పాలక్ ఫుల్కా | గంటల తరువాత కూడా మెత్తగా ఉంటాయి

ఆరోగ్యం రుచి రెండూ ఒకే రెసిపీ కావలనుకుంటే పాలక్ పుల్కా పర్ఫెక్ట్. ఈ సింపుల్ పాలక్ పుల్కా రెసిపీ స్టెప్ బై స్టెప్ ఇమేజెస్ ఇంకా వీడియోతో ఉంది చూడండి.

పాలక్ ఫుల్కా ఓ రుచికరమైన హేల్తీ ఆప్షన్. పిల్లల లంచ్ బాక్స్ ల్లోకి, లేదా, షుగర్ ఉన్నవారు, డైటింగ్ చేసే వారు అసలు ఆరోగ్యకరమైన ఆహారం తినాలనుకునే ఎవ్వరికైనా ఇది పర్ఫెక్ట్.

మా టిప్స్ ఫాలో అయితే చాలు, గంటల తరువాత కూడా సుతిమెత్తగా ఉంటాయి రోటీలు. ఇవి పప్పు లేదా, రైతాతో చాలా రుచిగా ఉంటాయి.

Healthy Palak Phulka | Super Soft Phulkas | How to make Soft Pulka | Whole Wheat Palak Phulka Recipe

టిప్స్

• పాల కూర కాడలను తీసేసి ఆకులను మాత్రమే ఉడికిన్చుకుని మెత్తగా పేస్టు చేసుకోండి

• గోధుమ పిండిని ఎంత ఎక్కువ సేపు వత్తుకుంటే అంటే సాఫ్ట్ గా వస్తాయి రోటీలు లోపల జిగురు ఏర్పడి. లేదంటే గట్టిగా వస్తాయి. పిండి కూడా తగినన్ని నీళ్ళు పోసుకుంటూ మృదువుగా ఉండాలి.

• రోటీలు మరీ పల్చగా లేదా మరీ మందాగాను లేకుండా, ఎక్కడా రంధ్రాలు లేకుండా వత్తుకుంటేనే రోటీలు పొంగుతాయ్

• రోటీలు పెనం మీద రెండు పక్కల కాస్త మగ్గేదాక కాల్చుకుని ఆ తరువాతే గ్యాస్ మీద వేయాలి అప్పుడే రోటీ లోపలి దాకా ఉడుకుతుంది.

• రోటీలు సరిగా పెనం మీద కాల్చకుండా గ్యాస్ మీద పొంగించినా రోటీ కాలదు, పిండి పిండిగానే ఉంటుంది అని గుర్తుంచుకోండి.

Healthy Palak Phulka | Super Soft Phulkas | How to make Soft Pulka | Whole Wheat Palak Phulka Recipe

పాలక్ ఫుల్కా | గంటల తరువాత కూడా మెత్తగా ఉంటాయి - రెసిపీ వీడియో

Healthy Palak Phulka | Super Soft Phulkas | How to make Soft Pulka | Whole Wheat Palak Phulka Recipe

Healthy Recipes | vegetarian
  • Prep Time 10 mins
  • Cook Time 20 mins
  • Resting Time 30 mins
  • Total Time 1 hr
  • Servings 6

కావాల్సిన పదార్ధాలు

  • 2 cups గోధుమ పిండి
  • 3 పాలకూర - పెద్ద కట్టలు
  • 1 అల్లం - ఇంచ్
  • 5 పచ్చి మిర్చి
  • 1 tbsp వేయించిన జీలకర్ర పొడి
  • 1 tsp చాట్ మసాలా
  • సాల్ట్
  • 200 ml నీళ్ళు

విధానం

  1. నీళ్ళు మరిగించుకుని అందులో కేవలం సన్నగా తరుక్కున్న పాలకూర ఆకులు మాత్రమే వేసి మూత పెట్టి మెత్తగా ఉడికించుకోండి.
  2. మిక్సీ జార్లో ఉడికిన్చుకున్న పాలకూర, అల్లం తరుగు, పచ్చిమిర్చి వేసి కొద్దిగా నీళ్ళు పోసి మెత్తగా పేస్టు చేసుకోండి.
  3. గోధుమ పిండి లో ఉప్పు, పాలకూర పేస్టు, వేసి బాగా కలుపుకుని, కొద్దిగా కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ పిండిని కనీసం 5-6 నిమిషాలు పైన పగుళ్లు లేని పిండిముద్దగా వత్తుకోవాలి.
  4. పిండి సాఫ్ట్ గా ఉండాలి. బాగా వత్తుకున్నాక తడి గుడ్డ కప్పి 30 నిమిషాలు రెస్ట్ ఇవ్వండి.
  5. 30 నిమిషాల తరువాత మళ్ళీ వత్తుకుని చిన్న బాల్స్ గా చేసుకుని పిండి చల్లుకుని రోటీలు వత్తుకోండి.
  6. వత్తుకున్న వాటిని వేడి వేడి పెనం మీద వేసి రెండు వైపులా 1 నిమిషం పాటు కాల్చుకోండి.
  7. రెండు వైపులా కాస్త కాలినట్లు కనపడగానే వెంటనే గ్యాస్ మీద ఓ గ్రిల్ పెట్టి మీడియం ఫ్లేం మీద కాల్చుకోండి వెంటనే పొంగుతుంది, ఆ తరువాత తిప్పి మళ్ళీ కాల్చుకోండి మళ్ళీ పొంగుతుంది.
  8. రోటీలు వేడి మీదే రెండు చుక్కలు నెయ్యి వేసి రుద్దితే చాలా బావుంటాయీ. చాలా సాఫ్ట్ గా ఉంటాయి
  9. నెయ్యి వొద్దనుకున్న వారు కాటన్ బట్టలో కప్పి ఉంచితే గంటల తరువాత కూడా మృదువుగా ఉంటాయ్.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

Healthy Palak Phulka | Super Soft Phulkas | How to make Soft Pulka | Whole Wheat Palak Phulka Recipe