ఆరోగ్యకరమైన స్ప్రౌట్స్ పోహా
మొలకలు, అటుకులు, కూరగాయలతో నిండిన పోషకాల రెసిపీ ఈ మొలకల అటుకుల ఉప్మా(please మొలకల ఉప్మా అని ఇంగ్లీష్ లో రాయకండి స్ప్రౌట్స్ పోహా అనే రాయండి).
ఆరోగ్యకరమైన ఆరంభం అవుతుంది ఈ మొలకల పోహతో. ప్రోటీన్స్ పోషకాలు నిండిన మొలకలు తినడానికి చాలా మంది ఇష్టపడరు, కానీ ఈ తీరులో చేసుకుంటే ఎంతో ఇష్టంగా తింటారు.
ముఖ్యంగా డైట్లో ఉన్న వారికి, బ్యాచిలర్స్కి సింపుల్గా త్వరగా అయిపోయే హెల్తీ టిఫిన్ కోరుకునే వారికి బెస్ట్ చాయిస్ అవుతుంది.
ఈ సింపుల్ మొలకల పోహా కూడా దాదాపుగా నేను ఇది వరకు చేసిన మహారాష్ట్ర తీరు కాందా పోహా తీరులోనే ఉంటుంది, కానీ వేసే పదార్ధాలు వాటి కొలతలు కాస్త భిన్నం. రెసిపీ చేసే ముందు టిప్స్ చదివి చేయండి ఎప్పుడు చేసినా ఒకేలాంటి రుచిని ఆస్వాదించండి.

టిప్స్
అటుకులు
కచ్చితంగా మందంగా ఉండే అటుకులు వాడుకోవాలి. కావాలంటే మీరు జొన్న రాగి లేదా మరింకేదైనా మందంగా ఉండే అటుకులు వాడుకోవచ్చు.
మొలకలు:
-
నేను మిక్స్డ్ మొలకలు వాడాను అంటే పెసలు ఉలవలు సెనగలు ఇలా. మీరు మీకు నచ్చిన మొలకలు వాడుకోవచ్చు.
-
నేను మొలకలని కేవలం 3 నిమిషాలు మాత్రమే మగ్గించాను, ఇలా చేస్తే మొలకలు పూర్తిగా మెత్తగా మగ్గిపోవు, అలా అని పచ్చిగానూ ఉండవు. మీరు ఆలా తినలేరు అనుకుంటే మొలకలని ముందు స్టీమ్ చేసి అటుకులతో పాటు వేసి టాస్ చేసుకోండి
ఇంకొన్ని తీరులు:
-
నచ్చితే ఆఖరున పుదీనా, కొంచెం గరం మసాలా వేసి టాస్ చేస్తే మసాలా ఫ్లేవర్ వస్తుంది.
-
లేదా అటుకులతో పాటుగా ఈ కొలతకి ¼ tsp సాంబార్ పొడి వేసుకోండి, అది ఇంకో పరిమళాన్నిస్తుంది.
-
ఇంకా నచ్చితే ఆఖరున పచ్చి కొబ్బరి వేసుకోవచ్చు. లేదా మొలకలు వదిలేసి కేవలం తాలింపు వేసి మీకు నచ్చిన పప్పులు అంటే సెనగలు ఉలవలు అలసందలు నానబెట్టి ఉప్పేసి మెత్తగా ఉడికించి అటుకులతో కలిపి ఇదే తీరులో చేసుకోవచ్చు.
ఆరోగ్యకరమైన స్ప్రౌట్స్ పోహా - రెసిపీ వీడియో
Healthy Sprouts Poha | How to make Healthy Sprouts Poha With Tips
Prep Time 5 mins
Cook Time 20 mins
Total Time 25 mins
Servings 4
కావాల్సిన పదార్ధాలు
- 1.5 cup అటుకులు
- 3 tbps నూనె
- 3 tbsp వేరుశెనగ గుండ్లు
- 1 tsp ఆవాలు
- 1 tsp జీలకర్ర
- 2 ఎండుమిర్చి
- 2 కరివేపాకు రెబ్బలు
- 1/4 cup ఉల్లిపాయ తరుగు
- 2 పచ్చిమిర్చి (సన్నని తరుగు)
- 1/4 cup కేరట్ తరుగు
- 1/4 cup కాప్సికం తరుగు
- 1/4 cup టమాటో సన్నని తరుగు
- ఉప్పు - రుచికి సరిపడా
- 1/4 tsp పసుపు
- 1/4 cup ఫ్రోజెన్ బటాణీ
- 1/2 cup మొలకలు
- 1/4 tsp పంచదార
- 4 tbsp నీళ్లు
- కొత్తిమీర - కొద్దిగా
- 1 tbsp నిమ్మరసం
విధానం
-
అతుకులని జల్లించండి. తరువాత నీళ్లతో తడిపి జల్లెడలో వదిలేయండి.
-
నూనె వేడి చేసి అందులో వేరుశెనగ గుండ్లు వేసి చిట్లనివ్వాలి. చిట్లుతున్న వేరుశెనగ గుండ్లలో ఆవాలు, జీలకర్ర ఎండుమిర్చి వేసి వేగనివ్వాలి.
-
వేగిన తాలింపులో ఉల్లిపాయ సన్నని తరుగు, పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు వేసి ఉల్లిపాయ మెత్తబడనివ్వాలి.
-
మెత్తబడ్డ ఉల్లిపాయలో కేరట్ కాప్సికం ముక్కలు వేసి 3 నిమిషాలు మగ్గనివ్వాలి.
-
మగ్గిన కేరట్ కాప్సికంలో బటాణీ, మొలకలు, టమాటో ముక్కలు ఉప్పు పసుపు వేసి కలిపి మూతపెట్టి 3-4 నిమిషాలు మగ్గించండి.
-
తరువాత అటుకులు వేసి చిదిరిపోకుండా బాగా టాస్ చేయాలి. ఆ తరువాత కాస్త పంచదార వేసి కలిపి మూకుడు అంచుల వెంట నీళ్లు పోసి కదపకుండా మూత పెట్టి 3-4 నిమిషాలు ఆవిరి మీద ఉడికిస్తే అటుకు సరిగా లోపలిదాకా మగ్గుతుంది.
-
3-4 నిమిషాల తరువాత మూత తీసి నిమ్మరసం కాస్త కొత్తిమీర తరుగు వేసి కలిపి దింపేసుకోండి.

Leave a comment ×
4 comments