వెల్లుల్లి కోడి వేపుడు | గార్లిక్ చికెన్ ఫ్రై | చికెన్ ఫ్రై రెసిపీ

వెల్లుల్లి కోడి వేపుడు బోన్లెస్ చికెన్ కి నూరిన వెల్లులి మసాలాలు పట్టించి నూనెలో ఎర్రగా వేపి వెల్లులి జీడిపప్పు కరివేపాకులో టాస్ చేసి వేడి వేడిగా సర్వ్ చేసే ఈ వెల్లులి కోడి వేపుడు అందరికి నచ్చే స్టార్టర్.

కోడి వేపుడులు అనేక తీరులు ఏవైనా కోడి ముక్కలని నూనెలో వేయి తీసేవే కానీ మాసాలాలే మార్పు. ఇక్కడ కూడా ఇంతే ఇది వెల్లులి గుభాళింపుతో ఉంటుంది, ఇంకా ముక్క బయట కరకరలాడుతూ లోపల మృదువుగా చాలా రుచిగా ఉంటుంది. 

పార్టీలకి లేదా వీకెండ్స్ లో చికెన్ తో ఏదైనా సులభంగా తయారయ్యే స్టార్టర్ కోసం చూస్తున్నారా అయితే ఈ వెల్లులి కోడి వేపుడు చక్కని ఎంపిక అవుతుంది. ఈ సింపుల్ రెసిపీ చేసే ముందు కింద టిప్స్ చవి చేసుకోండి.

టిప్స్

చికెన్:

లేతగా ఉండే కోడి వాడుకోండి. ముదురుగా ఉండే కోడి ముక్కలలోకి ఫ్లేవర్స్ ఏవి ఇంకవు ఇంకా ముక్క రబ్బరులా ఉంటుంది. కాబట్టి మీరు చికెన్ షాప్లో కోడిని శుభ్రం చేశాక కిలో బరువుండే కోడిని ముక్కలుగా తెచ్చుకుంటే సరిగా కుదురుతుంది ఎప్పుడైనా.

ముక్కలకి మసాలాలు పట్టించి కనీసం గంటసే పైనా ఊరనిస్తే ముక్కల్లోకి మసాలాలు చేరి చాలా రుచిగా ఉంటుంది.

గార్లిక్ పొడి:

ఈ రెసిపీ రుచిని ఇంకో స్థాయికి తీసుకువెళ్లే పదార్ధం. ఆఖరున ఇది కొద్దిగా వేసి టాస్ చేస్తే వెల్లులి ఘుభాళింపుతో ఏంటో రుచిగా ఉంటుంది. ఈ వెల్లులి పొడి ఆన్లైన్లో చాలా సులభంగా దొరికేస్తుంది. వెల్లులి పొడి అందుబాటులో లేనివారు కనీసం చాట్ మసాలా పొడినైనా ముక్కాలా మీద చల్లండి. ఏదో ఒకటి వేస్తేనే రుచి అని గుర్తుంచుకోండి. 

కలర్:

ఈ వెల్లులి కోడి వేపుడులో కారమంతా పచ్చిమిర్చి ఇంకా వెల్లులి ఘాటుతో ఉంటుంది ఎర్రటి యందు కారం ఉండదు. కాబట్టి చూడ్డానికి తెల్లగా ఉంటుంది అందుకే కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ వేశాను, నచ్చని వేయకండి. 

వేపే తీరు:

ముక్కని ఒకేసారిగా కాకుండా కొద్దీ కొద్దిగా వేసి నెమ్మదిగా మీడియం ఫ్లేమ్ మీద కాస్త రంగు మారేదాకా వేగనివ్వండి, ముక్కలు రంగు మారిన తరువాత హై ఫ్లేమ్ మీద పెట్టి బంగారు రంగు వచ్చేదాకా వేపుకోండి. 

వెల్లుల్లి కోడి వేపుడు | గార్లిక్ చికెన్ ఫ్రై | చికెన్ ఫ్రై రెసిపీ - రెసిపీ వీడియో

Garlic Chicken Fry | Velluli Kodi Vepudu | Chicken Fry | Vismai Food

South Indian Recipes | nonvegetarian
  • Prep Time 2 mins
  • Cook Time 20 mins
  • Resting Time 1 hr
  • Total Time 1 hr 22 mins
  • Servings 4

కావాల్సిన పదార్ధాలు

  • 400 gms బోన్లెస్ చికెన్ ముక్కలు
  • వెల్లులి మసాలా ముద్ద కోసం:
  • 6 - 8 పచ్చిమిర్చి
  • 1 ఉల్లిపాయ (చిన్నది)
  • 25 - 30 వెల్లులి
  • 2 Sprigs కరివేపాకు
  • మసాలా పట్టించే మసాలాలు
  • ఉప్పు - రుచికి సరిపడా
  • పసుపు - కొద్దిగా
  • 1 tsp గరం మసాలా
  • 1 tsp వేపిన ధనియాల పొడి
  • 1 tsp వేపిన జీలకర్ర పొడి
  • 3 - 4 drops రెడ్ ఫుడ్ కలర్
  • ½ tbsp వెనిగర్
  • 3 tbsp కార్న్ ఫ్లోర్
  • వేపుకోడానికి నూనె
  • టాసింగ్ కోసం:
  • 2 tbsp నూనె
  • 3 tbsp జీడీపప్పు
  • 2 పచ్చిమిర్చి (చీల్చిన ముక్కలు)
  • 1 tbsp వెల్లులి
  • 2 sprigs కరివేపాకు
  • 1/2 tsp వెల్లులి పొడి / చాట్ మసాలా

విధానం

  1. ముందుగా వెల్లులి మసాలా ముద్ద కోసం ఉంచిన పదార్ధాలన్నీ మెత్తగా దంచుకోండి. లేదా మిక్సీలో బరకగా రుబ్బుకోండి.
  2. చికెన్ ముక్కల్లో దంచుకున్న వెల్లులి ముద్దతో పాటుగా మిగిలిన మసాలా పొడులు, కొద్దిగా రంగు, వెనిగర్ వేసి బాగా రుద్ది ముక్కలకి మసాలాలు పట్టించి, ఆఖరుగా కార్న్ ఫ్లోర్ వేసి కలిపి కోటింగ్ ఇచ్చి ముక్కలని కనీసం గంటసేపైనా ఫ్రిజ్లో ఊరనివ్వండి.
  3. గంట తరువాత మరిగే వేడి నూనెలో ముక్కలన్ని ఒకే సారిగా అకాకుండా రెండు సగాలుగా విభజించి మీడియం మంట మీద ఎర్రగా వేపి తీసుకోండి.
  4. టాసింగ్ కోసం కొద్దిగా నూనె వేడి చేసి, అందులో జీడిపప్పు మిగిలిన పదార్ధాలన్నీ వేసి హై ఫ్లేమ్ మీద జీడిపప్పు రంగు మారనివ్వండి.
  5. రంగు మారిన జీడీఅప్పులో, వేపుకున్న చికెన్ ముక్కలు వెల్లులి పొడి వేసి హై ఫ్లేమ్ మీద టాస్ చేసి వేడి వేడిగా సర్వ్ చేయండి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

1 comments