మధురై మీనాక్షి ఆలయం గుడాన్నా ప్రసాదం

మెత్తగా వండుకున్న అన్నానికి మూడింతలు బెల్లం అన్నానికి సమానంగా నెయ్యి వేసి వండే పరమ పవిత్రమైన మదురై మీనాక్షీ అమ్మ ప్రసాదం గూడాన్నం.

గుడ్ అంటే బెల్లం అన్నం అంటే బియ్యంతో వండినది. లలితా సహస్రనామాలలో 494వ నామం గుడాన్న ప్రీత మానస అనే నామం ఉంది అంటే బెల్లం అన్నం ఇష్టపడే తల్లీ అని అర్ధం. ఈ గూడాన్నం తెలుగు వారు చేసే చక్కర పొంగలి తీరులోనే ఉంటుంది. కానీ తెలుగు వారి చక్కర పొంగలి లో పెసరపప్పు వేస్తారు.

సంప్రదాయ పద్ధతిలో చేసే గూడాన్నంలో బియ్యం బెల్లం నెయ్యి అంతే!!! ఈ తీరు గూడాన్నం మైసూర్ చాముండేశ్వరి ఆలయంలో ఇంకా మదురై మీనాక్షి అమ్మ కోవెలలోను అమ్మకి నివేదిస్తారు.

ఈ ప్రసాదం తమిళులు మాత్రం అరటిపండు ముక్కతో పాటు ప్రసాదంగా ఇస్తారు. ఈ సులభమైన ప్రసాదం చేసే ముందు కింద టిప్స్ చదివి చేసుకోండి.

Madurai Meenakshi Temple Prasadam Gudannam | Nei pongal

టిప్స్

అన్నం:

నానబెట్టిన బియ్యం అయితే మెత్తగా ఉడుకుతుంది. మెత్తగా ఉడికిన అన్నాన్ని కొద్దిగా మెదుపుకోవాలి.

బెల్లం:

బియ్యంకి మూడింతలు ఉండాలి ఏ కొలతకి చేసినా. బెల్లం కేవలం కరిగితే చాలు. పాకం పట్టడం లాంటివి అవసరం లేదు.

పాత బెల్లం వాడితే అన్నానికి మాంచి రంగు వస్తుంది. ఒక వేళా కొత్త బెల్లం వాడదలిస్తే కాసిని నీరు ఎక్కువగా పోసి ఎక్కువ సేపు మరిగిస్తే బెల్లం పాకం మాంచి రంగులోకి వస్తుంది.

నెయ్యి:

పాకంలో ఉడుకుతున్న అన్నంలో కొద్దీ కొద్దిగా పోసుకోవాలి.

మధురై మీనాక్షి ఆలయం గుడాన్నా ప్రసాదం - రెసిపీ వీడియో

Madurai Meenakshi Temple Prasadam Gudannam | Nei pongal

Prasadam | vegetarian
  • Prep Time 1 min
  • Soaking Time 30 mins
  • Cook Time 25 mins
  • Total Time 56 mins
  • Servings 6

కావాల్సిన పదార్ధాలు

  • 1/2 cup నానబెట్టిన బియ్యం
  • 2 cups బెల్లం
  • 1/2 cup నెయ్యి
  • 3 - 4 యాలకలు
  • 2 పచ్చ కర్పూరం - చిటికెలు
  • జీడిపప్పు - పిడికెడు
  • 2 1/4 cups నీళ్లు

విధానం

  1. నానబెట్టుకున్న బియ్యంలో 1.5 కప్పులు నీళ్లు పోసి కుక్కర్ మూతపెట్టి మీడియం ఫ్లేమ్ మీద మూడు విజిల్స్ రానివ్వండి. స్టీమ్ పోయాక అన్నాన్ని కొద్దిగా మెదుపుకోండి.
  2. దంచుకున్న బెల్లంలో మిగిలిన నీళ్లు పోసి బెల్లం కరిగించి వడకట్టి పక్కనుంచుకొండి.
  3. ఉడికిన అన్నంలో బెల్లం పాకం కొద్దిగా నెయ్యి వేసి అన్నం బెల్లం పాకం పీల్చుకునే దాకా కలుపుతూ దగ్గరపడనివ్వాలి. మధ్య మధ్యన నెయ్యి వేసుకోవాలి.
  4. సుమారు 20 నిమిషాలకి అన్నం దగ్గర పడుతుంది నెయ్యి పైకి తేలుతుంది, అప్పుడు పచ్చకర్పూరం, యాలకుల పొడి వేసి కలిపి దింపేసుకోండి.
  5. మిగిలిన నెయ్యిలో జీడిపప్పు వేసి ఎర్రగా వేపి గూడాన్నంలో కలిపేసుకోండి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

13 comments

Madurai Meenakshi Temple Prasadam Gudannam | Nei pongal