ఆంధ్రా స్టైల్ ఇన్స్టంట్ కేరట్ పచ్చడి
వేడిగా నెయ్యి వేసిన అన్నంతో టిఫిన్స్తో ఎంతో రుచిగా ఉంటుంది ఆంధ్రా స్టైల్ ఇన్స్టంట్ కేరట్ పచ్చడి. పచ్చడులు చాలా తీరులో చేస్తారు పచ్చళ్ల ప్రియులైన తెలుగు వారు.
కేరట్ పచ్చడి చిన్న మార్పులతో చాలా తీరులో చేస్తారు అందులో ఇదొకటి. ఈ పచ్చడిలో ఉల్లి వెల్లులి లేదు. నచ్చితే వేసుకోవచ్చుఇంకా కేరట్ ని నూనెలో వేపడం మగ్గించడం లాంటివి అవసరంలేదు. కేవలం తాలింపు వేపి పొడి చేసి పచ్చి కేరట్ తురుముతో కలిపేయడమే!
లంచ్ బాక్సులకి, లేదా సింపుల్గా త్వరగా అయిపోయే పచ్చడి కావాలంటే ఈ పచ్చడి పర్ఫెక్ట్!
Try this: Carrot Chutney and Green Chilli Chutney

టిప్స్
మెంతులు:
కేరట్ పచ్చడిలో మెంతులు ఎర్రగా వేగితే రుచి సువాసన. కాబట్టి మెంతులు ఎర్రగా వేపుకోవాలి
మరికొన్ని టిప్స్:
-
ఈ పచ్చడికి ఎండుమిర్చి వేగాలి, పచ్చిమిర్చి పచ్చిగానే గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా కేరట్ కూడా స్టవ్ ఆపేసి కలుపుకుంటే సరిపోతుంది నూనెలో వేపనవసరం లేదు.
-
పచ్చడిలో తాలింపుల పొడి కలిపినా తరువాత కనీసం 30 నిమిషాలు వదిలేస్తే ఉప్పు కారాలు కేరట్కి బాగా పట్టి రుచిగా ఉంటుంది పచ్చడి.
ఆంధ్రా స్టైల్ ఇన్స్టంట్ కేరట్ పచ్చడి - రెసిపీ వీడియో
Instant Carrot Carrot Chutney | Andhra Style Carrot Chutney
Prep Time 2 mins
Cook Time 7 mins
Total Time 9 mins
Servings 5
కావాల్సిన పదార్ధాలు
- 200 gm కేరట్ తురుము
- 1.5 tsp నూనె
- 1/2 tsp మెంతులు
- 1 tsp ఆవాలు
- 1 tsp మినపప్పు
- 1 tbsp సెనగపప్పు
- 2 ఎండుమిర్చి
- 3 - 4 పచ్చిమిర్చి
- ఉప్పు
- ఇంగువ చిటికెడు
- కొత్తిమీర - కొద్దిగా
- చింతపండు - ఉసిరికాయంత
-
తాలింపు కోసం
- 1.5 tsp నూనె
- 1/2 tsp ఆవాలు
- 1/2 tsp జీలకర్ర
- 2 ఎండు మిర్చి ముక్కలు
- 2 రెబ్బలు కరివేపాకు
విధానం
-
నూనె వేడి చేసి అందులో మెంతులు ఆవాలు వేసి మెంతులు ఎర్రగా అయ్యేదాకా వేగనివ్వాలి.
-
మెంతులు వేగి మాంచి సువాసన వస్తుండగా మినపప్పు సెనగపప్పు వేసి ఎర్రగా వేపుకోవాలి.
-
తరువాత ఎండుమిర్చి వేసి వేపుకోవాలి. ఎండుమిర్చి రంగు మారాక ఇంగువ కొత్తిమీర పచ్చిమిర్చి ముక్కలు చింతపండు వేసి స్టవ్ ఆపేసి 2-3 నిమిషాలు వేపుకోండి.
-
చల్లారిన తాలింపుని మెత్తని పొడి చేసుకోండి.
-
ఇప్పుడు పచ్చడి తాలింపు కోసం నూనె వేడి చేసి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ముక్కలు వేసి మాంచి రంగు వచ్చేదాకా వేపుకోవాలి , తరువాత కరివేపాకు వేసి వేపుకోండి.
-
వేగిన తాలింపు స్టవ్ ఆపేసి కేరట్ తురుము గ్రైండ్ చేసుకున్న తాలింపు పొడి ఉప్పు వేసి కలిపి గంట సేపు వదిలేస్తే తాలింపు పరిమళం ఉప్పు కారాలు బాగా పట్టుకుంటుంది పచ్చడి.

Leave a comment ×