దొండకాయ ముద్ద కూర | కాస్త కొత్తగా ఇంకాస్త రుచిగా ఉండాలనుకుంటే ఆంధ్రా స్టైల్ “దొండకాయ ముద్ద కూర” ట్రై చేయండి

రోజూ తినే కూరలు కాస్త కొత్తగా ఇంకాస్త రుచిగా ఉండాలనుకుంటే ఆంధ్రా స్టైల్ “దొండకాయ ముద్ద కూర” ట్రై చేయండి. ఈ సింపుల్ దొండకాయ కూర స్టెప్ బై స్టెప్ ఇమేజెస్ ఇంకా వీడియోతో ఉంది చూడండి.

దొండకాయతో చేసే కూర, పచ్చడి, వేపుడు అందరికీ తెలిసినదే చేసేదే. కానీ, ఈ కూర కాస్త భిన్నంగా ఇంకాస్త రుచిగా అంటే రోజూ తిన్నా బోరు కొట్టకుండా ఉంటుంది.

ఈ దొండకాయ కూరకి ఉల్లీ- వెల్లులి రెండూ అవసరం లేదు. కావాలని వేయకపోవడం కాదు ఈ పదార్ధాలతో ఆ రెండూ అంత రుచిగా అనిపించవు. కాదు ఉండాలి అనుకుంటే వేసుకోవచ్చు. అన్నింటికంటే ఈ కూర చాలా త్వరగా అయిపోతుంది.

Tindora Curry recipe | Dondakaya curry | Best Curry for Roti & Chapati | How to make Dondakayya Curry

టిప్స్

దొండకాయ:

  1. దొండకాయలు లేతగా ఉంటే కూర చాలా రుచిగా ఉంటుంది.

  2. దొండకాయలు కుక్కర్ లో హై-ఫ్లేమ్ మీద ఒకే కూత వచ్చేదాక మాత్రమే ఉడికించి స్టవ్ ఆపేయాలి. లేదంటే దొండకాయ ముక్కలు మరీ మెత్తగా ఉడికి చిదురుగా అయిపోతాయ్.

కొబ్బరి:

  1. దొండకాయ ముద్ద కూరకి పచ్చి కొబ్బరి రుచి చాలా బాగుంటుంది. ఎండు కొబ్బరి రుచిగా ఉండదు.

బెల్లం:

  1. ఆఖరున వేసే ఆ కొద్ది బెల్లం ఉప్పు, పులుపు, తీపిని చక్కగా బాలెన్స్ చేస్తుంది. నచ్చకుంటే వదిలేయవచ్చు.

దొండకాయ ముద్ద కూర | కాస్త కొత్తగా ఇంకాస్త రుచిగా ఉండాలనుకుంటే ఆంధ్రా స్టైల్ “దొండకాయ ముద్ద కూర” ట్రై చేయండి - రెసిపీ వీడియో

Tindora Curry recipe | Dondakaya curry | Best Curry for Roti & Chapati | How to make Dondakayya Curry

Veg Curries | vegetarian
  • Prep Time 5 mins
  • Cook Time 20 mins
  • Total Time 25 mins
  • Servings 6

కావాల్సిన పదార్ధాలు

  • 300 gms లేత దొండకాయ ముక్కలు (పొడవుగా సన్నగా చీరినవి)
  • ఉప్పు
  • 1/4 tsp పసుపు
  • నీళ్ళు – ముక్కలు మునిగేదాక
  • కొబ్బరి కారం కోసం
  • 1 tsp ఆవాలు
  • 1 tbsp మినపప్పు
  • 1 tbsp పచ్చి శెనగపప్పు
  • 1 tsp జీలకర్ర
  • 7 - 8 ఎండు మిర్చి
  • పచ్చి కొబ్బరి – సగం చిప్ప
  • కూర కోసం
  • 2 tbsp నూనె
  • 1/2 tsp ఆవాలు
  • 1 రెబ్బ కరివేపాకు
  • 1/2 cup చింతపండు పులుసు (125 ml)
  • కొద్దిగా ఉప్పు
  • బెల్లం – కొద్దిగా

విధానం

  1. సన్నగా పొడవుగా చీరుకున్న దొండకాయ ముక్కలులో ఉప్పు, పసుపు, ముక్కలు మునిగేదాక నీళ్ళు పోసి కుక్కర్ మూత పెట్టి హై-ఫ్లేమ్ మీద ఒక విసిల్ రానిచ్చి దింపేయండి
  2. కొబ్బరి కారం కోసం ఉంచిన పదార్ధాలు ఒక్కోటిగా అంటే ఆవాలుతో మొదలు పెట్టి ఆఖరున కొబ్బరి వేసి ఎర్రగా వేపుకోవాలి. చల్లారాక పొడి చేసుకోవాలి
  3. నూనె వేడి చేసి ఆవాలు కరివేపాకు వేసి వేపుకోవాలి
  4. బారకగా రుబ్బుకున్న కొబ్బరి కారం వేసి ఒక నిమిషం వేపి చింతపండు పులుసు పోసి నూనె పైకి తేలేదాక ఉడికించుకోవాలి
  5. నూనె పైకి తేలాక ఉడికించున్న దొండకాయ ముక్కలు వడకట్టి పులుసులో వేసి నెమ్మదిగా పట్టించి మూత పెట్టి 4-5 నిమిషాలు మగ్గించాలి
  6. ఆఖరున దింపే ముందు కొద్దిగా బెల్లం వేసి కలిపి దింపేసుకోవాలి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

177 comments

Tindora Curry recipe | Dondakaya curry | Best Curry for Roti & Chapati | How to make Dondakayya Curry