అల్లం పచ్చడి ఇడ్లి,దోశలకి | టిఫిన్ సెంటర్ స్టైల్ అల్లం పచ్చడి
చేసే ప్రతీ టిఫిన్కి రోజూ ఏం చట్నీ చేయాలా అని వెతుక్కుంటున్నారా. అయితే ఆంధ్రా స్టైల్ “అల్లం పచ్చడి” చేసి ఉంచుకోండి నెల రోజులు నిలవ ఉంటుంది. స్పైసీ అల్లం పచ్చడి రెసిపీ స్టెప్ బై స్టెప్ ఇమేజెస్ ఇంకా వీడియోతో ఉంది చూడండి.
పచ్చళ్ళు పెట్టాలంటే ఆంధ్రుల తరువాతే అంటారు ఆంధ్రుల గురుంచి తెలిసిన వారెవరైనా! ఎన్ని రకాల పచ్చడులో. దాదాపుగా ప్రతీ కాయ-కూర అన్నింటితో పచ్చడి చేసేస్తారు. అలాంటిదే స్పైసీ అల్లం పచ్చడి. అల్లం పచ్చడి చాలా తీరుల్లో చేస్తారు, ఇది నెల రోజులు నిలవ ఉంటుంది. అన్నంలో కంటే కూడా టిఫిన్స్ లోకి చాలా రుచిగా ఉంటుంది.
ఈ పచ్చడి ముఖ్యంగా ఆంధ్రాలోని గుంటూర్, ప్రకాశం, కృష్ణా జిల్లాలలో సాయంత్రాలు ఏ పకోడీ, పునుకులు బండి దగ్గరికి వెళ్ళినా దొరుకుతుంది. అంత ఇష్టంగా తింటారు అక్కడి వారు. ఈ పచ్చడి ఫ్రిజ్లో పెడితే నెల రోజులు నిలవుంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు తగినంత తీసుకుని తాలింపు పెట్టుకోవచ్చు

టిప్స్
పచ్చిమిర్చి: ఈ పచ్చడికి మీడియం కారం గలవి వాడుకుంటే పచ్చడి ఎక్కువగా వస్తుంది. నేను చెప్పిన కొలత మీడియం కారంగల పచ్చిమిరపకాయల కొలత. ఒక వేళ పచ్చడి బాగా కరంగా అనిపిస్తే ఉడికించిన చింతపండు గుజ్జు , బెల్లం, ఉప్పు తో ఎప్పుడైనా సరి చేసుకోవచ్చు.
వేడి నీళ్ళు : పచ్చడి వేడి నీళ్ళతో రుబ్బితేనే నెల రోజులు నిలవ ఉంటుంది. చన్నీళ్లతో రుబ్బితే పచ్చడి రుచిగా ఉన్నా నిలవ ఉండదు.

అల్లం పచ్చడి ఇడ్లి,దోశలకి | టిఫిన్ సెంటర్ స్టైల్ అల్లం పచ్చడి - రెసిపీ వీడియో
Ginger Chutney | Allam Pacchadi | Andhra Allam Pacchadi | Adrak Chatni | Quick & Easy Chutney | How to make Allam Pachadi | Best Chutney for Breakfast recipes
Prep Time 5 mins
Cook Time 10 mins
Total Time 15 mins
Servings 30
కావాల్సిన పదార్ధాలు
- 200 gm పచ్చిమిర్చి
- 75 gm అల్లం
- 100 gm బెల్లం
- 50 - 70 gm చింతపండు
- ఉప్పు – రుచికి సరిపడా
- వేడి నీళ్ళు
- 2 tbsp నూనె
-
Seasoning
- 2 tbsp నూనె
- 1 tsp అవాలు
- 1 tsp జీలకర్ర
- 2 రెబ్బలు కరివేపాకు
- 2 ఎండుమిర్చి
విధానం
-
నూనె వేడి చేసి పచ్చిమిర్చి ముక్కలు వేసి పచ్చిమిర్చి కాస్త రంగు మారే దాకా వేపుకోవాలి.
-
పచ్చిమిర్చి వేగాక అల్లం ముక్కలు వేసి 2-3 నిమిషాలు వేపి తీసుకోండి.
-
చల్లారిన అల్లం పచ్చిమిర్చితో పారు మిగిలిన పదార్ధాలన్నీ మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ చేసుకోండి.
-
నూనె వేడి చేసి తాలింపు సామానంతా ఒక్కోటిగా వేసి ఎర్రగా వేపుకుని పచ్చడిలో కలిపేసుకోండి.
-
ఈ పచ్చడిని వేడి నీళ్ళతో రుబ్బితే ఫ్రిజ్లో కనీసం నెల రోజులు నిలవ ఉంటుంది.

Leave a comment ×
4 comments