పనసకాయ బిర్యానీ

పార్టీలకి స్పెషల్ రోజుల్లో పర్ఫెక్ట్ ఈ పెళ్ళిళ్ళ స్పెషల్ పనసకాయ బిర్యానీ. పనసకాయ బిర్యానీ రెసిపీ స్టెప్ బై స్టెప్ ఇమేజెస్ ఇంకా వీడియో ఉంది చూడండి. పనసకాయ బిర్యానీ రెసిపీ తమిళనాడు పెళ్ళిళ్ళ స్పెషల్ రెసిపీ. ఈ రెసిపీ తమిళనాడు నుండి ఆంధ్రాకి చేరింది చిన్న చిన్న మార్పులతో. నేను తమిళనాడు పెళ్ళిళ్ళ స్టైల్ చేస్తున్నా. ఈ రెసిపీ నేను నా చిన్నప్పుడు చెన్నైలో బంధువుల పెళ్లిలో తిన్నాను, ఆ రుచి, సువాసన మళ్ళీ మళ్ళీ తినిపించేసింది. ఆ రుచి మర్చిపోకుండా చేసేసింది. ఆ తరువాత ఆంధ్రా పెళ్ళిళ్ళలో కూడా తిన్నాను. రుచిగా ఉంది. కానీ, తమిళనాడు పద్ధతిలో లేదు. తమిళనాడు స్టైల్ పనసకాయ బిర్యానీలో కచ్చితంగా డబుల్ బీన్స్ వాడతారు, ఆంధ్రా స్టైల్ బిర్యానీలో బీన్స్ ఎక్కువగా ఉపయోగించారు. నేను తమిళనాడు స్టైల్ బిర్యానీ చేస్తున్న.
నా కొలతల్లో చేస్తే ఈ రెసిపీ కొంచెం ఘాటుగానే ఉంటుంది, స్పైస్ తక్కువగా తినే వారు లవంగాలు, అనాసపువ్వు, మిరియాలు, సొంపు తగ్గించుకోండి.

Raw Jackfruit Biryani Recipe | Easy Kathal Biryani | Panasakaya Biryani

టిప్స్

పనసకాయ:

  1. నేను ఫ్రొజెన్ గా దొరికిన పనసకాయ ముక్కలు వాడాను. వేసవిలో అయితే పచ్చి పనసకాయ ముక్కలు దొరికేస్తాయ్. వేసవి అయిపోతే ఫ్రొజెన్ పనసకాయ ముక్కలు అన్నీ సూపర్ మార్కెట్స్ లో దొరికేస్తున్నాయి.

  2. పనసకాయ ముక్కలు వేపడానికి ముప్పై నిమిషాల ముందు మజ్జిగలో నానబెడితే ముక్క నల్లబడదు.

  3. పనసకాయ ముక్కలు నూనెలో మెత్తగా మరీ ఎర్రగా వేపితే బిర్యానీ తయారయ్యే పాటికి చిదురుచిదురు అయిపోతుంది.

డబుల్ బీన్స్:

  1. తమిళనాడు పెళ్ళిళ్ళలో రాత్రంతా నానబెట్టిన డబుల్ బీన్స్ వాడతారు. నేను వాడాను. డబుల్ బీన్స్ వేస్తే బిర్యానీ రుచి చాలా బాగుంటుంది.

  2. డబుల్ బీన్స్ వాడనట్లైతే ½ కప్ నీళ్ళు తగ్గించుకోండి.

మసాలా పేస్ట్:

మసాలా దీనుసులని వేపి చల్లారాక మెత్తని పేస్ట్ చేసుకోండి

నూనె:

ఈ రెసిపీకి నూనె కాస్త ఎక్కువగానే ఉండాలి, అప్పుడే రుచి లేదంటే అంతా చెప్పినట్లే ఫాలో అయిన అనుకున్న రుచి రాదు.

బిర్యానీ గిన్నె:

కచ్చితంగా అడుగు మందంగా ఉన్న గిన్నె వాడాలి, లేదంటే అడుగుపడుతుంది బిర్యానీ.

Raw Jackfruit Biryani Recipe | Easy Kathal Biryani | Panasakaya Biryani

పనసకాయ బిర్యానీ - రెసిపీ వీడియో

Raw Jackfruit Biryani Recipe | Easy Kathal Biryani

Biryanis | vegetarian
  • Prep Time 5 mins
  • Cook Time 20 mins
  • Resting Time 30 mins
  • Total Time 55 mins
  • Servings 6

కావాల్సిన పదార్ధాలు

  • మసాలా పేస్ట్ కోసం
  • 1 tbsp మిరియాలు
  • 6-7 యాలకాలు
  • 6 - 7 లవంగాలు
  • 2 అనాసపువ్వు
  • 1 ఇంచ్ దాల్చిన చెక్క
  • 1 జాపత్రి
  • 1 tbsp సొంపు
  • 1 tbsp జీలకర్ర
  • 1 tbsp ధనియాలు
  • 1 బిర్యానీ ఆకు
  • 1 పత్తర్ ఫూల్
  • 1 ఇంచ్ అల్లం
  • 7 - 8 వెల్లూలీ
  • బిర్యానీ కోసం
  • 4 tbsps నూనె పనసకాయ ముక్కలు వేపడానికి
  • 1/2 cup నూనె బిర్యానీ కి
  • 300 gms పనసకాయ ముక్కలు
  • 1 cup డబుల్ బీన్స్
  • 3 యాలకలు
  • 1 ఇంచ్ దాల్చిన చెక్క
  • 1 tsp జీలకర్ర
  • 4 లవంగాలు
  • 1 అనాస పువ్వు
  • 200 gms ఉల్లిపాయ చీలికలు
  • 4 పచ్చిమిర్చి చీలికలు
  • చిన్న కట్ట పుదీనా తరుగు
  • చిన్న కట్ట కొత్తిమీర తరుగు
  • ఉప్పు
  • 1/2 tsp పసుపు
  • 1.5 tsp కారం
  • 50 ml నీళ్ళు (మసాలాలు వేపడానికి)
  • 1/2 cup పాలు
  • 1/2 cup చిలికిన పెరుగు
  • 5 cups వేడి నీళ్ళు
  • 2.5 cups బాస్మతి బియ్యం
  • 1/4 cup నెయ్యి
  • 1 నిమ్మకాయ

విధానం

  1. ముకుడులో మసాలా దినుసులు కోసం ఉంచిన పదార్ధాలన్నీ వేసి మాంచి సువాసన వచ్చేదాకా వేపి, అందులోనే అల్లం వెల్లూలీ కూడా వేసి మెత్తని పేస్ట్ చేసుకోండి.
  2. ముకుడులో 4 tbsp నూనె వేడి చేసి పనసకాయ ముక్కలు వేసి ముక్కలు మెత్తబడి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపి తీసి పక్కనుంచుకోండి.
  3. అడుగు మందంగా ఉన్న గిన్నెలో నూనె వేడి చేసి యాలకలు, లవంగాలు, దాల్చిన చెక్క, అనాసపువ్వు, జీలకర్ర వేసి వేపుకోవాలి.
  4. ఉల్లిపాయ చీలికలు, పచ్చిమిర్చి, ఉప్పు వేసి ఉల్లిపాయలు మెత్తబడే దాకా వేపుకోవాలి.
  5. ఉల్లిపాయలు మెత్తబడ్డాక డబుల్ బీన్స్ వేసి మెత్తగా అయ్యేదాక వేపుకోవాలి.
  6. టొమాటో ముక్కలు, పుదీనా కొత్తిమీర తరుగు, పసుపు, కారం, మసాలా పేస్ట్ 50 ml నీళ్ళు పోసి మసాలాలు లోంచి నూనె పైకి తేలేదాక వేపుకోవాలి.
  7. పనసకాయ ముక్కలు, చిలికిన పెరుగు, పాలు, నిమ్మకాయ రసం వేసి నూనె పైకి తేలేదాకా మూత పెట్టి మగ్గనివ్వాలి.
  8. నూనె తేలేకా బాస్మతి బియ్యం వేసి మెతుకు విరగకుండా మసలాలు పట్టించి వేడి వేడి నీళ్ళు పోసి కలిపి మూతపెట్టి హై ఫ్లేమ్ మీద 10 నిమిషాలు ఉడకనివ్వాలి.
  9. 10 నిమిషాల తరువాత బిర్యానీ 80% కుక్ అయిపోతుంది. అప్పుడు బిర్యానీలోకి గరిటతో అక్కడక్కడా కడిపితే స్టీమ్ వదులుతుంది. ఆ తరువాత నెయ్యి వేసి మూతపెట్టేయండి.
  10. తరువాత బిర్యానీ గిన్నెని అట్ల పెనం మీదకి షిఫ్ట్ చేసి 10 నిమిషాలు సన్నని సెగ మీద ఉడకనిచ్చి, స్టవ్ ఆపేసి 30 నిమిషాలు కదపకుండా వదిలేయాలి. ఆ తరువాత అట్ల కాడతో అడుగు నుండి తీసుకోండి.
  11. ఈ స్పైసీ బిర్యానీ చల్లని రైతాతో చాలా రుచిగా ఉంటుంది.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

12 comments

  • M
    Madhuri
    Recipe Rating:
    I tried this for 3 times and every time it's a hit. Thanqqq so much for this wonderful detailed recipe.
  • S
    Srikanya
    Recipe Rating:
    Good
  • R
    Rad
    Recipe Rating:
    nenu chesanu . bagane vachindi. Mee recipe chala easy ga anipinchindi. thank you for the recipe! Mee Biryani Haandi ekkada teesukunnaro konjam cheppandi. Thank you!
  • J
    Junior pk yadav
    Recipe Rating:
    You didn't put salt....
  • L
    Lakshmi
    Recipe Rating:
    Excellent
  • S
    srimayyia
    A lovely dish for get-togethers, special occasions, and weddings is jackfruit biryani.Sri Mayyia is one of the best Caterers in Bangalore offers Innovative catering, fusion food, premium and Luxury Catering Services for Wedding, Small Parties, Griha Pravesh and Corporate parties in Bangalore. We are considered as one of top Veg Caterers in Bangalore. For more info visit our official website https://www.srimayyiacaterers.co.in/ or contact us @ +91-9845038235
  • M
    Mounika
    Good
  • A
    Ajay
    At which point are we checking for the salt??
  • A
    Anjali
    Fabulous recepie andi
  • D
    Devi Venkat
    Recipe Rating:
    Normal rice use chesi chesey vallaki water quantity website lo undhi annaru but Ekkada ledhu annayya
    • S
      Sarvagnyaa
      Recipe Rating:
      The biryani taste so good my mother made it so many times but I try it for the first time it was so delicious
  • B
    Bhuvana
    Recipe Rating:
    My favourite biryani, thanks for the beautiful recipe teja garu😊😊.
Raw Jackfruit Biryani Recipe | Easy Kathal Biryani | Panasakaya Biryani