బిర్యానీ ప్రియులకి మరో సులభమైన రెసిపీ ఎగ్ ధం బిర్యానీ. సింపుల్ హైదరాబాదీ ఎగ్ ధం బిర్యానీ రెసిపీ స్టెప్ బై స్టెప్ ఇమేజెస్ ఇంకా వీడియోతో ఉంది చూడండి.

బిర్యానీ చేయడం అంటే అమ్మో అని భయపడతారు, కానీ హైదరాబాదీ ఎగ్ ధం బిర్యానీ రెసిపీ వెజ్ ధం బిర్యానీ రెసిపీ కంటే చాలా సింపుల్. అసలు వంట ఇప్పుడిప్పుడే మొదలేడుతున్న వారు కూడా అద్దిరిపోయేట్లు చేసేస్తారు.

సాధారణంగా రెస్టారెంట్లలో ఎగ్ ధం బిర్యానీ అని ప్రేత్యేకంగా ఏమి చేయరు, ప్లేన్ బిర్యానీ రైస్లో గుడ్డు పెట్టి ఇచ్చేస్తారు. కానీ నేను మసాలాతో బెస్ట్ ఎగ్ ధం బిర్యానీ చేస్తున్నా! ఈ బిర్యానీకి ధం చేయడం కూడా చాలా సులభం.

నేను ఇది వరకు చేసిన చికెన్,మటన్, ఫిష్, ఆలూ, డబుల్ మసాలా చికెన్ ధం బిర్యానీ రెసిపీ అన్నీ సూపర్ హిట్ చేశారు, అలాగే ఇది కూడా చాలా పక్కాగా వస్తుంది.

Egg Dum Biryani

టిప్స్

బాస్మతి రైస్:

సంవత్సరం కంటే పాత బాస్మతి బియ్యంతో, లేదా మాంచి బ్రాండ్ బాస్మతి బియ్యంతో ఎప్పుడూ బెస్ట్ బిర్యానీ వస్తుంది. బియ్యం కచ్చితంగా కడిగి గంట సేపు నానబెట్టుకోవాలి.

బియ్యం 90% ఉడకడం అంటే:

ఉడికిన బియ్యం గింజ నోట్లో వేసుకుంటే తెలుస్తుంది. మొత్తంగా ఉడికి ఆఖరున సన్న పలుకు తగులుతుంది, అది 90% అంటే.

సోనా మసూరి బియ్యంతో బిర్యానీ:

ఈ బిర్యానీకి సోనా మసూరితో అయినా ఇదే పద్ధతి. గంట సేపు బియ్యం నానాబెట్టాలి 90% ఉడికిన బియ్యాన్ని ధం చేసుకోవాలి

మసాల:

నచ్చితే మీరు డబుల్ మసాలా చికెన్ బిర్యానీకి మల్లె మాసాలు డబుల్ చేసుకుని పెరుగు, ఫ్రెష్ క్రీమ్ తో బాలన్స్ చేసుకోవాలి.

ఉప్పు:

రైస్ వండేప్పుడు ఉప్పు ఎక్కువగా వేసుకోవాలి, అప్పుడు బియ్యంకి ఉప్పు బాగా పడుతుంది. ఎసరు నీరు సముద్రపు నీరంత ఉప్పగా ఉండాలి అది పర్ఫెక్ట్ ఉప్పు కొలత.

గుడ్లు :

నచ్చితే గుడ్లకి గాట్లు పెట్టి మసాలా కోటింగ్ ఇవ్వొచ్చు, నేను మామూలుగా ఉడికించిన గుడ్లు వేశాను.

ఎగ్ ధం బిర్యానీ - రెసిపీ వీడియో

Hyderabadi Egg Dum Biryani | Anda Biriyani | How to make Egg Biriyani

Biryanis | nonvegetarian
  • Prep Time 15 mins
  • Cook Time 25 mins
  • Resting Time 15 mins
  • Total Time 55 mins
  • Servings 3

కావాల్సిన పదార్ధాలు

  • మసాలా కోసం
  • 1/4 cup కొత్తిమీర
  • 1/4 cup పుదీనా
  • 1/4 cup వేపిన ఉల్లిపాయ తరుగు
  • 4 - 5 ఉడికించిన గుడ్లు
  • 1 దాల్చిన చెక్క
  • 5 లవంగాలు
  • 4 యాలకలు
  • 1 tsp షాహీ జీరా
  • 1 - 2 అనసా పువ్వు
  • 2 బిర్యానీ ఆకులు
  • 1 నల్ల యాలక
  • ఉప్పు
  • 2 tsp కారం
  • 1 tbsp ధనియాల పొడి
  • 1 tsp వేపిన జీలకర్ర పొడి
  • 3/4 tsp గరం మసాలా
  • 1 tbsp అల్లం వెల్లులి ముద్ద
  • 4 పచ్చిమిర్చి చీలికలు
  • 1/2 cup పెరుగు
  • 1/4 cup ఉల్లిపాయలు వేపుకున్న నూనె
  • బిర్యానీ రైస్ ఉడికించుకోడానికి:
  • 2 liters నీళ్ళు
  • 2 ఇంచులు దాల్చిన చెక్క
  • 2 అనాసపువ్వు
  • 6 - 7 లవంగాలు
  • 6 యాలకలు
  • 2 బిర్యానీ ఆకులు
  • 1 tbsp అల్లం వెల్లులి ముద్ద
  • 1 tbsp షాహీ జీరా
  • 2 నల్ల యాలక
  • 1/4 cup ఎండిన గులాబీ రేకులు
  • 4 పచ్చిమిర్చి చీలికలు
  • 1.5 cup బాస్మతి బియ్యం (250 gm)
  • 1 నిమ్మకాయ
  • 2.5 tbsp ఉప్పు
  • 2 tbsp పుదీనా తరుగు
  • 2 tbsp కొత్తిమీరా తరుగు
  • ధం కోసం
  • 1/4 cup నెయ్యి
  • 2 tbsp పుదీనా తరుగు
  • 2 tsp కుంకుమపువ్వు నీళ్ళు
  • 1/4 tsp గరం మసాలా

విధానం

  1. మసాలా మిక్స్ కోసం ఉంచిన పదార్ధాలన్నీ వేసి గుడ్లు చిదరకుండా మసాలాలని బాగా నలుపుతూ గుడ్లకి పట్టించాలి
  2. ఎసరు నీళ్ళలో పొడి ఉప్పు, మసాలా దినుసులన్నీ వేసి 2-3 నిమిషాలు మరగనిస్తే ఫ్లేవర్స్ నీళ్ళలో దిగుతాయి
  3. తరువాత బాస్మతి బియ్యం, పచ్చిమిర్చి చీలికలు, నిమ్మరసం, పుదీనా కొత్తిమీర, వేసి 90% ఉడికించుకోవాలి (90% ఉడికించడం అంటే ఎంతో టిప్స్ చూడగలరు)
  4. 90% ఉడికిన అన్నాన్ని మసాలా దినుసులతో పాటు వడకట్టి మసాలా మీద వేసెయ్యండి.
  5. బిర్యానీ రైస్ మీద నెయ్యి, కుంకుమ పువ్వు నీళ్ళు, గరం మసాలా పుదీనా తరుగు వేసి ధం బయటకి పోకుండా గట్టిగా మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 8 నిమిషాలు ధం చేసి 15 నిమిషాలు వదిలేయండి. (ఎండిన గులాబీ రేకులు లేని వారు ఇప్పుడు రోస్ వాటర్ రైస్ పైన వేసుకోవచ్చు)
  6. 15 నిమిషాలా తరువాత స్పైసీ మిర్చి కా సాలన్ లేదా మీకు నచ్చిన కర్రీ రైతాతో సర్వ్ చేసుకోండి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

23 comments

  • R
    Rajulucky
    Miru vantalone kadu sir explanation lokuda adarakottesaru... really really super....
  • T
    Tarun
    Good recipe
  • P
    Priya
    All the very best sir
  • P
    Priya
    All the very best sir
  • P
    Priya
    Chaala baagundhi sir..miru cheppe paddhathi..miru matlaade bhasha adbhutham..vanta raanivaallu kuda cheyyagalamu Ane confidence vasthundhi..thank u so much sir..sunnundalu ippudunna generation vallaki ardhamayye vidhanamlo chesi pedathara please sir.. please
  • H
    Hemamrutha
    Recipe Rating:
    I tried but the masala charred on cooking ...rice is fine.
  • R
    Roja kumari
    Hlo ,hai Teja Gru ,nenu e roju egg dum biryani chesa fabulous ga vachindi ..tq Teja Gru .I loved it
  • M
    Mrs H
    Recipe Rating:
    Looks Yum!! If I need to use 3 cups of rice do I need to double all other ingredients please?
  • B
    Bala Krishna
    Recipe Rating:
    I tried it, very tasty
  • S
    Shirisha
    Recipe Rating:
    Super and easy to make
  • C
    Chinna
    Recipe Rating:
    Super..........
  • U
    Umamaheshwar
    Recipe Rating:
    Nice........ Excellent........ Marvelous....... Gorgeous
  • T
    Taraka Rajkumar
    Superb sir...tq
  • S
    Sri
    Incase we want to double the rice quantity, should we double the masala quantity too?
  • S
    Samatha
    Recipe Rating:
    👍 😋
  • A
    Ammu lucky
    Recipe Rating:
    Super
  • A
    Ammu lucky
    Recipe Rating:
    Super
  • A
    Ammu lucky
    Super
  • K
    Kavitha
    Recipe Rating:
    Chala easy ga vndhi sir. Epude e egg biryani chesa sir. Ma husbendki chala nachindhi. Thank u so much sir.
    • Vismai Food
      Thank you. Try Chicken and Mutton Biryani's also I'm sure your family will enjoy it more.
  • G
    Gangamallu D
    Recipe Rating:
    Miru great sir
  • S
    Sana maheen
    Recipe Rating:
    I will definitely try this recipe I love all your recipes iam your biggest fan....
Egg Dum Biryani