గోంగూర పులుసు | గోంగూర గ్రేవీ | గోంగూర

గోంగూర పులుసు గోంగూరలో నానబెట్టిన సెనగపప్పు ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటో వేసి మెత్తగా ఉడికించి తాలింపు పెట్టి చేసే తెలుగు వారి గోంగూర పులుసు వేడి వేడి అన్నం నెయ్యితో తినడం ఒక గొప్ప అనుభూతి.

తెలుగు వారికి గొంగురంటే ప్రేత్యేకమైన అభిమానం. గోంగూర లేని పెళ్లి శుభకార్యం ఉండదంటే అతిశయోక్తి కాదు. అంతా ఇష్టంగా తినే గోంగూరతో ఎన్ని రకాల వంటకాలో  తెలుగోళ్ళకి.

ఈ సింపుల్ గోంగూర పులుసు దాదాపుగా ప్రతీ తెలుగు వారికి తెలిసినదే కానీ చేసే ప్రతీ సారి ఒకే రుచి రావడానికి ఏ కొలతల్లో చేసుకోవాలి ఇంకా ఏ టిప్స్ పాటిస్తే పులుసు మరీ జారుగా కాకుండా అన్నంతో కలుపుకొందుకు వస్తుందో ఈ టిప్స్ అన్నింటితో ఈ రెసిపీ చెబుతన్నాను. 

టిప్స్

గోంగూర:

గోంగూర ఆకులు వొలిచిన తరువాత ఆకులు కనీసం 4-5 సార్లు నీళ్లతో కడగాలి లేదంటే గోంగూరలో ఇసుక ఉంటుంది.

బియ్యం పిండి:

సాధారణంగా చాలా మంది పులుసును కావలిసిన పదార్ధాలన్నీ వేసి కలిపి ఉడికించేసి తాలింపు పెట్టేస్తారు, ఆ తీరు బాగుంటుంది కానీ ఆ తీరులో పులుసు జారుగా నీరుగా ఉంటుంది అన్నంతో కలిపినప్పుడు అన్నానికి పట్టదు. అందుకు పులుసు ఉడుకెప్పుడు కొంచెం బియ్యం పిండి లేదా సెనగపిండి వేస్తే పులుసు కాస్త దగ్గరగా ఉడుకుతుంది, ఇంకా రుచిగా ఉంటుంది.

చింతపండు:

పుల్లగా ఉండే గొంగురే అయినా కొంచెం అంటే ఒక్క పిసరు చింతపండు వేస్తే వచ్చే పులుపు తో పులుసు మరింత రుచిగా ఉంటుంది.

సెనగపప్పు:

నానబెట్టిన సెనగపప్పుని మాత్రమే వేసుకోవాలి. పప్పు నానబెట్టకుండా వేస్తే పులుపుకి పప్పు ఉడకదు. ఇక్కడ నచ్చితే మీరు నానబెట్టిన పెసర, అలసందలు ఏవైనా వాడుకోవచ్చు.

గోంగూర పులుసు | గోంగూర గ్రేవీ | గోంగూర - రెసిపీ వీడియో

Gongura Pulusu | Sorrel Leaves Gravy | Sorrel Leaves Stew | Vismai Food

Veg Curries | vegetarian
  • Prep Time 10 mins
  • Cook Time 20 mins
  • Total Time 30 mins
  • Servings 6

కావాల్సిన పదార్ధాలు

  • 300 gms గోంగూర ఆకులు
  • ½ cup ఉల్లిపాయ పెద్ద ముక్కలు
  • 3 పచ్చిమిర్చి
  • 2 టమాటో
  • ¼ cup నానబెట్టిన పచ్చిశెనగపప్పు
  • చింతపండు - చిన్న ఉసిరికాయంత
  • 1 cup నీరు
  • 1 tbsp బియ్యం పిండి
  • ఉప్పు - రుచికి సరిపడా
  • తాలింపు కోసం :
  • 3 tbsp నూనె
  • 1 tsp ఆవాలు
  • 3 ఎండుమిర్చి
  • 1 tsp మినపప్పు
  • 1 tsp జీలకర్ర
  • ¼ tsp పసుపు
  • 10 వెల్లులి
  • ¼ tsp ఇంగువ
  • 1 – 1. ¼ tsp కారం
  • 3 sprigs కరివేపాకు

విధానం

  1. సెనగపప్పు కడిగి కనీసం గంటసేపు నానబెట్టుకోండి.
  2. కుక్కర్లో పులుసుకోసం ఉంచిన పదార్ధాలన్నీ నానబెట్టుకున్న సెనగప్పు, నీరు పోసి మూడు విజిల్స్ రానివ్వండి.
  3. కుక్కర్ ఆవిరి పోయాక స్టవ్ ఆన్ చేసి ఉడికిన గోంగూరని పప్పుగుత్తితో ఎనుపుకోండి. తరువాత బియ్యం పిండి కలిపిన నీరు పోసి పులుసుని కాస్త చిక్కబడనివ్వాలి. చిక్కబడ్డాక స్టవ్ ఆపేయండి.
  4. తాలింపు కోసం ఉంచిన పదార్ధాలన్నీ వేసి మీడియం ఫ్లేమ్ కచ్చితంగా తాలింపుని ఎర్రగా ఘుభాళించేలా వేపి పులుసులో కలిపేయండి.
  5. ఈ పులుసు అన్నం జొన్న రొట్టెలు దేనితోనైనా చాలా రుచిగా ఉంటుంది.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.