంటారు!
ఇది కనీసం 2-3 రోజులు నిలవుంటుంది కూడా. ఇది పప్పుచారు లేదా చారు తో చాలా రుచిగా ఉంటుంది.

టిప్స్
-
వేపుళ్ళకి కండగల లేత ఎర్రని మాంసం ఎప్పుడూ బెస్ట్.
-
మటన్ మసాలాలతో ఎంత ఎక్కువ సేపు నానితే అంత బాగుంటుంది వేపుడు
-
మటన్ ని నిదానంగా నీరు ఇగిరెదాక వేపితే కనీసం 2 రోజులు నిలవుంటుంది కూడా
-
వేపుడు చేశాక స్టవ్ ఆపేసి మూత పెడితే ముక్కలు మెత్తగా అవుతాయ్, కాబట్టి జల్లెడ ఉంచండి.
-
మటన్ మరీ ఎక్కువగా వేపితే మాంసంలోని తేమ ఆరి గట్టిగా అవుతాయ్.
రాయలసీమ స్టైల్ మటన్ ఫ్రై | మటన్ వేపుడు - రెసిపీ వీడియో
Spicy Mutton Fry | Andhra Style Spicy Mutton Fry | Rayalaseema Style Mutton Fry | How to make Spicy Mutton Fry
Prep Time 15 mins
Cook Time 40 mins
Total Time 55 mins
Servings 4
కావాల్సిన పదార్ధాలు
- 1/2 Kilo మటన్
- 1 tbsp అల్లం వెల్లులి పేస్టు
- 1 tbsp ధనియాల పొడి
- 2 tbsp కారం
- ఉప్పు
- 3 tbsp నూనె
- 1 tsp పసుపు
-
వేపుడుకోసం
- 1/2 cup నూనె
- 1 tsp అల్లం వెల్లులి పేస్టు
- 2 రెబ్బలు కరివేపాకు
- 4 ఎండు మిర్చి
- 3 పచ్చిమిర్చి
- 1 tsp గరం మసాలా
- 2 tbsp కొత్తిమీర
- 1 tbsp కరివేపాకు
విధానం
-
మటన్ లో ఉంచుకున్న మసాలాలు అన్నీ కలిపి రాత్రంతా ఫ్రిడ్జ్ లో ఉంచేయండి, కుదరనట్లైతే కనీసం 3 గంటలు ఫ్రిజ్లో నాననివ్వండి
-
మరుసటి రోజు కుక్కర్ లో మటన్ ముక్కలు వేసి అందులో 300 ml నీళ్ళు పోసి మీడియం ఫ్లేం మీద 4 విసిల్స్ రానివ్వండి, 3 గంటలు నానినట్లితే 6-7 విసిల్స్ రానివ్వండి
-
మటన్ మెత్తగా ఉడికాక అడుగు మందంగా ఉన్న మూకుడు లో నూనె వేడి చేసి అందులో కరివేపాకు ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసి వేపుకోండి
-
అల్లం వెల్లులి ముద్ద వేసి వేపి, మెత్తగా ఉడికిన్చుకున్న మటన్ నీళ్ళతో సహా వేసి బాగా కలిపి మీడియం ఫ్లేం మీద కలుపుతూ హై- ఫ్లేమ్ మీద ముక్కలని వేగనివ్వండి
-
ముక్కలు 15 నిమిషాలకి వేగి నీరు ఇగిరిపోయి నూనె పైకి తేలుతుంది, అప్పుడు మరో సారి బాగా కలిపి గరం మసాలా వేసి ముక్కలు dryగా అయ్యేదాకా వేపుకోండి.
-
దింపే ముందు కొత్తిమీర కరివేపాకు వేసి వేపి దిమ్పెసుకోండి
-
నా దగ్గర నేను వేపి చేసుకున్న గరం మసాలా ఉంది కాబట్టి వేశాను. మీరు గరం మసాలా అప్పటికప్పుడు చేసినది వాడుకుంటే మసాలా ఘాటు మాంసానికి పట్టి చాలా రుచిగా ఉంటుంది.

Leave a comment ×
5 comments