ఇన్స్టంట్ మజ్జిగ గారెలు-చల్ల గారెలు | సింపుల్ మజ్జిగ గారెలు
ఇన్స్టంట్గా గారెలు తినాలంటే పుల్లని కరకరలాడే మజ్జిగ గారెలు ట్రై చేయండి చాలా రుచిగా ఉంటాయ్. ఈ సింపుల్ మజ్జిగ గారెలు స్టెప్ బై స్టెప్ ఇమేజెస్ ఇంకా వీడియో తో ఉండి చూడండి.
“వడ” అంటే అందరికీ తెలుసు, వీటినే తెలుగు వారు గారెలు అంటారు. నిజానికి గారెలకి వడలకి చిన్న వ్యత్యాసం ఉంది. గారెల పప్పు మెత్తగా వెన్నలా రుబ్బాలి, గారెల పిండి కాస్త బరకగా రుబ్బుకోవాలి.
మజ్జిగ గారెలు అనగానే పెరుగు వడ గుర్తొస్తుంది, కానీ ఇది పుల్లని మజ్జిగ వాడి చేస్తారు. ఈ గారెలని చల్ల గారెలు అంటారు తెలుగు వారు. చల్లా అంటే మజ్జిగ అని అర్ధం తెలుగులో.
గారెలు ఎన్నో తీరులుగా చేసుకోవచ్చు, ఇవి ఇన్స్టంట్గా అప్పటికప్పుడు కేవలం పది నిమిషాల్లో అటుకులతో చేసే గారెలు. మామూలు గారెల కంటే కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయ్.

టిప్స్
అటుకులు:అటుకులు మందంగా ఉండేవి వాడాలి
పెరుగు:అటుకులలో సగం ఉండాలి. పెరుగు ఎక్కువైతే పిండి జారవుతుంది. పెరుగు పుల్లనిది అయితే రుచిగా ఉంటుంది. పుల్లని పెరుగు లేకపోతే పెరుగులో కొద్దిగా నిమ్మరసం వేసుకోవచ్చు.
నచ్చితే: కొద్దిగా బొంబాయ్ రవ్వ, ఇంకా ఉల్లిపాయ తరుగు వేసుకోవచ్చు.
ఇలా ఫ్రై చేయాలి:
-
గారెలు మరీ పలుచన కాకుండా చూసుకోవాలి, లేదంటే చెక్కలులా వస్తాయి
-
పిండి జారైతే కొద్దిగా బియ్యం పిండి వేసుకోవచ్చు.

ఇన్స్టంట్ మజ్జిగ గారెలు-చల్ల గారెలు | సింపుల్ మజ్జిగ గారెలు - రెసిపీ వీడియో
Instant Crispy ButterMilk Vada | In just 10 mins | Quick and Easy Majjiga Garelu Recipe | How to make Wada
Prep Time 5 mins
Soaking Time 5 mins
Cook Time 5 mins
Total Time 15 mins
Servings 10
కావాల్సిన పదార్ధాలు
- 2 Cups అటుకులు
- 1 cup పుల్లని పెరుగు
- 2 tsp పచ్చిమిర్చి తరుగు
- 1 tsp అల్లం తరుగు
- 1/4 tsp ఇంగువ
- 1 tsp జీలకర్ర
- ఉప్పు
- 2 tsp కొత్తిమీర తరుగు
- నూనె వేపుకోడానికి సరిపడా
విధానం
-
అటుకులు మునిగేంత వరకు నీళ్ళు పోసి 5 నిమిషాలు నాననివ్వండి.
-
5 నిమిషాల తరువాత అటుకులలోంచి నీరు గట్టిగా పిండి అటుకులని ఓ బౌల్ లో వేసుకోండి.
-
ఇప్పుడు అటుకులలో ఉప్పు, సాల్ట్, జీలకర్ర, ఇంగువా, కొత్తిమీర తరుగు, పుల్లటి పెరుగు వేసి గట్టిగా అటుకులని పిండుతూ మెత్తగా అయ్యేదాకా కలుపుకొండి.
-
ఇప్పుడు చేతులు తడి చేసి చిన్న పిండి ముద్దని గారెల మాదిరి తట్టుకుని వేడి వేడి నూనె లో వేసి మీడియం ఫ్లేం మీద ఎర్రగా క్రిస్పీగా వేపుకోండి.
-
ఇవి మామూలు మినపగారెల కంటే కూడా వేగడానికి ఎక్కువ టైం పడుతుంది. మాంచి గోల్డెన్ కలర్ లోకి రాగానే తీసి పక్కనుంచుకోండి.

Leave a comment ×
2 comments