గుమ్మడికాయ పులుసు | ముద్దపప్పు - గుమ్మడికాయ పులుసు | గుమ్మడి కాయ దప్పళం | విస్మయ్ ఫుడ్

ముద్దపప్పు - గుమ్మడికాయ పులుసు ఘుభాళించే తాలింపు పెట్టి అందులో తీపి గుమ్మడి ముక్కలు ఎక్కువగా బెల్లం చింతపండు వేసి బాగా మరగ కాచి చేసే ఆంధ్రుల స్పెషల్ రెసిపీని కమ్మని ముద్ద పప్పు నంజుడుతో తినడం మరచిపోలేని ఒక గొప్ప అనుభూతి.

గుమ్మడికాయ పులుసులు చాలా తీరులో చేస్తారు, ఈ తీరు చాలా సింపుల్ తీరు, కేవలం తాలింపు పెట్టి ఎక్కువ బెల్లం వేసి కాస్త తియ్యగా చేస్తారు. ఇంకా ఈ పులుసు కాస్త పలుచగా ఉంటుంది. కాబట్టి నేతితో తాలింపు పెట్టిన ముద్ద పప్పు నంజుకుని తింటారు.

దక్షిణాది వారికి పులుసులు అనేకం కొన్ని చిక్కగా ఉంటె ఇంకొన్ని పలుచగా ఉంటాయి. పులుపు తగలకుండా దాదాపుగా దక్షిణాది వారి భోజనం పూర్తవదు.

ఈ సింపుల్ పులుసు తెలుగు వారి స్పెషల్. చాలా సింపుల్. కానీ చేసే ముందు కింద టిప్స్ చుడండి.

టిప్స్

తీపి గుమ్మడి:

• ఈ పులుసుకి తీపి ఎర్రటి గుమ్మడి పెద్ద ముక్కలుగా ఉన్నవే వాడుకోవాలి.

పులుసు రుచి ఇలా పెరుగుతుంది:

• తాలింపులో వేసే మెంతులు ఎర్రగా రంగు మారేదాకా వేగాలి అప్పుడే పులుసుకి సువాసన రుచి, ఇంకా పులుసు ఏదో ఊరికే రెండు పొంగులు రానిచ్చి దింపేస్తే గొప్ప రుచేమి ఉండదు. పులుసు సన్నని సెగ మీద నిదానంగా మరగాలి అప్పుడు సారమంతా పులుసులోకి దిగుతుంది.

ఇంకా ఇవి కూడా వేసి చేసుకోవచ్చు:

• గుమ్మడికాయ బదులు, సొరకాయ. చిలకడ దుంప, బూడిద గుమ్మడి, దోసకాయ కూడా వేసి చేసుకోవచ్చు.

ముద్ద పప్పు:

• కంది పప్పుని సన్నని సెగ మీద మాంచి సువాసన వచ్చేదాకా వేపి మెత్తగా ఉడికించి మెత్తగా ఎనిపి ముద్దగా చేసేదే ముద్ద పప్పు. కానీ ఈ పప్పుకి నెయ్యి ఇంగువ జీలకర్ర వేసి పెట్టి చేస్తే ఆ రుచి చాలా గొప్పగా ఉంటుంది.

• ఈ ఘుభాళించే ముద్ద పప్పు ఆవకాయతో కలుపుకు తిన్నా చాలా గొప్పగా ఉంటుంది.

గుమ్మడికాయ పులుసు | ముద్దపప్పు - గుమ్మడికాయ పులుసు | గుమ్మడి కాయ దప్పళం | విస్మయ్ ఫుడ్ - రెసిపీ వీడియో

Gummadikaya Pulusu with Mudda Pappu | Pumpkin Curry | Andhra Style Gummadikaya Pulusu | Pumpkin Stew

Lunch box Recipe | vegetarian
  • Prep Time 2 mins
  • Cook Time 30 mins
  • Total Time 32 mins
  • Servings 5

కావాల్సిన పదార్ధాలు

  • గుమ్మడికాయ పులుసుకి:
  • 300 gms తియ్యటి, ఎర్రటి గుమ్మడి ముక్కలు
  • 3 tbsp నూనె
  • 1 tsp ఆవాలు
  • 1 tsp మినపప్పు
  • 1/4 tsp మెంతులు
  • 2 ఎండుమిర్చి
  • 1 tsp జీలకర్ర
  • 2 pinches ఇంగువ
  • 2 sprigs కరివేపాకు
  • 1 ¼ cups మందపాటి ఉల్లిపాయ చీలికలు
  • 2 పచ్చి మిర్చి (చీలికలు)
  • ఉప్పు - రుచికి సరిపడ
  • 1 tbsp ధనియాల పొడి
  • 1/2 tbsp కారం
  • 1/8 tsp పసుపు
  • 800 ml నీరు
  • 250 ml చింతపండు పులుసు (( 30 gms చింతపండు నుండి తీసినది))
  • 60 gms బెల్లం
  • కొత్తిమీర - చిన్న కట్ట
  • ముద్ద పప్పు:
  • 1/2 cup కంది పప్పు
  • 1 tsp నూనె - వేపడానికి
  • 1 ¼ cup నీరు
  • 1/4 tsp పసుపు
  • 3 tbsp నెయ్యి
  • 1 tsp జీలకర్ర
  • 2 pinches ఇంగువ

విధానం

  1. •గుమ్మడికాయ పులుసు కోసం: నూనె వేడి చేసి ఆవాలు మెంతులు మినపప్పు ఎండుమిర్చి జీలకర్ర కరివేపాకు ఇంగువ వేసి ఎర్రగా వేపుకోవాలి
  2. వేగిన తాలింపులో, ఉల్లిపాయ చీలికలు, పచ్చిమిర్చి, అవాలు వేసి ఉల్లిపాయ మెత్తబడే వరకు వేపుకోవాలి.
  3. మెత్తబడిన ఉల్లిపాయలో తీపి గుమ్మడి ముక్కలు, ధనియాల పొడి, పసుపు, కారం, కొంచెం నీరు వేసి వేపుకోవాలి.
  4. నీరు పోసి, గుమ్మడి ముక్కలు మెత్తబడే వరకు మూతపెట్టి ఉడికించాలి.
  5. గుమ్మడి ముక్కలు మెత్తబడిన తరువాత, చింతపండు పులుసు, బెల్లం వేసి ఇంకో 15 నిమిషాలు మరిగించాలి.
  6. 15 నిమిషాలు మరిగించిన తరువాత, ఉప్పు కారాలు రుచి చూసి, కొత్తిమీర తరుగు వేసి దింపేసుకోండి.
  7. •ముద్ద పప్పు కోసం: నూనె వేడి చేసి కందిపప్పు వేసి సన్నని సెగ మీద మాంచి సువాసన వచ్చేదాకా వేపుకోవాలి.
  8. పప్పు మంచి సువాసన వచ్చాక, నీరు, పసుపు వేసి మీడియం ఫ్లేమ్ మీద మెత్తగా ఉడికించాలి.
  9. మెత్తగా ఉడికిన పప్పులో ఉప్పు వేసి బాగా ఎనుపుకొవాలి.
  10. తాలింపు కోసం ఉంచిన నెయ్యి వేడి చేసి అందులో జీలకర్ర, ఇంగువ వేసి జీలకర్రని చిట్లనిచ్చి, ఎనుపుకున్న పప్పులో కలిపేసుకోవాలి.
  11. వేడి అన్నం ముద్ద పప్పు గుమ్మడికాయ పులుసు కలిపి తినడం మాటలకందని మధురానుభూతి!!!

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.