కట్టే పొంగలి | ఆంధ్రా స్టైల్ కట్టే పొంగల్
ప్రసాదంగా, టిఫిన్ గా ఇంకా లంచ్ బాక్సులకి ఎలా అయినా పర్ఫెక్ట్ గా సరిపోయే రెసిపీ కట్టే పొంగలి. ఆంధ్రా స్టైల్ పొంగల్ రెసిపీ స్టెప్ బై స్టెప్ ఇమేజెస్ ఇంకా వీడియో ఉంది చూడండి.
కట్టే పొంగలి ఇదంటే ప్రతీ దక్షిణ భారతీయుడికి ప్రాణం. ఇది వెనుకటికి వైష్ణవ ఆలయాల్లో ప్రసాదంగా ఇచ్చేవారు, తరువాతి కాలం లో ఇదే ప్రసాదం గా బ్రేక్ఫాస్ట్ గా మారిపోయింది.
తెలుగు రాష్ట్రాల్లో కాస్త తక్కువే కాని తమిళనాడులో చాలా ఎక్కువగా తింటుంటారు. నేను చేస్తున్న పొంగల్ ఆంధ్రా స్టైల్ పొంగల్. తమిళనాడు పద్దతికి ఆంధ్రా పద్దతికి చిన్న వ్యత్యాసం ఉంది. తమిళనాడు పద్ధతి కి పచ్చిమిర్చి వాడరు, ఇంత జరుగా ఉండదు. ఆంధ్రా పద్ధతిలో బియ్యం అట్లకి వాడే బియ్యం వాడతారు. కాస్త ఘాటుగా, కారంగా తింటారు. ఇంకా గంటల తరువాత కూడా మృదువుగా ఉంటుంది. పొడిగా గట్టిగా అవ్వదు పొంగల్.

టిప్స్
బియ్యం:
- మామూలు సోనా మసూరి బియ్యం వాడే కంటే దోశల బియ్యం, రేషన్ బియ్యం అంటారు ఆ బియ్యం అయితే పొంగల్ చల్లరినా రుచిగా ఉంటుంది.
పెసరపప్పు:
- కప్పు బియ్యనికి కప్పు పెసర పప్పు రుచిగా ఉంటుంది. పెసరపప్పు సన్నని సెగమీద మాంచి సువాసన వచ్చేదాకా వేపుకుంటే పొంగల్ రుచి ఇంకా బాగుంటుంది.
కుక్కర్:
- పొంగల్ కుక్కర్లో కంటే విడిగా వండితేనే రుచిగా ఉంటుంది. మీకు పని త్వరగా అయిపోవాలంటే కుక్కర్లో కూడా చేసుకోవచ్చు.
నెయ్యి:
- నెయ్యి ఎంత వేసినా రుచిగానే ఉంటుంది పొంగల్
కట్టే పొంగలి | ఆంధ్రా స్టైల్ కట్టే పొంగల్ - రెసిపీ వీడియో
Katte Pongal | Ven Pongal | Pongal Recipe | How to Make Katte Pongali Recipe
Prep Time 5 mins
Cook Time 30 mins
Total Time 35 mins
Servings 6
కావాల్సిన పదార్ధాలు
- 1 cup దోశ బియ్యం/కంట్రోల్ బియ్యం
- 1 cup పెసరపప్పు
- 5 cups నీళ్ళు
-
తాలింపు కోసం
- 1/3 cup జీడిపపు
- 1 tbsp జీలకర్ర
- 1/2 cup నెయ్యి
- 1 tbsp మిరియాలు
- 2 రెబ్బలు కరివేపాకు
- 2 pinches ఇంగువ
- 1 tbsp అల్లం తరుగు
విధానం
-
ముందుగా బియ్యంని బాగా కడిగి 30 నిమిషాలు నానబెట్టుకోండి
-
ముకుడులో పెసరపప్పు వేసి లో-ఫ్లేం మీద మంచి సువాసనోచ్చెంత వరకు వేపుకోవాలి. ఆ తరువాత కడుక్కోవాలి
-
విడిగా వండితే అడుగు మందంగా ఉన్న గిన్నె లో మాత్రమే 5 కప్స్ నీళ్ళు పోసుకుని సాల్ట్, కడిగిన బియ్యం, కడుక్కున్న పెసరప్పు వేసి మీడియం ఫ్లేం మీద 30 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ ఉడకనివ్వండి.
-
అన్నం మెత్తగా ఉడికాక స్టవ్ ఆపేసి పక్కనుంచుకోండి
- ఇదే పొంగల్ కుక్కర్లో అయితే పొంగల్ పదార్ధాలన్నీ వేసి 5 కూతలు రానిచ్చి తాలింపు వేసుకోండి
-
పొంగల్లోకి తాలింపు కోసం నెయ్యి కరిగించుకుని అందులో మిగిలిన పదార్ధాలన్నీ వేసి బాగా వేపుకుని కలుపుకుని దిమ్పెసుకోండి.

Leave a comment ×
8 comments