పచ్చిమిర్చి పచ్చడి
రోటీ పచ్చడులు ఉంటే చాలు తెలుగు వారికి మరే కూరలు ఆడగఋ అంత ఇష్టంగా తింటారు. అసలే కారం ప్రియులు తెలుగు వారు అందుకే కారంగా ఉండే పచ్చిమిర్చి పచ్చడిని రుచిగా చేసేశారు. అందుకే వేడిగా నెయ్యి అన్నంతో ఇంకా ముద్ద పప్పుతో కలిపి తింటుంటారు. (నేను ఇది వరకే ముద్ద పప్పు రెసిపి చేశాను చూడండి).
పచ్చిమిరపకాయల పచ్చడి రాజస్థాన్ వారు, గుజరాత్ కచ్ ప్రాంతం వారు కూడా చేస్తారు, కానీ తెలుగు వారి పచ్చిమిర్చి పచ్చడి తీరు భిన్నం. నేను చెప్పే తీరులో పచ్చిమిర్చి పచ్చడి బయట 3 రోజులు, ఫ్రిజ్లో వారం పైన నిలవ ఉంటుంది.
ఇదే పచ్చిమిర్చి పచ్చడిలో చిన్న మార్పులతో ఇంటికో తీరుగా చేస్తారు, అంటే నేను రుచితో పారు సువాసన కోసం తాలింపుని గ్రైండ్ చేసీ వేశాను, ఉల్లి వెల్లులి వాడలేదు. ఇలా చిన్న మార్పులే కావొచ్చు కానీ చాలా తీరుల్లో ఉంటుంది అవన్నీ టిప్స్లో ఉంచాను చూడండి.

టిప్స్
పచ్చిమిర్చి:
-
పచ్చిమిర్చి మీడియం కారం గలవి అయితే పచ్చడి కాస్త ఎక్కువ వస్తుంది, ఇంకా తినగలుగుతారు. కారంగల మిరపకాయలు వాడితే డానికి తగినట్లుగా చింతపండు ఉప్పు మోతాదు పెంచుకోవాలి.
-
మిరపకాయలు సన్నని సెగ మీద నిదానంగా వేగితేనే కారం కొంత తగ్గుతుంది ఇంకా పచ్చడి నిలవ ఉంటుంది.
-
పచ్చడి నీళ్ళు వేయకుండా రుబ్బుకుంటే ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది
తాలింపు:
-
మెంతులు ఎర్రగా వేగాలి ఆవాలు చిటచిటలాడే దాకా నిదానంగా వేపుకోవాలి అప్పుడు పచ్చడికి రుచి సువాసన. లేదంటే మెంతులు చేదుగా తగులుతాయ్ పచ్చడిలో.
-
తాలింపు ముందు గ్రైండ్ చేశాక వేగిన మిరపకాయలు గ్రైండ్ చేసుకోవాలి. లేదంటే తాలింపు మెదగదు
-
నచ్చితే ఆఖరున కొద్దిగా ఆవాలు, వెల్లులి తాలింపు పెట్టుకోవచ్చు
ఇంకొన్ని పద్దతులు:
-
కారం తక్కువగా తినే వారు ఉంటే కాసిని వేపిన వేరుశెనగపప్పు వేసుకుని పచ్చడి చేసుకోవచ్చు. కానీ 1-2 రోజుల కంటే పచ్చడి నిలవ ఉండదు
-
మిరపకాయలతో పాటే 2 బెండకాయ, లేదా 2 దొండకాయ, లేదా ఒక వంకాయ ముక్కలు వేపుకుని పచ్చడి చేసుకున్నా చాలా బాగుంటుంది. ఈ తీరు పచ్చడి అట్లుతో చాలా రుచిగా ఉంటుంది.
-
మీకు నేను చేసినట్లుగా ఆవాల తాలింపు నచ్చకుంటే అచ్చంగా మిరపకాయలు వేపుకుని కూడా పచ్చడి చేసుకోవచ్చు.
-
నచ్చితే ఆఖరున 2 tbsp పచ్చి ఉల్లిపాయ సన్నని తరుగు కలిపిన చాలా బాగుంటుంది పచ్చడి.
పచ్చిమిర్చి పచ్చడి - రెసిపీ వీడియో
Green Chilli Chutney | Andhra Style Green Chillies Pacchadi
Prep Time 2 mins
Cook Time 15 mins
Total Time 17 mins
Servings 6
కావాల్సిన పదార్ధాలు
-
తాలింపు వేపడానికి
- 1 tbsp నూనె
- 1/2 tsp మెంతులు
- 1 tsp ఆవాలు
- 1 tbsp మినపప్పు
- 1 రెబ్బ కరివేపాకు
- 1 tsp జీలకర్ర
-
పచ్చడి కోసం
- 300 gm మీడియం కారం పచ్చిమిర్చి
- 4 - 5 tbsp నూనె
- 3 - 4 tbsp చిక్కని చింతపండు గుజ్జు
- 1 tsp బెల్లం
- ఉప్పు – తగినంత
విధానం
-
నూనె వేడి చేసి ఆవాలు మెంతులు వేసి మెంతులు ఎర్రగా వేపుకోవాలి.
-
వేగిన మెంతులలో మినపప్పు, కరివేపాకు, జీలకర్ర వేసి వేపి తీసి మిక్సీలో సాధ్యమైనంత మెత్తగా పొడి చేసుకోండి.
-
అదే ముకుడులో నూనె వేడి చేసి అందులో మిరపకాయలు వేసి మూతపెట్టి సన్నని సెగమీద పచ్చిమిర్చిని మెత్తగా మగ్గనివాలి (ఇదే పచ్చడి చాలా తీరుల్లో చేసుకోవచ్చు వాటికోసం టిప్స్ చూడండి )
-
మగ్గిన మిర్చీని మిక్సీలో వేసుకోండి, అందులో చింతపండు గుజ్జు, బెల్లం ఉప్పు గ్రైండ్ చేసుకున్న తాలింపు వేసి నీళ్ళు వేయకుండా బరకగా రుబ్బుకోండి. ఈ పచ్చడి బయట 3 రోజులు ఫ్రిజ్లో 15 రోజులు నిలవ ఉంటుంది నీరు తగలకపోతే.
-
నచ్చితే ఆఖరున ఆవాల తాలింపు పెట్టుకోవచ్చు.

Leave a comment ×
2 comments