విలేజ్ స్టయిల్ మటన్ కర్రీ
వెనుకటి తీరులో సింపుల్ ఇంకా బెస్ట్ మటన్ కర్రీ!!! ఈ మాంసం కూర కారంగా ఘాటుగా ఉంటుంది సింపుల్గా తయారవుతుంది. ఈ కూర అన్నం గారెలు దోసెలతో ఎంతో రుచిగా ఉంటుంది.
సాధారణంగా మాంసం కూరలు అంటే చాలా హడావిడి. కానీ ఈ తీరులో చేస్తే బెస్ట్ మటన్ కర్రీ వస్తుంది. మసాలాలు అన్నీ మాంసంకి పట్టించి కుక్కర్లో వేసి 5-6 కూతలు రానిచ్చి దింపేస్తే అయిపోయింది కూర. ఇంత సింపుల్గా ఉన్నా ఎంతో రుచిగా ఉంటుంది.
వెనుకటి తీరులో చేసే కూరకి ఎక్కువెక్కువ మసాలాలు లాంటివి ఏవి లేవు. వేసేవి 4-5 పదార్ధాలు అంతే, కానీ మాంసం వన్డే తీరు వేసే పదార్ధాల కొలతలు వీటి మీదే ఉంది రుచి.
వెనుకటికి తెలుగు వారు ఈ తీరులోనే మాంసం కూర వన్డే వారు, కానీ మట్టి పాత్రల్లో నిదానంగా చేసే వారు. నేను కుక్కర్లో చేస్తున్నాను. పెద్దగా టిప్స్ ట్రిక్స్ ఏమి అవసరం లేదు, ఉప్పు కారాలు సరైన మోతాదులో ఉంటె చాలు అంతే!
Try this: Andhra Style Mutton Fry

టిప్స్
-
మాంసానికి మసాలాలు బాగా రుద్ది పట్టించి కనీసం గంట లేదా రాత్రంతా ఫ్రిజ్లో ఉంచితే మాంసానికి మసాలాలు బాగా పట్టి మెత్తగా ఉడుకుతుంది.
-
మాంసం ఎంత లేతగా ఉంటె అంత త్వరగా ఉడుకుతుంది. నాకు 5 విజిల్స్లో మాంసం ఉడికిపోయింది, మీరు మీ మాంసం క్వాలిటీని బట్టి ఉడికించుకొండి.
-
ఈ కూరని రుచి చూసి ఉప్పు కారాలు మీకు తగినట్లుగా వేసుకోండి. ఇంకా మాంసం కూరలకి నూనెలు ఉండాలి అప్పుడే రుచి.
విలేజ్ స్టయిల్ మటన్ కర్రీ - రెసిపీ వీడియో
Village Style Mutton Curry | Mutton Curry | How to make Mutton Curry in Village Style
Prep Time 5 mins
Cook Time 40 mins
Resting Time 1 hr
Total Time 1 hr 45 mins
Servings 5
కావాల్సిన పదార్ధాలు
-
మాంసం నానబెట్టడానికి
- 1/2 kg మాంసం
- 2 tbsp నూనె
- 1 tbsp అల్లం వెల్లులి పేస్ట్
- ఉప్పు
- 1 tsp నిమ్మరసం
- 1/2 tsp పసుపు
- 200 ml ఉల్లిపాయ తరుగు
- 1 cup టమాటో పేస్ట్
- 3 tbsp కారం
- 1/4 cup ధనియాల పొడి
- 3 యాలకలు
- 5 లవంగాలు
- 2 ఇంచులు దాల్చిన చెక్క
- 1/2 tsp మిరియాలు
- 2 బిరియానీ ఆకులు
- 1 tsp జీలకర్ర
- 1/3 cup నూనె
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
- 4 పచ్చిమిర్చి - చీరినవి
- 250 ml నీళ్లు
విధానం
-
కడిగిన మాంసంలో అల్లం వెల్లులి ముద్దా, ఉప్పు పసుపు నిమ్మరసం నూనె వేసి బాగా రుద్ది మసాజ్ చేసి ఫ్రిజ్ లో రాత్రంతా లేదా ఒక గంట ఫ్రిజ్లో ఉంచండి.
-
ఫ్రిజ్లోంచి తీసిన మాంసంలో మిగిలిన సామాగ్రీ అంతా వేసి మాంసాన్ని మెదుపుతూ మసాలాలు నూనె పట్టించండి.
-
కుక్కర్లో నూనె వేడి చేసి అందులో మాంసం కొద్దిగా నీళ్లు పోసి కుక్కర్ మూతపెట్టి 5 విజిల్స్ మీడియం ఫ్లేమ్ మీద రానిచ్చి దింపేసుకోండి.(లేదా మాంసం మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోవాలి).
-
స్టీమ్ పోయి మాంసం మెత్తగా ఉడికాక కుక్కర్ మూత తీసి మళ్ళీ స్టవ్ మీద పెట్టి కొత్తిమీర తరుగు వేసి మరో 4-5 నిమిషాలు ఉడికించి దింపేసుకుంటే చిక్కని ఘాటైన మాంసం కూర తయారు.

Leave a comment ×
4 comments