గోధుమ పిండి మైసూర్ బజ్జి

బయట కరకరలాడుతూ లోపల మెత్తగా దూదిగా ఉండే మైసూర్ బజ్జి తెలుగు వారి ఫెవరెట్ రెసిపీ. పొద్దున్న టిఫిన్కి సాయంత్రం స్నాక్స్కి ఎప్పుడైనా సూపర్ హిట్ ఈ మైసూర్ బజ్జి

నిజానికి ఈ బోండా పుట్టుక మంగుళూరులో కానీ అక్కడివారి కంటే ఎక్కువగా తెలుగువారు తినేస్తున్నారు. ఈ మైసూర్ బజ్జీ, గోలీ బజ్జీ, మైసూర్ బోండా పేరు ఏదైనా అంతా ఒక్కటే వీటిని మైదా పెరుగు వంట సోడా కలిపి నానబెట్టి చేస్తారు.

నేను గోధుమపిండితో చేస్తున్నాను. ఇన్నాళ్లు నేను ఎందుకు గోధుమపిండితో ప్రయోగం చేయలేదు అని బాధపడ్డాను గోధుమపిండి బొండాల రుచి చూశాక. అందరూ మైదాతో చేస్తున్నారు కాబట్టి నేనూ మైదా పిండి వాడి చేశాను. కానీ నన్ను నమ్మండి గోధుమపిండి మైసూర్ బజ్జీ రుచి చాలా గొప్పగా ఉంటుంది.

ఈ రెసిపీలో నేను చాలా వివరంగా మైసూర్ బజ్జీకి పిండి ఎలా కలపాలి, బోండా లోపల ఉండకట్టకుండా ఎలా వేపుకోవాలి, బొండాలు ఎలా వేయాలి లాంటి స్టెప్స్ టిప్స్ అన్నీ వివరంగా టిప్స్లో ఉన్నాయ్ చుడండి.

మీరు ఈ రెసిపీని కూడా ఇష్టపడవచ్చుచల్ల పునుగులు

టిప్స్

వంట సోడా:

  1. కచ్చితంగా వంట సోడా తాజాది అయి ఉండాలి. అప్పుడే బొండాలు పొంగుతాయి. మీ దగ్గర ఉన్నది మంచి సోడానా కాదా అని టెస్ట్ చేయడానికి చెంచా పెరుగులో వేసి కలపండి, మాంచి సోడా అయితే పెరుగు పొంగుతుంది.

పెరుగు:

  1. కమ్మని పెరుగు అయినా పుల్లని పెరుగు అయినా పర్లేదు. పుల్లని పెరుగు అయితే చాలా బాగుంటాయి బొండాలు

బొండాలు వేపే తీరు:

  1. బొండాలు వేపే మూకుడు లోతుగా ఉండాలి అంటే “U” షేప్లో. అలా ఉంటేనే బొండాలు రౌండ్గా వస్తాయ్.

  2. నూన్ కచ్చితంగా వేడిగా ఉండాలి. అప్పుడు మంట మీడియం ఫ్లేమ్లోకి పెట్టి బొండాలు మూకుడుకి సరిపోయేన్ని వేసి రంగు మారేదాకా మీడియం ఫ్లేమ్ మీదే వేపుకోవాలి. బొండాలు రంగు మారాక మంట హై-ఫ్లేమ్లోకి పెట్టి ఎర్రగా వేపుకోవాలి

  3. బొండాలు పెద్ద మంట మీద పెట్టి వేపితే పైన రంగొస్తాయ్, లోపల పచ్చిగా ఉంటుంది పిండి. ఈ పిండి వేడి మీద పచ్చిగా చల్లారాక ఉండ కట్టేస్తుంది. అందుకే నిదానంగా మీడియం ఫ్లేమ్ మీద వేపితే పిండి లోపల ఉడుకుతుంది.

  4. గోధుమపిండి బొండాలు ముదురు ఎరుపు రంగులోకి వస్తాయ్. మైదా పిండి బొండాల మాదిరి బంగారు రంగులోకి రావు. అలా బంగారు రంగులోకి వేపాలి చూస్తే పిండి లోపల ఉడకదు.

బొండాలు వేసే తీరు:

  1. చేతులు బాగా తడి చేసుకోవాలి, తరువత నీటిని చేతి నుండి పిండేయండి. అంటే చెయ్యి తడిగా ఉండాలి, నీరు కారుతూ ఉండకూడదు.

  2. అలా తడి చేత్తో నానిన పిండిని పిడికెడు తీసుకుని వేడి నూనె పిండితే సోడా పెరుగులో పొంగిన పిండి కదా చక్కగా రౌండ్గా వస్తాయ్.

  3. ఒకవేళ చేత్తో వేయడం కష్టంగా అనిపిస్తే తడి చెంచాతో కూడా వేసుకోవచ్చు, ఎలా వేసినా పొంగిన పిండి కదా గుండ్రంగా వస్తాయ్.

పిండి కలిపే తీరు:

  1. బొండాల పిండి కచ్చితంగా బాగా బీట్ చేయాలి. అంటే కనీసం 4-5 నిమిషాలు. అప్పుడే పిండిలోపలి గాలి చేరి గుల్లగా వస్తాయ్ బొండాలు. బొండాలు ఎందుకు పేలుతున్నాయి:

  2. గాలితో పొంగిన పిండిలో నీరు కలిసి ఉండిపోతుంది. ఆ నీటితో నిండిన పిండి నూనెలో పడ్డాక వేగేప్పుడు పేలుతుంది. కాబట్టి పిండిని బాగా బీట్ చేయాలి అప్పడే బొండాలు మృదువుగా వస్తాయి.

గోధుమ పిండి మైసూర్ బజ్జి - రెసిపీ వీడియో

Wheat Flour Mysore Bhajji | Godhuma Pindi Mysore Bajji

Breakfast Recipes | vegetarian
  • Prep Time 10 mins
  • Cook Time 20 mins
  • Resting Time 1 hr
  • Total Time 1 hr 30 mins

కావాల్సిన పదార్ధాలు

  • 400 gms గోధుమ పిండి
  • 3/4 Cup పెరుగు
  • 2 tbsp బొంబాయి రవ్వ
  • 1 tbsp పంచదార
  • 1- 1 ¼ tsp tbsp సోడా
  • ఉప్పు (రుచి ప్రకారం)
  • 1/2 litre నీరు
  • 1 tbsp జీలకర్ర
  • 1 tbsp పచ్చిమిర్చి (సన్నని తరుగు)
  • 2 tbsp పచ్చి కొబ్బరి (పలుకులు)
  • 2 Sprigs కరివేపాకు (సన్నని తరుగు)
  • నూనె (వేపుకోడానికి)

విధానం

  1. వంట సోడాలో పెరుగు వేసి కలిపితే పెరుగు పొంగుతుంది. పొంగిన పెరుగులో రవ్వ పంచదార ఉప్పు వేసి కలుపుకోండి
  2. తరువాత గోధుమ పిండి తగినన్ని నీళ్లు పోసి పిండిని బాగా బీట్ చేయాలి 4-5 నిమిషాల పాటు.
  3. బీట్ చేసిన పిండి గిన్నె అంచులకి ఉండే పిండిని తుడిచేయాలి లేదంటే అట్ట కట్టేస్తుంది పిండి. గిన్నె అంచులని శుభ్రం చేశాక మూతపెట్టి కనీసం గంట లేదా 2-3 గంటలైనా ఉంచగలిగితే బొండాలు చాలా బాగా వస్తాయ్.
  4. రెండు గంటల తరువాత మిగిలిన సామాగ్రీ అంతా వేసి మళ్ళీ బాగా బీట్ చేసుకోవాలి
  5. చేతిని బాగా తడి చేసుకోవాలి. తరువాత నీటిని పిండేయాలి. బీట్ చేసిన పిండిని వేడి వేడి వేడి నూనెలో పిండుకోవాలి. (చెంచాతో వేయాలనుకుంటే టిప్స్ చుడండి)
  6. బొండాలు నూనెలో వేశాక మీడియం ఫ్లేమ్ మీద ఎర్రగా వేపుకోవాలి. బొండాలు రంగు మారాక హై ఫ్లేమ్ మీదకి పెట్టి వేపితే కకారకరలాడేట్టు వేగుతాయ్ బొండాలు
  7. ఈ బొండాలు కొబ్బరి అల్లం పచ్చడి సాంబార్ కాంబినేషన్తో చాలా రుచిగా ఉంటాయి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.