ఎగ్ బ్రేడ్ బజ్జి | ఎగ్ స్టఫ్డ్ బ్రేడ్ బజ్జి | బ్రేడ్ బజ్జి రెసిపీ
ఎగ్ బ్రేడ్ బజ్జి- ఉడికించిన గుడ్డుని ఎగ్ పఫ్లో చేసేఉల్లిపాయ స్టఫింగ్ ని బ్రెడ్ మధ్య లో పెట్టి సెనగపిండిలో ముంచి చేసే ఈ సింపుల్ స్నాక్ చక్కటి టీ టైం స్నాక్.
బ్రెడ్ మధ్యలో గుడ్డుని పెట్టి వేపే ఈ స్నాక్ ఒకటి తినడం మొదలెడితే ఇక తినడం ఆపలేరు. ఎప్పుడు తినే బ్రెడ్ బజ్జికి బదులు ఇలా గుడ్డుని స్టఫ్ చేసి చేసే బజ్జి ట్రై చేయండి చాలా నచ్చేస్తుంది.
ఈ ఎగ్ స్టఫ్డ్ బ్రేడ్ బజ్జి దాదాపుగా ఎగ్ పఫ్ తింటున్న అనుభూతి కలుగుతుంది. ఈ సింపుల్ రెసిపీని చేసే ముందు ఒక్క సారి టిప్స్ పాటిస్తూ చేయండి ఎంతో రుచిగా ఉండే బజ్జీ తయారవుతుంది.

టిప్స్
సెనగపిండి:
సెనగపిండిలో తగినన్ని నీరు చేర్చి బాగా ఎక్కువసేపు గిలగొట్టాలి అప్పుడే పిండి తేలిక పడుతుంది, లేదంటే పిండి చిక్కగా ఉంది తింటున్నప్పుడు నోరు చుట్టుకుంటుంది. అందుకే పిండిని బాగా ఎక్కువసేపు బీట్ చేసుకోండి.
బ్రెడ్:
- ఇక్కడ మీరు కావాలనుకుంటే మిల్క్ బ్రేడ్ కూడా వాడుకోవచ్చు.
- నచ్చితే ఒక నిశం పెనం మీద కాల్చిన బ్రెడ్ని పకోడాగా కూడా వాడుకోవచ్చు.
ఆఖరుగా:
ఈ బజ్జి కేవలం వేడి మీదే ఎంతో రుచిగా ఉంటుంది.
ఎగ్ బ్రేడ్ బజ్జి | ఎగ్ స్టఫ్డ్ బ్రేడ్ బజ్జి | బ్రేడ్ బజ్జి రెసిపీ - రెసిపీ వీడియో
Egg Bread Bajji | Egg stuffed Bread Bajji | Bread Bajji Recipe | Egg Puff Bajji
Prep Time 15 mins
Cook Time 15 mins
Total Time 30 mins
Servings 4
కావాల్సిన పదార్ధాలు
- 1 cup
- 1 tbsp
- Salt – To taste
- Water- Sufficient to mix the batter
- 2 pinches
- Oil – sufficient for frying
- 8 slices
- 4 Eggs (Boiled)
- 3 tbsp Oil
- 1 cup
- 2
- ¼ cup
- ½ tsp
- ½ tsp
- ½ tsp
- ¼ tsp
- 3 tbsp
- 1 ½ tbsp Tomato Sauce
విధానం
-
నూనె వేడి చేసి అందులో ఉల్లిపాయ చీలికలు ఉప్పు వేసి ఉల్లిపాయని మెత్తబడనివ్వాలి.
-
ఉల్లిపాయ మెత్తబడిన తరువాత కాప్సికం తరుగు పచ్చిమిర్చి తరుగు వేసి వేపుకోండి.
-
వేగిన ఉల్లిలో మసాలా పొడులు నీరు వేసి వేపితే మసాలాలు మాడకుండా వేగుతాయి.
-
వేగిన మసాలాలో కొత్తిమీర తరుగు టమాటో సాస్ వేసి కలిపి దింపేసుకోండి.
-
మిల్క్ బ్రెడ్ అంచులని తీసేయండి.
-
బ్రెడ్ అంచులని వదిలేసి ఉల్లిపాయ మిశ్రమం బ్రేడ్ అంతా పూసుకోండి, ఆ పైన సగానికి కోసిన గుడ్డు పెట్టుకోండి.
-
బ్రెడ్ అంచులని నీటితో తడపండి, పైన పెట్టె బ్రెడ్ మీద కూడా కొద్దిగా ఉల్లిపాయ మిశ్రమం పూసుకుని తడి చేసిన అంచులని గట్టిగా అంటించండి.
-
సెనగపిండిలో మిగిలిన పదార్ధాలన్నీ వేసి కనీసం 5-7 నిమిషాలపాటు బాగా బీట్ చేసుకోండి. ఆఖరుగా సోడా వేసి ఇంకో ½ నిమిషం బీట్ చేసుకుంటే పిండి చక్కగా తేలికపడుతుంది.
-
బీట్ చేసుకున్న సెనగపిండిలో బ్రెడ్ ముంచి మరిగే వేడి వేడి నూనెలో వేసి రెండు వైపులా ఎర్రగా వేపి తీసుకోండి
-
వేడి మీద సగానికి కోసి టమాటో సాస్ తో ఆశ్వాదించండి!!!

Leave a comment ×
71 comments