బ్యాచిలర్స్ చికెన్ కర్రీ

మసాలా దినుసులని నెమ్మదిగా వేపి నీలతో పేస్ట్ చేసి చికెన్ని పట్టించి నూనెలో నెమ్మదిగా మగ్గించి చేసే చికెన్ కర్రీ బ్యాచిలర్స్ ఇప్పుడిప్పుడే వంట నేర్చుకునే వారు అద్దిరిపోయేలా చేసేలా ఉంటుంది.

ఘాటైన ఘుమఘుమలాడే చికెన్ కర్రీ నేను బ్యాచిలర్స్ని ఇంకా స్పైస్ని ఎక్కువగా ఇష్టపడే వారిని దృష్టిలో ఉంచుకుని మామూలు చికెన్ కర్రీకి చిన్న మార్పులు జోడించి చేసిన రెసిపీ.

ఈ తీరు చికెన్ కర్రీలో చికెన్లో మసాలాలు అన్నీ కలిపేసి ఊరబెట్టి నూనెలో మగ్గించి దింపేసుకోవడమే! ఈ కర్రీ వేడిగా అన్నంతో, బగారా అన్నంతో చాలా రుచిగా ఉంటుంది.

Easy Spicy Chicken Curry

టిప్స్

చికెన్:

చికెన్ శుభ్రం చేసాక కిలో ఉండే కోడి వాడుకోవడం మేలు. ఆ కోడి అయితేనే లేతగా ఉంటుంది మసాలాలు పట్టి రుచిగా ఉంటుంది.

చికెన్కి మసాలాలు పట్టించి కనీసం 30 నిమిషాలైనా నాననివ్వాలి.

మసాలా పేస్ట్:

మసాలా దినుసులన్నీ నెమ్మదిగా సన్నని సెగ మీద వేగనివ్వాలి, అప్పుడు మసాలాలు లోపలిదాకా వేగి మాంచి సువాసనతో ఉంటుంది మసాలా పేస్ట్.

కారం:

ఈ కూరకి కారమంతా యందు మిరపకాయలని చేసే పేస్ట్ ద్వారానే రావాలి. నేను మీడియం కారం మిరపకాయలని వాడాను.

గసగసాలు:

గసగసాలు కూరకి కమ్మదనాన్ని ఇస్తుంది. దొరకని జీడిపప్పుని వేపుకుని వేసుకోవచ్చు.

బ్యాచిలర్స్ చికెన్ కర్రీ - రెసిపీ వీడియో

Easy Spicy Chicken Curry

Bachelors Recipes | nonvegetarian
  • Prep Time 2 mins
  • Cook Time 40 mins
  • Resting Time 30 mins
  • Total Time 1 hr 12 mins
  • Servings 5

కావాల్సిన పదార్ధాలు

  • 1/2 Kilo చికెన్
  • 4 యాలకలు
  • 8 లవంగాలు
  • 1/2 tsp మిరియాలు
  • 1 tsp జీలకర్ర
  • 2 tbsp ధనియాలు
  • 2 inches దాల్చిన చెక్క
  • 1/3 cup ఎండుకొబ్బరి
  • పత్తర్ ఫ్యూల్ - కొంచెం
  • 1 tbsp గసగసాలు
  • 1 మరాఠీ మొగ్గ
  • 15 ఎండు మిర్చి
  • 1/2 cup పెరుగు
  • 1 tbsp అల్లం వెల్లులి పేస్ట్
  • 1/4 tsp పసుపు
  • ఉప్పు రుచికి సరిపడా
  • 2 tbsp నూనె
  • 1 tbsp నిమ్మరసం
  • 4 tbsp పచ్చిమిర్చి చీలికలు
  • కొత్తిమీర పుదీనా తరుగు - కొద్దిగా
  • కర్రీ కోసం
  • 1/4 cup నూనె
  • 1/2 cup ఉల్లిపాయ తరుగు
  • 10 వెల్లులి
  • 2 రెబ్బలు కరివేపాకు
  • 1 cup టమాటో తరుగు
  • 1/2 liter నీళ్లు
  • 1 tsp నిమ్మరసం
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా

విధానం

  1. చికెన్ మసాలా కోసం ఉంచిన పదార్ధాలన్నీ వేసి సన్నని సెగ మీద మాంచి సువాసన వచ్చేదాకా వేపుకుని మిక్సీలో వేసుకోవాలి.
  2. మిక్సీలో పెరుగు ఉప్పు అల్లం వెల్లులి పేస్ట్ పసుపు వేసి నీళ్లతో మెత్తని పేస్ట్ చేసుకోండి.
  3. చికెన్లో గరిండ్ చేసుకున్న మసాలా పేస్ట్ నూనె నిమ్మరసం పచ్చిమిర్చి ముక్కలు కొత్తిమీర పుదీనా వేసి ముక్కలని గట్టిగా పిండుతూ మసాలా పేస్ట్ పట్టించి కనీసం 30 నిమిషాలైనా నానబెట్టుకోవాలి.
  4. నూనె వేడి చేసి ఉల్లిపాయ తరుగు వెల్లులి కరివేపాకు వేసి ఉల్లిపాయల్ని మెత్తబడేదాకా వేపుకోవాలి.
  5. వేగిన ఉల్లిలో టామాటో ముక్కలు వేసి టమాటో పైన తోలు ఊడేదాక మగ్గించుకుంటే చాలు.
  6. నానబెట్టిన చికెన్ వేసి హై ఫ్లేమ్ మీద నూనె పైకి తేలేదాక మధ్యమధ్యన కలుపుకుంటూ వేపుకోవాలి.
  7. నూనె పైకి తేలిన తరువాత 500ml నీళ్లు పోసి కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద నూనె పైకి తేలేదాక ఉడకనివ్వాలి. సుమారు 25 నిమిషాలకి నూనె పైకి తేలుతుంది.
  8. నూనె తేలాక నిమ్మరసం కొత్తిమీర తరుగు చల్లి దింపి వేడిగా అన్నంతో, జొన్న రొట్టెలతో లేదా బగారా అన్నంతో సర్వ్ చేసుకోండి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

6 comments

  • L
    LK Mohanty
    Recipe Rating:
    Super Vismai Food I'm Little Chef From Mandasa Super You are Video And Voice I Love You Channel 9440.900.279
  • K
    Keerthi
    Nenu చిలకడ దుంప పప్పు చారు చేశాను చాలా బాగుంది అండి మీరు కూడా ఒకసారి try చేసి అందరికీ share cheste బాగుంటుంది
  • S
    Sushil Kumar Rachuri
    Recipe Rating:
    Good taste
  • S
    Suhana
    Recipe Rating:
    One of the best cooking channel so far. Love your recipes and I tried many recipes from here. Thank you
  • M
    Mamatha
    Recipe Rating:
    From your youtube I learned many recepies
  • B
    Bingus
    This is shit Im stealing this for a project
Easy Spicy Chicken Curry