పనీర్ రెసిపీస్ అంటే అందరికి ఇష్టమే! పనీర్తో ఎన్నో కూరలు, స్వీట్స్ , స్టార్టర్స్ చేస్తుంటాము. వాటన్నిటికి హెల్తీగా పనీర్ ఇంట్లోనే చాలా సులభంగా చేసుకోవచ్చు.

నా టిప్స్తో చేస్తే ఎప్పుడు చేసినా చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది.

చేసే పనీర్నే ఒక్కో కూరకి ఒక్కో విధంగా చేస్తారు, ఒక్కో స్టార్టర్కి ఒక్కో మాదిరిగా చేయాలి. అదెలాగో స్టెప్ బై స్టెప్ టిప్స్ తో ఉంది ఈ రెసిపీ!

Homemade Paneer Recipe | How to make paneer at home | Best Paneer Recipe

టిప్స్

పాలు:

  1. పనీర్కి చిక్కని పాలు అవసరం. ఎంత చిక్కని వెన్న శాతం ఎక్కువగా ఉండే పాలు ఉంటే పనీర్ అంత రుచిగా ఉంటుంది.

  2. వెనిగర్ : నేను ఫ్లేవర్ లేని వెనిగర్ వాడుతున్నా, నచ్చితే నిమ్మరసం కూడా వాడుకోవచ్చు. కానీ వెనిగర్ వాడితే పనీర్ తెల్లగా ఉంటుంది.

  3. వెనిగర్ : పాలకి ఇంత వెనిగర్ పడుతుంది అని చెప్పలేము, పాల చిక్కదనాన్ని బట్టి వెనిగర్ కొంచెం ఎక్కువ తక్కువ అవసరం అవుతుంది.

పనీర్ సాఫ్ట్గా ఉండాలంటే:

  1. పాలు విరిగిన తారువాత ఇంకా పాలని మరిగించకండి, అలా చేస్తే పనీర్ గట్టిగా అవుతుంది.

  2. వెనిగర్ పోసి పాలని నెమ్మదిగా కలుపుతూ ఉంటే విరుగుతుంది.

  3. అడుగు మందంగా ఉండే గిన్నెలు వాడితే కొవ్వు శాతం ఎక్కువగా ఉండే పాలు అడుగు పట్టవు. ఇంకా చిక్కని పాలు పోసాక అడుగు నుండి కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది.

  4. పనీర్ని వడకట్టగా మిగిలిన నీటిని సూపుల్లో స్టాక్లా వాడుకోవచ్చు.

  5. పనీర్ బాగా సాఫ్ట్గా ఉండాలంటే కాటన్ బట్టలో పనీర్ వేసి కుళాయికి వెళ్లాడదీసి 2-3 గంటలు వదిలేస్తే నీరంతా దిగిపోతుంది పనీర్ చాలా సాఫ్ట్గా ఉంటుంది.

పనీర్ని ఇలా కడగాలి :

  1. పాల విరుగుని తెల్లని బట్టలో వేసి 2-3 సార్లు కడగాలి, అప్పుడు పులుపు వదులుతుంది

  2. పనీర్ కూరలకి అయితే బరువు 30 నిమిషాలు ఉంచాలి, అదే కబాబ్కైతే గంట పైన ఉంచాలి

  3. పనీర్ని ఎయిర్ – టైట్ డబ్బాలో ఉంచి ఫ్రిజ్లో పెడితే 4-5 రోజులు తాజాగా ఉంటుంది. వాడే ముందు 10 నిమిషాలు వేడి నీళ్ళలో ఉంచి ముక్కలు చేస్తే మృదువుగా అవుతుంది.

పనీర్ తయారి విధానం - రెసిపీ వీడియో

Homemade Paneer Recipe | How to make paneer at home | Best Paneer Recipe

Curries | vegetarian
  • Prep Time 2 mins
  • Cook Time 15 mins
  • Resting Time 30 mins
  • Total Time 47 mins
  • Servings 4

కావాల్సిన పదార్ధాలు

  • 1 liter చిక్కని పాలు
  • 125 ml వెనిగర్
  • 125 ml నీళ్ళు

విధానం

  1. అడుగు మందంగా ఉన్న మూకుడులో పాలు పోసి అడుగునుండి కలుపుతూ పాలని ఓ పొంగు రానివ్వండి. పొంగోచ్చక దింపెసుకోండి.
  2. ఇప్పుడు వెనిగర్, నీళ్ళు ఓ గిన్నె లో పోసి కలిపి వేడి వేడి పాలల్లో కొద్దికొద్దిగా పోస్తూ పాలు విరిగి ముద్దగా అయి నీళ్ళు వేరు పడే దాకా కలుపుతూ ఉండండి.
  3. వెనిగర్ వేసాక సరిగ్గా పనీర్ రావడానికి 2 నిమిషాల టైం పడుతుంది
  4. ఇప్పుడు జల్లెడలో ఓ వైట్ కాటన్ క్లాత్ వేసి అందులో ఈ పనీర్ని పోసి వడకట్టి నీళ్ళని గట్టిగా పిండేయండి.
  5. ఇప్పుడు పనీర్ ముద్దని క్లాత్ మీద చతురస్రాకారం లోకి సర్దుకుని క్లాత్తో కప్పి దాని మీద చదునుగా ఉన్న ప్లేట్ పెట్టి దానిమీద ఏదైనా బరువు ఉంచి 30 నిమిషాలు వదిలేయండి.
  6. 30 నిమిషాల తరువాత ముక్కలుగా కోసుకుని ఎయిర్-టైట్ డబ్బా లో పెట్టి ఫ్రిడ్జ్ పెడితే 4-5 రోజు నిలవుంటాయ్.
  7. ఫ్రిజ్ లోంచి తీసి వాడుకునే ముందు 10 నిమిషాలు వేడి నీటిలో ఉంచి వాడుకోండి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

Homemade Paneer Recipe | How to make paneer at home | Best Paneer Recipe