చేపల పులుసు | ఆంధ్రా స్టైల్ చేపల పులసు చేపల మసాలా పొడితో
మసాలాలు అన్నీ సమపాళల్లో వేసి చేపల పులుసు కాస్తే ఆ రుచి గురుంచి ఎంత చెప్పినా తక్కువే! అలాంటిదే ఆంధ్రా స్టైల్ చేపల పులుసు. ఎంతో సింపుల్ చేపల పులుసు రెసిపీ ఘుమఘుమలాడే చేపల మసాలా పొడి రెసిపీతో ఉంది.
చింతపండు పులుసు పోసి దక్షిణభారత దేశం అంతటా చేస్తారు, కానీ ఒక్కోరిది ఒక్కో తీరు. నా స్టైల్ చేపల పులుసు మా ఇంటి తీరు. మా ఇంట్లో మా నానమ్మ చేసే చేపల పులుసు ఎంతో స్పెషల్. ప్రేత్యేకంగా అప్పటికప్పుడు రోట్లో రుబ్బి ఆఖరున పులుసులో వేసే చేపల మసాలా పొడి ప్రేత్యేకమైన రుచినిస్తుంది.
నిజానికి వెనుకటి ఆంధ్రుల చేపలలో గరం మసాలా వేసేవారు కాదు, తరువాతి కాలంలో చేపల పులుసుల్లో గరం మసాలా వేసి దిమ్పుతున్నారు. ఇంకా ఆంధ్రుల చేపల పులుసు అంటే కాసింత కారంగా ఇంకొంచెం పుల్లగా ఉంటుంది, మిగతా దక్షిణాది రాష్ట్రాల వారితో పోలిస్తే. చేపల పులుసు వేడిగా అన్నం, ఇడ్లీ అట్టులోకి ఎంతో రుచిగా ఉంటుంది.

టిప్స్
చేపలు:
-
నేను రవ్వ చేపలు వాడాను, మీరు ఇంకేదైనా చేపలు కూడా వాడుకోవచ్చు.
-
చేపలని రాళ్ళ ఉప్పు వేసి 3-4 సార్లు బాగా కడగాలీ అప్పుడే నీచు వాసన పోతుంది.
గ్రేవీ:
-
చేపల పులుసుకి కాసింత ఎక్కువ నూనె ఉండాలి అప్పుడే పులుసు రుచిగా ఉంటుంది.
-
పులుసు ఎక్కువగా కావాలంటే ఉల్లిపాయా గుజ్జుతో పాయాఉత మిగిలిన పదార్ధాల మోతాదు పెంచుకోండి.
-
పులుసు సన్నని సెగ మీద నూనె పైకి తేలేదాక మరిగితేనే రుచి. ఇంకా ఉప్పు కారాలు పులుపుకి తగినట్లు ఉంటేనే పులుసు రుచి
-
చేప ముక్కలు వేశాకా సన్నని సెగ మీద నూనె పైకి తేలేదకా ఉడికించుకోవాలి. ఇంకా చేప ముక్కలు వేశాక గరిటతో ఎక్కువగా కడిపితే ముక్క చిదురవుతుంది
-
చేపల పులుసు ఎప్పుడూ చేసిన మరుసటి రోజు రుచిగా ఉంటుంది.
చేపల పులుసు | ఆంధ్రా స్టైల్ చేపల పులసు చేపల మసాలా పొడితో - రెసిపీ వీడియో
Fish Curry | Andhra Style Chepala Pulusu | How to make Fish Curry with fish masala podi
Prep Time 10 mins
Cook Time 25 mins
Total Time 35 mins
Servings 5
కావాల్సిన పదార్ధాలు
-
చేప మసాలా పొడి కోసం
- 1 tbsp ధనియాలు
- 7 ఎండుమిర్చి
- 1/2 tsp మెంతులు
- 8 - 10 వెల్లులి
-
పులుసు కోసం
- 300 gm చేప ముక్కలు
- 1/2 cup నూనె
- 2 రెబ్బలు కరివేపాకు
- 2 ఉల్లిపాయ
- 4 పచ్చిమిర్చి
- 1 tbsp అల్లం వెల్లులి పేస్ట్
- ఉప్పు
- 1/2 tsp పసుపు
- 1 tbsp కారం
- 1 tbsp ధనియాల పొడి
- 1/4 cup టొమాటో ముక్కలు
- 1/2 liter నీళ్ళు
- 200 ml చింతపండు నీళ్ళు (50 gm చింతపండు నుండి తీసినది)
- కొత్తిమీరా – చిన్న కట్ట
విధానం
-
చేపల మసాలా పొడి కోసం ఉంచిన పదార్ధాలన్నీ వేసి సన్నని సెగ మీద మాంచి సువాసన వచ్చేదాకా వేపి మెత్తని పొడి చేసుకోండి.
-
మిక్సీలో ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ వేసి మెత్తని పేస్ట్ చేసుకోండి.
-
ముకుడులో నూనె వేసి అందులో కరివేపాకు ఉల్లిపాయ పేస్ట్ వేసి ఉల్లిపాయ బంగారు రంగు వచ్చేదాకా వేపుకోవాలి.
-
ఉల్లిపాయ వేగుతున్నప్పుడే ఉప్పు వేసి వేపుకోండి. ఇంకా ఉల్లిపాయ లేత బంగారు రంగు వచ్చాక అల్లం వెల్లులి ముద్ద వేసి వేపుకోవాలి.
-
వేగిన ఉల్లిపాయాలో పసుపు, ధనియాల పొడి, కారం వేసి వేపుకోవాలి.
-
ఆ తరువాత చింతపండు పులుసు, నీళ్ళు పోసి హై ఫ్లేమ్ మీద ఒక మరగనివ్వాలి.
-
మరుగుతున్న పులుసులో చేప ముక్కలన్నీ సర్ది సన్నని సెగ మీద నూనె పైకి తేలేదాక మరగనివ్వాలి.
-
15 నిమిషాలకి నూనె తేలుతుంది పులుసు చిక్కబడుతుంది అప్పుడు కొత్తిమీర తరుగు, చేపల మసాలా పొడి వేసి నెమ్మదిగా ముక్క చిదరకుండా కలిపి మరో 5 నిమిషాలు సన్నని సెగ మీద మరిగిస్తే ఎంతో రుచిగా ఉండే చేపల పులుసు తయారు.

Leave a comment ×
4 comments