సింపుల్ వెజ్ బిర్యానీ (చిట్టిముత్యాల బియ్యంతో)

దక్షిణ భారతదేశం వారి బాస్మతి బియ్యం చిట్టిముత్యాల బియ్యంలో నచ్చిన కూరగాయ ముక్కలు మసాలా దినుసులు పెరుగు వేసి చేసే బిర్యానీ చెప్పకనే చెబుతుంది దీని ఘుమఘుమలు ఆ వేళ మీ ఇంటి స్పెషల్ రెసిపీ ఏంటో.

ఈ వెజ్ బిర్యానీని రెసిపీని నేను బద్ధకం డేస్ స్పెషల్ రెసిపీ అంటుంటాను. ఎందుకంటె అంత సింపుల్ రెసిపీ మరీ. కూరగాయల్ని మగ్గించి నానబెట్టిన బియ్యం వేసి దగ్గరగా ఉడికిస్తే చాలు, ఐపోయిందంతే… ఒక అద్భుతం!!!

ఇదేమి పెద్ద స్పెషల్ వెజ్ బిర్యానీ రెసిపీ ఏమి కాదు, గంటలు గంటలు సమయం పట్టదు. నిజం చెప్పేదా… చాలా సింపుల్ దాదాపుగా అందరికి తెలిసినదే. కాకపోతే ఇది తమిళనాడు వారి తీరు. వంట చేసే చేతికి ఇంటి ఇంటికి రుచిలో తేడా ఉన్నట్లే తమిళనాడు వారి తీరులో కూడా చిన్న వ్యత్యాసం ఉంది.

ఈ సింపుల్ వెజ్ బిర్యానీకి వాడిన బియ్యాన్నీ చిట్టిముత్యాలు అని తెలుగు వారు, జీరగా సాంబా అని తమిళులు అంటారు. ఈ బియ్యం దక్షిణ భారతదేశం వారి బాస్మతి బియ్యం. ఈ బియ్యం ముత్యాల్లా ఉంటాయని తెలుగువారు చిట్టిముత్యాలు అంటారు. నిజానికి తెలుగు వారికంటే తమిళవారే చిట్టిముత్యాల బియ్యాన్ని ఎక్కువగా వాడతారు.

ఈ చిట్టిముత్యాల బియ్యం కూడా బసంతి మాదిరి మాంచి పరిమళంతో ఉంటాయి, వీటితో బిరియానీ పులావులు పాయసాలు చేస్తుంటారు. చిట్టిముత్యాలని అల్లుడు బియ్యం అని కూడా అంటుంటారు. కొత్త అల్లుడుకి అత్తగారింట్లో ఈ చిట్టిముత్యాల బియ్యం వాడే పాయసం చేసి పెడతారు.

మీరు ఈ రెసిపీని కూడా ఇష్టపడవచ్చు ఎగ్ ధం బిర్యానీ

టిప్స్

చిట్టిముత్యాలు / జీరగాసాంబా:

  1. ఈ బియ్యం బాస్మతీలాంటి పరిమళంతో ఉంటాయి, తప్పక వాడడానికి ప్రయత్నం చేయండి. దొరకనప్పుడు మామూలు బియ్యం కూడా నానబెట్టి వాడుకోవచ్చు. లేదా బాస్మతీ అయినా వాడుకోవచ్చు. కాకపోతే నీరు 1: 2 అని గుర్తుంచుకోండి.

కాయకూరలు:

  1. నేను వేసినా కాయకూరలే వేసుకోవాలని ఏమి లేదు మీకు అందుబాటులో ఉండే ఏవైనా అన్నీ కలిపి ఒక కప్పు ఉండేలా వేసుకోండి. నచ్చితే మష్రూమ్స్, పనీర్ కూడా వేసుకోవచ్చు.
  2. కానీ కాయకూరలు మరీ చిన్నవిగా కూరకి తరిగినట్లుగా తరగకండి, ముక్కలు కాస్త మీడియం సైజు ఉండేలా చూసుకోండి, అప్పుడు బిరియానీలో తింటున్నప్పుడు ముక్క నోటికి అందుతుంది.
  3. తమిళవారి బిర్యానీలో టమాటో ముక్కలు కాయకూరముక్కలు మగ్గిన తరువాత ఆఖరున వేసి కలిపి బియ్యం వేయాలి. టమాటో మెత్తగా మగ్గకూడదు. తింటున్నప్పుడు నోటికి తెలియాలి

వేడి నీరు:

  1. ఎసరుకి వేడి నీరు పోయడం వల్ల బిర్యానీలో మెతుకు పొడిపొడిగా ఉంటుంది. చన్నీళ్ళు పోస్తే వేగి మసాలాల పరిమళాలు బయటికి వచ్చిన ఫ్లేవరంతా పోతుంది. చన్నీళ్ళ కారణంగా బియ్యం ఎక్కువ సేపు ఉడికి మెత్తబడుతుంది. ఆ మెత్తదనం, ముద్ద కట్టేలా ఉండడం అనేది బిర్యానీకి బాగుండదు. ఎసరు:
  2. బిర్యానీలో ఎసరు రుచి చూస్తే కాస్త ఉప్పగా మసాలాల ఘాటు ఉండాలి, అప్పుడే బియ్యం వేశాక అన్నీ సరిపోతాయి. మీరు బిర్యానీ సగం పైన ఉడికిన తరువాత కూడా రుచి చూసి ఉప్పు వేసుకోవచ్చు. కారం తగ్గితే మాత్రం బిర్యానీ తయారయ్యాక పచ్చిమిర్చి ముక్కలు చల్లి మూత పెట్టి వదిలేయండి.

కారం:

  1. ఈ బిర్యానీకి కారం అవసరం లేదు, నేను కేవలం రంగు కోసం కొద్దిగా వేశాను, మీకు ఎండు కారం నచ్చకుంటే పచ్చిమిర్చి ఇంకోటి పెంచుకోండి.

సింపుల్ వెజ్ బిర్యానీ (చిట్టిముత్యాల బియ్యంతో) - రెసిపీ వీడియో

Simple Veg Biryani made with Zeeraka Sambha | Chitti Mutyalu Rice

Bachelors Recipes | vegetarian
  • Prep Time 5 mins
  • Soaking Time 1 hr
  • Cook Time 30 mins
  • Resting Time 15 mins
  • Total Time 1 hr 50 mins
  • serves 4

కావాల్సిన పదార్ధాలు

  • ¼ cup నూనె
  • 1 అనాస పువ్వు
  • 1/2 tbsp మిరియాలు
  • 4 యాలకలు
  • 6-7 లవంగాలు
  • 2” దాల్చిన చెక్క
  • 1 బిర్యానీ ఆకు
  • 15 జీడిపప్పు
  • 1 cup ఉల్లిపాయ చీలికలు
  • 2 పచ్చిమిర్చి చీరినవి
  • 1 cup కాలీఫ్లవర్ ముక్కలు, కేరట్ ముక్కలు, బీన్స్ తరుగు(మధ్యస్థ ముక్కలుగా కట్) (అన్నీ కలిపి)
  • 1/4 cup టమాటో ముక్కలు
  • 1 tbsp అల్లం వెల్లులి పేస్ట్
  • 1/4 cup పెరుగు
  • 1 ½ cups చిట్టిముత్యాల బియ్యం (ఒక గంట నానబెట్టిsoaked for one hour)
  • 1 Bunch పుదీనా
  • 1 Bunch కొత్తిమీర
  • 1 tbsp నిమ్మరసం
  • 3 cups వేడి నీళ్లు

విధానం

  1. నూనె వేడి చేసి అందులో మసాలా దినుసులు జీడిపప్పు వేసి ఎర్రగా వేపుకోండి
  2. వేగిన మసాలాల్లో పచ్చి మిర్చి,ఉల్లిపాయ చీలికలు, ఉప్పు వేసి వేసి లేత బంగారు రంగు వచ్చేదాకా వేపుకోండి
  3. వేగిన ఉల్లిపాయల్లో కాయకూర ముక్కలు, అల్లం వెల్లులి పేస్ట్ వేసి మూతపెట్టి 4 నిమిషాలు వేపితే సగం పైన మగ్గుతాయ్
  4. 4. మగ్గిన కాయకూరల్లో పెరుగు, కాస్త కొత్తిమీర పుదీనా కారం వేసి పెరుగు కూరలో కలిసిపోయేదాకా వేపుకోండి
  5. ఇప్పుడు తరిగిన టమాటో ముక్కలు వేసి కలిపి మరిగే వేడి నీళ్లు పోసి హై ఫ్లేమ్ మీద ఎసరుని తెరలా కాగనివ్వాలి.
  6. మరుగుతున్న ఎసరులో గంటసేపు నానుతున్న చిట్టిముత్యాల బియ్యం కొద్దిగా కొత్తిమీర పుదీనా తరుగు వేసి మెతుకు చిదరకుండా నెమ్మదిగా కలిపి మూతపెట్టి మీడియం ఫ్లేమ్ మీద 7-8 నిమిషాలు వదిలేయండి. ఆ తరువాత నెమ్మదిగా ఒక్క సారి కలిపి బిర్యానీ పూర్తిగా ఉడకనివ్వండి.
  7. బిర్యానీ పూర్తిగా తయారవ్వగానే స్టవ్ ఆపేసి 15 నిమిషాలు వదిలేస్తే అన్నం గుంజుకుని పొడిపొడిగా అవుతుంది.
  8. ఈ బిర్యానీ చల్లని ఉల్లి రైతాతో చాలా రుచిగా ఉంటుంది.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

8 comments

  • S
    Sushil Kumar Rachuri
    Recipe Rating:
    I enjoyed it aroma fragrance. After some hours it’s taste enhanced. What a yummy taste.
  • D
    Deepika
    Hello sir Nenu edaina recipe cheyali ante first mi YouTube channel lo search cheyalsinde ni recipe follow ayipotha without any second thought.The way you explain the recipes in your videos is ultimate.Thank you so much for your channel and videos.It helps us alot .All the best and keep doing . Ulavacharu chicken biryani ledu mi channel lo search chesthe if possible ha recipe cheyandi.Thank you.
  • E
    Ejjivarapu NAGARAJU
    Super
  • K
    Karthu
    Recipe Rating:
    All recipes are yummy with perfect measurements and taste... It comes perfect❤👌
  • V
    Vanitha
    Super tasty
  • S
    Sai Kumar
    super recipe
  • G
    Gopi Krishna
    Recipe Rating:
    Excellent...
  • A
    Abhishek
    Recipe Rating:
    I tried almost all recipies but i didn't comment any one sry for the late response sir we love the way u cook thank u soo much for your recipies