జామకాయ పచ్చడి
జామకాయ పచ్చడి పచ్చి జామకాయల్లో మగ్గించిన పచ్చిమిర్చి వేరుశెనగగుండ్లు ఉప్పు చింతపండు వేసి రుబ్బి బరకగా రుబ్బి తాలింపు పెట్టె ఈ జామకాయ పచ్చడి తెలుగు వారి పెళ్లిళ్లలో ఈ మధ్య కాస్త ఎక్కువగా కనిపిస్తోంది.
పుల్లగా కారంగా జామకాయ వగరుతో చింతపండు పులుపుతో షడ్రసోపేతంగా అమృతంలా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే కాస్త అటూ ఇటుగా కొబ్బరి పచ్చడిగా ఉంటుంది. ఈ జామకాయ పచ్చడి వేడిగా నెయ్యి వేసిన అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది.
ఇదే పచ్చి జామకాయలతో ముక్కల పచ్చడి పెడతారండి చాలా రుచిగా ఉంటుంది పెరుగన్నంతో. అది నేను మరో సారి చెబుతాను.

టిప్స్
జామకాయ:
-
ఈ పచ్చడికి జామకాయ పచ్చిగా కొబ్బరి ముక్కలా గట్టి కండగలిగి ఉండాలి. పండినవి దోర జామకాయలు పనికి రావు.
-
జామకాయల్లోంచి కచ్చితంగా గింజలు తీసేయాలి లేదంటే అవి పచ్చడిలో నలగవు పంటికి పెద్ద పని.
జామకాయ పచ్చడి - రెసిపీ వీడియో
Guava Chutney | Guava Pachadi | Jamakaya pachadi
Pickles & Chutneys
|
vegetarian
Prep Time 1 min
Cook Time 5 mins
Total Time 6 mins
Servings 8
కావాల్సిన పదార్ధాలు
-
పచ్చడి కోసం:
- ½ kg పచ్చి జామకాయలు
- 2 tbsp వేరుశెనగగుండ్లు
- 12-15 పచ్చిమిర్చి
- చింతపండు (చిన్న ఉసిరికాయంత)
- ఉప్పు (సరిపడా)
- కొత్తిమీర (చిన్న పిడికెడు)
- 2 tbsp నూనె
-
తాలింపు కోసం:
- 2 tbsp నూనె
- 1 tsp ఆవాలు
- 1 tsp సెనగపప్పు
- 1 ఎండుమిర్చి
- 1 tsp మినపప్పు
- 6-7 cloves చిదిమిన వెల్లులి
- 2 pinches ఇంగువ
- పసుపు (కొద్దిగా)
- ఉప్పు (రుచానుసారం)
విధానం
-
పచ్చి జామకాయల్లోంచి గింజలు పూర్తిగా తీసేసి చిన్న ముక్కలుగా కోసుకోండి.
-
నూనె వేడి చేసి అందులో వేరుశెనగగుండ్లు వేసి చిట్లనివ్వండి, ఆ తరువాత పచ్చిమిర్చి ముక్కలు వేసి పొంగనివ్వండి.
-
తరువాత వేగిన పప్పు పచ్చిమిర్చి నానేసిన చింతపండు వేసి మెత్తని పేస్ట్ చేసుకోండి ఆ తరువాత పచ్చి జామకాయ ముక్కలు కొత్తిమీర వేసి బరకగా రుబ్బుకోండి.
-
నూనె వేడి చేసి ఆవాలు వేసి వాటిని చిట్లనివ్వండి. ఆ తరువాత సెనగపప్పు, మినపప్పు మరియు ఎండు మిరపకాయలను వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. ఆపై దంచిన వెల్లుల్లి, ఇంగువ, పసుపు వేసి కలపాలి.
-
నూనె వేడి చేసి తాలింపు సామాగ్రీ అంతా వేసి ఎర్రంగా వేపి అందులో బరకగా రుబ్బుకున్న జామకాయ పచ్చడి వేసి కలిపి ఒక్క నిమిషం మగ్గించి దింపేసుకోండి.
-
జామకాయ పచ్చడి నెయ్యి వేసిన వేడి అన్నం తో ఎంతో గొప్పగా ఉంటుంది.

Leave a comment ×