ఎగ్ 65 రెసిపీ | స్ట్రీట్ స్టైల్ ఎగ్ 65 | రెస్టారంట్ స్టైల్ ఎగ్ 65

స్ట్రీట్ స్టైల్ ఎగ్ 65 రెసిపీ ఉడికించిన గుడ్లకి కోటింగ్ ఇచ్చి నూనెలో ఎర్రగా వేపి మాసాలల్లో టాస్ చేసి ఇచ్చే ఈ 65 రెసిపీ చేసినంత సేపు పట్టదు ప్లేట్ ఖాళీ అయిపోవడానికి.

65 రెసిపీ పుట్టినిల్లు మద్రాస్. కానీ దక్షిణ భారతమంతా ఎంతో ఇష్టంగా తింటారు. ఇదే 65 ఒక్కో ప్రాంతంలో ఒక్కో తీరులో చేస్తారు. నేను హైదరాబాదీల తీరులో చేస్తున్నాను.

చివరికి పెళ్లిళ్లలో కూడా పెట్టె స్థాయికి చేరిపోయింది. ఇందులోనే వెజ్ విధానాలు కూడా వచ్చేశాయ్ ఆలూ, కాలీఫ్లవర్ ఇలా. ఏది ఏమైనా తృపితినిచ్చే గొప్ప స్టారర్.

టిప్స్

గుడ్లు:

గుడ్లు ఉడికించిన తరువాత పూర్తిగా చల్లార్చి 4 చీలికలుగా చేసుకోండి. వేడి మీద గుడ్డు కోస్తే చిదురైపోతుంది.

కోటింగ్:

మసాలా దినుసులు మైదా కార్న్ఫ్లోర్ వేసి చేసే కోటింగ్ కాస్త చిక్కగా ఉండాలి, ఇంకా బాగా బీట్ చేయాలి. అప్పుడే కోటింగ్ గుల్లగా వస్తుంది.

కోటింగ్ బీట్ చేయకపోతే గుడ్డు పైన గట్టిగా అప్పడం మాదిరి అయిపోతుంది వేగాక. ఇంకా మనం మాసాలల్లో టాస్ చేసేప్పుడు ఫ్లేవర్ ఏవి ఇంకవు.

గుడ్డు ముక్కకి కోటింగ్ ఇచ్చేప్పుడు గుడ్డు పచ్చసొన పైకి తెల్ల సోన కిందికి ఉండేలా పిండిలో వేసి ఆ పైన పిండి పోసి నెమ్మదిగా గుడ్డు చిదిరిపోకుండా కోటింగ్ చేసుకోవాలి

వేపే తీరు:

కోటింగ్ గుడ్డు నూనెలో వేశాక మీడియం ఫ్లేమ్ మీద ఎర్రగా వేపుకుని తీసుకోవాలి.

టాసింగ్:

మసాలాలు పెరుగు వేసి కాస్త చిక్కబరచాలి గ్రేవీని, మరీ పలుచుగా ఉంటె వేగిన గుడ్డు ఆ నీటిని పీల్చి మెత్తగా అయిపోతుంది, ఇంకా కోటింగ్ ఊడిపోతుంది.

గుడ్డు వేశాక నెమ్మదిగా టాస్ చేసుకోవాలి, ఎక్కువగా గరిట పెట్టి టాస్ చేస్తే కోటింగ్ ఊడిపోతుంది.

ఆఖరుగా:

65 అంటే కొంచెమైనా రెడ్ ఫుడ్ కలర్ అజినొమొటో వేస్తారు, నచ్చకుంటే వదిలేయండి.

ఎగ్ 65 రెసిపీ | స్ట్రీట్ స్టైల్ ఎగ్ 65 | రెస్టారంట్ స్టైల్ ఎగ్ 65 - రెసిపీ వీడియో

Egg 65 Recipe | Street Style EGG 65 | Restaurant Style EGG 65

Street Food | nonvegetarian
  • Prep Time 15 mins
  • Cook Time 20 mins
  • Total Time 35 mins
  • Servings 2

కావాల్సిన పదార్ధాలు

  • కోటింగ్ కోసం:
  • 4 ఉడికించిన గుడ్లు
  • ఉప్పు - కొద్దిగా
  • 3 tbsp మైదా
  • 2 tbsp కార్న్ ఫ్లోర్
  • నీళ్లు - తగినన్ని
  • ½ tsp వేపిన జీలకర్ర పొడి
  • ½ tsp వేపిన ధనియాల పొడి
  • 1 tsp కారం
  • ½ tsp అల్లం వెల్లులి పేస్ట్
  • ½ tsp గరం మసాలా
  • టాసింగ్ కోసం:
  • 2 tbsp నూనె
  • 2 tbsp ఉల్లిపాయ తరుగు
  • 3 sprigs కరివేపాకు
  • 1.5 tbsp వెల్లులి తరుగు
  • 2 ఎండుమిర్చి
  • 2 పచ్చిమిర్చి చీలికలు
  • ½ tsp గరం మసాలా
  • ½ tsp వేపిన జీలకర్ర పొడి
  • ½ tsp ధనియాల పొడి
  • ¾ tsp కారం
  • ఉప్పు
  • 1 cup పెరుగు
  • ½ tsp రెడ్ ఫుడ్ కలర్
  • 1 tsp అజినొమొటో/ ఆరోమెట్ పొడి
  • కొత్తిమీర - కొద్దిగా
  • ½ tbsp నిమ్మరసం

విధానం

  1. ఉడికించిన గుడ్లని నాలుగు సగాలుగా చీరుకోండి.
  2. కోటింగ్ కోసం ఉంచిన పదార్ధాలన్నీ వేసి నీళ్లతో కలిపి బాగా బీట్ చేయండి.
  3. బీట్ చేసుకున్న పిండిలో గుడ్డు చీలికలు వేసి నెమ్మదిగా కోటింగ్ ఇచ్చి మరిగే వేడి నూనెలో వేసి ఎర్రగా వేపి తీసుకోండి (కోటింగ్ టిప్స్ చుడండి).
  4. నూనె వేడి చేసి అందులో వెల్లులి అల్లం ఎండుమిర్చి పచ్చిమరీచి తరుగు వేసి వెల్లులి రంగు మారడం మొదలయ్యే దాకా వేపుకోండి.
  5. వెల్లులి రంగు మారుతున్నప్పుడు ఉల్లిపాయ తరుగు కరివేపాకు వేసి వేపుకోండి.
  6. వేగిన కరివేపాకులో ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి వేపుకోండి.
  7. వేగిన మాసాలలో చికిలిన పెరుగు వేసి మంట పూర్తిగా తగ్గించి బీట్ చేస్తూ కాస్త చిక్కబరచండి.
  8. పెరుగు ఉడుకుతున్నప్పుడే రెడ్ ఫుడ్ కలర్ అరొమెట్ పొడి వేసి కలుపుకోండి.
  9. పెరుగు చిక్కబడ్డాక వేపుకున్న గుడ్లు వేసి నెమమ్దిగా హై ఫ్లేమ్ మీద టాస్ చేసుకోండి. దింపబోయే ముందు నిమ్మరసం కొత్తిమీర తరుగు చల్లి వేడి వేడిగా సర్వ్ చేసుకోండి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

1 comments