హైదరాబాద్ స్టైల్ అచారీ చికెన్

చికెన్కి పచ్చడి మసాలాల్ని దట్టించి చేసే హైదరాబాద్ స్పెషల్ రెసిపీ.అచారి చికెన్ పచ్చడి పరిమళంతో పాటుగా పుల్లగా కారంగా ఘాటుగా ఉంటుంది. అన్నం రోటీలతో పర్ఫెక్ట్గా ఉంటుంది.

అచార్ అంటే పచ్చడి. పచ్చడి వేసి ఈ చికెన్ కర్రీ చేయకపోయినా పచ్చడికి వాడే పదార్ధాలు వేసి చేయడం వల్ల ఈ చికెన్కి ఆ రుచి పరిమళం వస్తుంది. దాదాపుగా అన్ని చికెన్ కర్రీల మాదిరే ఉంటుంది, కానీ వేసే పదార్ధాలు వండే తీరు భిన్నం అంతే!

అచారీ చికెన్ నార్త్ ఇండియా రెస్టారెంట్స్లో ఎంతో పాపులర్! హైదరాబాద్ స్టైల్ అచారీ చికెన్ దక్షిణాది ఆవకాయ ఫ్లేవర్స్తో ఉండదు, నార్త్ ఇండియా పచ్చడి ఫ్లేవర్స్తోనే ఉంటుంది, కాకపోతే కరివేపాకు లాంటివి ఉంటాయంతే! ఈ చికెన్ కర్రీ హైదరాబాద్ రెస్టారెంట్స్ కంటే ముస్లిమ్స్ పెళ్లిళ్లలో ఎక్కువ చేస్తారు!

Hyderabadi Style Achari Chicken masala | Avakai Chicken | Avakaya Chicken Masala

టిప్స్

చికెన్:

మసాలాలు పట్టించిన చికెన్ కచ్చితంగా 1 గంట అయినా నానాలి. ఇంకా ఎక్కువ నానితే చాలా రుచిగా ఉంటుంది చికెన్ ఫ్లేవర్స్ బాగా ముక్కకి పట్టి.

అచారీ మసాలా పొడి:

అచారీ పొడి సన్నని సెగ మీద నెమ్మదిగా వేపితే పొడి మాంచి పరిమళంతో చాలా బాగుంటుంది. నేను ఈ కొద్దీ పొడి స్పైస్ గ్రైండర్లో గ్రైండ్ చేశా =ను కాబట్టి మెత్తగా పొడి చేయగలిగా, స్పైస్ గ్రైండర్ లేనట్లయితే దంచుకోవడం మేలు.

కలోంజీ:

నార్త్ ఇండియన్స్ పచ్చళ్ళలో కలోంజీ వేస్తారు, వేస్తే పచ్చడి పరిమళం బాగుంటుంది. నచ్చని వారు అందుబాటులో లేని వారు వేయకపోయినా పర్లేదు.

ఆఖరుగా:

కూర అంతా తయారయ్యాక స్టవ్ ఆపేసి 30 నిమిషాలైనా రెస్ట్ ఇవ్వాలి అప్పుడు చికెన్కి ఫ్లేవర్స్ బాగా పట్టుకుంటాయి.

నాన్ వెజ్ కూరలకి నూనెలుంటేనే రుచి. నచ్చని వారు తగ్గించుకోవచ్చు.

హైదరాబాద్ స్టైల్ అచారీ చికెన్ - రెసిపీ వీడియో

Hyderabadi Style Achari Chicken masala | Avakai Chicken | Avakaya Chicken Masala

Bachelors Recipes | nonvegetarian
  • Prep Time 5 mins
  • Cook Time 30 mins
  • Resting Time 1 hr
  • Total Time 1 hr 35 mins
  • Servings 4

కావాల్సిన పదార్ధాలు

  • అచారీ మసాలా పొడి కోసం
  • 5 ఎండు మిర్చి
  • 1/4 tsp మెంతులు
  • 1/2 tsp ఆవాలు
  • 1 tbsp ధనియాలు
  • 1 tsp జీలకర్ర
  • 1/2 tsp కలోంజీ
  • చికెన్ నానబెట్టడానికి:
  • 1/2 Kilo చికెన్
  • 1 cup పెరుగు (250 ml)
  • ఉప్పు
  • 1 tsp వేయించిన జీలకర్ర పొడి
  • 1 tsp ధనియాల పొడి
  • 1/4 tsp పసుపు
  • 2 tbsp కారం
  • కర్రీ కోసం
  • 6 tbsp నూనె
  • 1/2 tsp ఆవాలు
  • 1/2 tsp జీలకర్ర
  • 3 ఎండుమిర్చి
  • 2 కరివేపాకు రెబ్బలు
  • 1 cup ఉల్లిపాయలు
  • 1.5 tbsp అల్లం వెల్లులి పేస్ట్
  • 250 ml నీళ్లు
  • 1 1/4 tbsp నిమ్మరసం
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా
  • 4 పచ్చిమిర్చి చీలికలు

విధానం

  1. చికెన్ నానబెట్టుకోడానికి ఉంచిన పదార్ధాలన్నీ వేసి చికెన్కి బాగా పట్టించి కనీసం గంట పైన నాననివ్వాలి.
  2. అచారీ మసాలా పొడి కోసం ఉంచిన పదార్ధాలు ఒక్కోటిగా సన్నని సెగ మీద మాంచి పరిమళం వచ్చేదాకా వేపుకుని మెత్తని పొడి చేసుకోండి.
  3. నూనె వేడి చేసి ఆవాలు జీలకర్ర వేసి చిట్లనివ్వాలి. తరువాత ఉల్లిపాయ తరుగు కరివేపాకు వేసి ఉల్లిపాయని మెత్తబడనివ్వాలి.
  4. మెత్తబడిన ఉల్లిపాయలో అల్లం వెల్లులి ముద్ద వేసి వేపుకోవాలి. వేగిన ముద్దలో గంటపైన నానబెట్టిన చికెన్ వేసి నూనె పైకి తేలేదాక హై ఫ్లేమ్ మీద కలుపుతూ వేపుకోవాలి.
  5. 15 నిమిషాలు వేగిన తరువాత చికెన్లోంచి నూనె పైకి తేలుతుంది అప్పుడు 1 కప్పు నీళ్లు, గ్రైండ్ చేసుకున్న అచారీ మసాలా పొడి కొద్దిగా మిగిల్చి మొత్తం వేసి కలిపి మూత పెట్టి 20 నిమిషాల పాటు మధ్య మధ్యన కలుపుతూ నూనె పైకి తేలేదాక ఉడకనివ్వాలి.
  6. చికెన్ ముక్క మెత్తబడి నూనె పైకి తేలాక బాగా కలిపి నిమ్మరసం మిగిల్చుకున్న మసాలా పొడి వేసి కలిపి దింపి 30 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి.
  7. 30 నిమిషాల తరువాత వేడి అన్నం, బాగారా అన్నం లేదా రొటీస్తో సర్వ్ చేసుకోండి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

Hyderabadi Style Achari Chicken masala | Avakai Chicken | Avakaya Chicken Masala