కొన్ని వంటకాలకి వాతావరణాన్ని బట్టి రుచి పెరుగుతుంది అలా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు జలుబు చేసినప్పుడు ఎంతో రుచిగా అనిపించే రెసిపీ అల్లం పెరుగు పచ్చడి. ఎంతో సింపుల్ అల్లం పెరుగు పచ్చడి రెసిపీ స్టెప్ బై స్టెప్ ఇమేజెస్ ఇంకా వీడియోతో ఉంది చూడండి

పెరుగు పచ్చడి దక్షిణ భారతదేశం వారు దాదాపుగా రోజూ భోజనంతో తింటారు. ప్రాంతాన్ని బట్టి ఎన్నో తీరులుగా చేస్తారు. నేను చేస్తున్న అల్లం పెరుగు పచ్చడి మా అమ్మమ్మ వాళ్ళ హోటల్ స్టైల్ పెరుగు పచ్చడి. వారికి ఒక కేరళ చెఫ్ నేర్పాడు. అన్నంతో ఎంతో రుచిగా ఉంటుంది. జలుబు చేసినప్పుడు నోటికి ఎలాంటి రుచి తెలియనప్పుడు ఇంకా రుచిగా అనిపిస్తుంది.

ఈ సింపుల్ అల్లం పెరుగు పచ్చడి కూడా అన్నీ పెరుగు పచ్చడులు చేసే తీరే కానీ, చేసే తీరులో రుచిలో చిన్న వ్యత్యాసం ఉంది. పర్ఫెక్ట్ రుచి కోసం టిప్స్ చూడండి.

టిప్స్

  1. ఈ పెరుగు పచ్చడి అల్లం ఘాటుతో ఉండాలి, పచ్చిమిర్చి కారంతో ఉండకూడదు. కాబట్టి పచ్చిమిర్చి మితంగా వాడండి.

  2. మెంతులు ఎర్రగా వేగితే పచ్చడికి రుచి పరిమళం, లేదంటే చేదు.

  3. వేసే అల్లం 1 ఇంచ్ ఇంచున్నార అంత కంటే వాడితే తినలేరు ఈ కొలత పెరుగు పచ్చడికి.

  4. అల్లం ముద్ద తాళింపులో 2 నిమిషాలు వేగితే చాలు అంత కంటే వేగితే అల్లం ఘాటు తగ్గుతుంది.

అల్లం పెరుగు పచ్చడి - రెసిపీ వీడియో

Ginger Buttermilk Rasam | Allam Perugu Pachadi | How to make Healthy Ginger Curd Pachadi

Curries | vegetarian
  • Prep Time 2 mins
  • Cook Time 5 mins
  • Total Time 7 mins
  • Servings 4

కావాల్సిన పదార్ధాలు

  • అల్లం పేస్ట్ కోసం
  • 1 tsp మెంతులు
  • 1 కరివేపాకు
  • 1.5 ఇంచ్ అల్లం ముక్కలు
  • 2 పచ్చిమిర్చి
  • 1 cup పచ్చికొబ్బరి తురుము
  • 1/4 tsp పసుపు
  • ఉప్పు – రుచికి సరిపడా
  • తాలింపు కోసం
  • 2 tsp నూనె
  • 1 tsp ఆవాలు
  • 1 tsp మినపప్పు
  • 1 tsp పచ్చి శెనగపప్పు
  • 1 ఎండుమిర్చి
  • ఇంగువ – చిటికెడు
  • 1/2 tsp జీలకర్ర
  • 1 cup పెరుగు
  • 3/4 cup నీళ్ళు
  • కొత్తిమీర – కొద్దిగా

విధానం

  1. మెంతులు వేసి సన్నని సెగ మీద ఎర్రగా వేపుకోవాలి. మెంతులు వేగుతుండగా కరివేపాకు వేసి చెమ్మారి పోయేదాక వేపుకుని తీసుకోండి.
  2. మిక్సీ జార్లో వేపుకున్న మెంతులు అల్లం ముద్ద కోసం ఉంచి సామగ్రి అంతా వేసి నీళ్ళతో మెత్తని పేస్ట్ చేసుకోండి.
  3. తాలింపు కోసం నూనె వేడి చేసి అందులో ఆవాలు మినపప్పు శెనగపప్పు ఎండుమిర్చి ఎండుమిర్చి జీలకర్ర ఇంగువా ఒక్కోటిగా వేసుకుంటూ ఎర్ర వేపుకోవాలి.
  4. వేగిన తాళింపులో అల్లం ముద్ద వేసి 2 నిమిషాలు వేపి స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారచాలి.
  5. పెరుగుని చిలికి అందులో చల్లారిన అల్లం ముద్దా కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఈ పచ్చడి అన్నంతో చాలా రుచిగా ఉంటుంది.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.