మామిడికాయ తురుము పచ్చడి | పెళ్ళిళ్ళ స్పెషల్ మామిడికాయ తురుము పచ్చడి

మామిడికాయ పచ్చడి అంటే చాలా ఇష్టమా! అయితే ఆంధ్రా స్టైల్ మామిడికాయ తురుము పచ్చడి చేయండి తృప్తిగా భోజనం చేయండి.

మామిడికాయ పచ్చడులు భారత దేశంలో ప్రతీ 40 కిలోమీటర్లకి ఒక్కోలా చేస్తారని చెప్తుంటారు. ప్రాంతానికి ఒక్కో రుచి. నేను మీకు ఆంధ్రా పెళ్ళిళ్ళకి పెట్టె మామిడికాయ పచ్చడి రేకీపీ చెప్తున్నా. ఈ మామిడికాయ పచ్చడి నేను ఎక్కువగా గుంటూర్ ప్రకాశం జిల్లాలలో వేసవికి జరిగే పెళ్ళిళ్ళకి తప్పక వడ్డిస్తారు. ఈ మామిడికాయ తురుము పచ్చడి కనీసం 2-3 నెలలు పాటు నిలవ ఉంటుంది.

వేడి నెయ్యి వేసిన అన్నం తో చాలా రుచిగా ఉంటుంది. ఈ పచ్చడి కేవలం 5 నిమిషాల్లో అయిపోతుంది.

Grated Raw Mango Pickle | Mamidikaya Turumu Pacchadi | Instant Raw Mango Pickle in Just 5 mins |

టిప్స్

మామిడికాయ:

  1. ఈ పచ్చడికి టెంక ఏర్పడని, లేదా లేత టెంక ఉన్న మామిడికాయ రుచిగా ఉంటుంది. టెంక ఉన్న మామిడికాయతో కూడా చేసుకోవచ్చు. కానీ లేత మామిడికాయల రుచి చాలా బాగుంటుంది.

  2. మామిడికాయ చెక్కు తీసి తురిమితే ఉప్పు పులుపు కారం మామిడి తురుముకి పట్టి వెంటనే తినేట్లుగా ఉంటుంది. చెక్కు ఉంచి తురుముకుంటే ఒక గంట అయినా ఉంచాలి ఊరడానికి.

ఉప్పు:

  1. పచ్చళ్లకి అయోడైస్డ్ ఉప్పు కంటే రాళ్ళ ఉప్పు దంచుకుని వాడుకుంటే పచ్చడి రుచి బాగుంటుంది.

  2. ఉప్పు ఎప్పుడు కాస్త తక్కువ వేసుకుని తరువాత అన్నం లో కలిపి రుచి చూసి కలుపుకోండి

కారం:

  1. నేను పచ్చళ్ల కారం వాడాను. మామూలు కూరలో వేసే కారం అయితే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి.

  2. కారం ఉప్పు కంటే కొద్దిగా ఎక్కువ పడుతుంది. ఈ పచ్చడికి అందుకే ఓ చెంచా ఎక్కువ వేసుకోండి

మామిడికాయ తురుము పచ్చడి | పెళ్ళిళ్ళ స్పెషల్ మామిడికాయ తురుము పచ్చడి - రెసిపీ వీడియో

Grated Raw Mango Pickle | Mamidikaya Turumu Pacchadi | Instant Raw Mango Pickle in Just 5 mins |

Pickles & Chutneys | vegetarian
  • Prep Time 5 mins
  • Cook Time 10 mins
  • Total Time 15 mins
  • Servings 12

కావాల్సిన పదార్ధాలు

  • 3 మీడియం సైజు లేత మామిడి కాయలు
  • ఉప్పు (1/2 కప్ కంటే ఓ చెంచా తక్కువ)
  • కారం (1/2 కప్ కంటే ఓ చెంచా ఎక్కువ)
  • 1/4 cup ఆవాలు
  • 1 tsp మెంతులు
  • 200 ml నువ్వుల నూనె
  • 1/4 spoon ఇంగువా
  • 1/2 tsp పసుపు
  • 4 ఎండు మిర్చి
  • 10-15 వెల్లూలి

విధానం

  1. లేత మామిడికయాలని కడిగి తుడిచి ఆరబెట్టిన వాటిని చెక్కు తీసి తురుముకోండి
  2. ఆవాలు మెంతులు లో ఫ్లేం మీద వేపి పొడి కొట్టుకుని ఉంచుకోండి
  3. ఇప్పుడు ఓ కొలత కప్ తీసుకోండి దాన్నితో మామిడి తురుము కొలుచుకొండి.
  4. నేను తీసుకున్న కాయలకి 3 కప్స్ తురుము వచ్చింది, కాబట్టి 3 కప్స్ కి అదే కప్ తో 1/2 కప్ కంటే ఓ చెంచా తక్కువ ఉప్పు , 1/2 కప్ కంటే ఓ చెంచా ఎక్కువ కారం, 1/2 చెంచా పసుపు, 1 tbsp ఆవాలు మెంతి పిండి, అన్నీ వేసి బాగా కలుపుకుని పక్కనుంచుకోండి. ఇప్పుడు నువ్వుల నూనెని వేడి చేసుకుని ఇంగువ, 1 tsp ఆవాలు, 4 ఎండు మిర్చి , 10-15 వెల్లూలి వేసి 2 నిమిషాలు ఫ్రై చేసుకుని పచ్చడి లో కలుపుకోండి.
  5. పచ్చడి చల్లారాక గాజు సీసాలో నిలవుంచుకుంటే కనీసం 3 నెలల పైన నిలవుంటుంది

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

Grated Raw Mango Pickle | Mamidikaya Turumu Pacchadi | Instant Raw Mango Pickle in Just 5 mins |