ప్లేట్లో సర్వ చేయడమే ఆలస్యం క్షణాల్లో ఖాళీ అయిపోతుంది ఎగ్ మంచూరియన్ రెసిపీ. నేను బెస్ట్ అండ్ పర్ఫెక్ట్ స్టార్టర్ అంటాను. ఎప్పుడు చేసినా సూపర్ హిట్ అయిపోతుంది రెసిపీ.

మామూలుగానే ఎగ్ రెసిపీ అంటే అందరికీ ఇష్టమే అందులోనూ ఎగ్తో చేసే స్నాక్స్ అంటే ఇంక ప్రేత్యేకంగా చెప్పాలా! అందరూ ఇష్టత చూపుతారు. అలా అందరికీ నాకు ఎంతో నచ్చిన రెసిపీనే ఎగ్ మంచూరియాన్.

మంచూరియాన్ అందరికీ ఇష్టమే అలాగే మంచూరియాన్లు ఎన్నో రాకాలున్నాయి కూడా. వేటికవే ప్రేత్యేకం! ఎగ్ మంచూరియాన్ రెస్టారెంట్ స్పెషల్ రెసిపీ. ఈ సింపుల్ రెసిపీ చేసే ముందు ఒక సారి టిప్స్ని ఫాలో అవుతూ చేయండి బెస్ట్ మంచూరియాన్ని ఎంజాయ్ చేయండి.

Egg manchuria |  How to make Egg Manchurian recipe at home

టిప్స్

ఎగ్స్:

  1. గుడ్లు పొడవుగా నాలుగు చీలికలుగా చేసుకోండి.

  2. గుడ్డుకి కోటింగ్ ఇచ్చేప్పుడు పిండిలో పచ్చ సోన చిదిరిపోకుండా అన్నీ వైపులా పిండిలో ముంచి వేడి నూనెలో వేసి లేత బంగారు రంగు ఇంకా కరకరలాడేట్టు వేపుకుని తీసుకోవాలి.

ఇంకొన్ని టిప్స్:

  1. చైనీస్ ఎప్పుదు హై ఫ్లేమ్ మీదే టాస చేయాలీ అప్పుడే స్మోకీ ఫ్లేవర్తో రుచిగా ఉంటుంది.

  2. వాడే అల్లం వెల్లులి ఉల్లిపాయ తరుగు సాధ్యమైనంత సన్నగా తరుక్కోవాలి. అప్పుడు బాగుంటుంది.

  3. నేను ఇందులో రెడీమేడ్గా దొరికే చైనీస్ చిల్లీ పేస్ట్ వాడాను. దొరకని వారు షెజ్వాన్ సాస్ అయినా వాడుకోండి కారం మాత్రం వాడకండి.

  4. నేను అజీనోమోటో వాడాను నచ్చని వారు వదిలేయండి లేదా ఆరోమాట్ పౌడర్ వాడుకోండి.

  5. సాసులు మరీ చిక్కగా ఉన్నప్పుడు ఫ్రైడ్ ఎగ్ వేస్తే సరిగా పట్టవు. సాసులు చిక్కబడకుండా వేస్తే ఎగ్ మెత్తబడిపోతుంది తినేందుకు రుచిగా అనిపించదు.

  6. ఇంకా సాయసులు పూర్తిగా ఇగిరిపోయే దాకా కాకుండా ఇంకా కాస్త సాసులు ఉండగానే దింపేసుకోవాలి. అప్పుడు కాస్త చల్లరినా రుచిగా అనిపిస్తుంది. లేదా బాగా గట్టిగా అయిపోతాయ్.

ఎగ్ మంచూరియాన్ - రెసిపీ వీడియో

Egg manchuria | How to make Egg Manchurian recipe at home

Starters | nonvegetarian|eggetarian
  • Prep Time 12 mins
  • Cook Time 15 mins
  • Total Time 27 mins
  • Servings 2

కావాల్సిన పదార్ధాలు

  • ఎగ్ కోటింగ్ కోసం
  • 4 ఉడికించిన గుడ్లు (పొడవుగా 4 భాగాలుగా చీరుకున్నవి)
  • 1 గుడ్డు
  • ఉప్పు – చిటికెడు
  • మిరియాల పొడి – కొద్దిగా
  • 2.5 tbsp మైదా
  • 2 tbsp కార్న్ ఫ్లోర్
  • గుడ్లు వేపుకోడానికి – నూనె
  • మంచూరియాన్ కోసం
  • 1 tbsp నూనె
  • 1 tsp సన్నని అల్లం తరుగు
  • 1.5 tsp సన్నని వెల్లులి తరుగు
  • 2 tbsp ఉల్లిపాయ తరుగు
  • 2 పచ్చిమిర్చి సన్నని తరుగు
  • 1 tbsp చైనీస్ చిల్లీ పేస్ట్
  • 1 tbsp టొమాటో కేట్చప్
  • ఉప్పు
  • 1/2 tsp మిరియాల పొడి
  • 1 tsp వైట్ పెప్పర్ పౌడర్
  • 1/2 tsp అజీనమోటో
  • డార్క్ సోయా సాస్
  • 125 - 150 ml నీళ్ళు
  • 2 tbsp ఉల్లికాడల తరుగు

విధానం

  1. ఉడికించిన నాలుగు గుడ్లని పొడవుగా 4 భాగాలుగా చీరుకోవాలి.
  2. గుడ్డుని పగలకొట్టి అందులో ఉప్పు మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి.
  3. బాగా కలుపుకున్న గుడ్డులో మైదా కార్న్ ఫ్లోర్ వేసి బాగా కలుపుకోవాలి.
  4. గుడ్డుని నెమ్మదిగా పిండిలో ముంచి వేడి నూనెలో వేసి గరిట పెట్టకుండా ఒక నిమిషం వదిలేసి తరువాత లేత బంగారు రంగు వచ్చేదాక వేపి తీసుకోవాలి.
  5. పాన్లో నూనె పోసి హై ఫ్లేమ్ మీద వేసి చేసుకోవాలి. వేడెక్కిన నూనెలో అల్లం తరుగు, వెల్లులి తరుగు, ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి తరుగు వేసి వెల్లులి లేత బంగారు రంగు వచ్చేదాక వేపుకోవాలి.
  6. తరువాత మిగిలిన సాసులు, ఉప్పు కారాలు వేసి హై ఫ్లేమ్ మీద టాస్ చేయాలీ. తరువాత నీళ్ళు పోసి సాయసులు చిక్కబడనివ్వాలి.
  7. సాసులు చిక్కబడుతుండగా వేపుకున్న గుడ్లు వేసి హై ఫ్లేమ్ మీద పట్టించుకోవాలి. దింపే ముందు స్ప్రింగ్ ఆనీయన్ తరుగు చల్లి దింపేసుకోవాలి.
  8. ఎగ్ మంచూరియాన్ వేడి వేడిగా చాలా రుచిగా ఉంటాయ్.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

12 comments

Egg manchuria |  How to make Egg Manchurian recipe at home