ఇన్స్టంట్ ఇడ్లి రెసిపి | సాఫ్ట్ ఇడ్లి రెసిపీ | విస్మయ్ ఫుడ్

ఇన్స్టంట్ ఇడ్లి రెసిపీ అటుకులు రవ్వ పెరుగులో కలిపి ముప్పై నిమిషాలు ఊరనిచ్చి ఆవిరి మీద ఉడికించి చేసే ఇన్స్టెంట్ ఇడ్లి పొద్దుపొద్దున్నే ఏ టిఫిన్ చేయాలి అని వెతుక్కునే వారికి ఎంతో ఉపయోగపడుతుంది.

ఈ సింపుల్ అటుకుల ఇన్స్టెంట్ ఇడ్లీ మాములుగా సంప్రదాయ పద్ధతిలో పప్పు నానబెట్టి పులియబెట్టి చేసే ఇడ్లీలకి ఏ మాత్రం తీసిపోవు.

టిప్స్

అటుకులు:

• మందపాటి అటుకులు కడిగి నానబెట్టుకోండి. నచ్చితే ఇక్కడ మీరు ఎర్రటి అటుకులు కూడా వాడుకోవచ్చు

పెరుగు:

• పుల్లని పెరుగు వాడుకోగలిగితే చాలా రుచిగా ఉంటాయి ఇడ్లీ. లేనట్లయితే కమ్మని పెరుగు వాడుకున్నా పర్లేదు

మృదువైన ఇడ్లీల కోసం:

• పిండిని బాగా బీట్ చేయాలి. అప్పుడు బాగా పొంగుతుంది పోయింది.

ఇన్స్టంట్ ఇడ్లి రెసిపి | సాఫ్ట్ ఇడ్లి రెసిపీ | విస్మయ్ ఫుడ్ - రెసిపీ వీడియో

Instant Idli Recipe | Soft Idli Recipe | Vismai Food

Breakfast Recipes | vegetarian
  • Prep Time 1 min
  • Cook Time 20 mins
  • Resting Time 15 mins
  • Total Time 36 mins
  • Servings 3

కావాల్సిన పదార్ధాలు

  • 1 cup రవ్వ
  • 1 cup మందపాటి అటుకులు
  • 1 cup పెరుగు
  • ఉప్పు - రుచికి సరిపడా
  • 1/2 tsp వంట సోడా
  • 1/2 cup నీరు

విధానం

  1. అటుకులు కడిగి ముప్పై నిమిషాలు నానబెట్టుకోండి
  2. పెరుగులో సోడా వేసి పొంగించండి. పొంగిన సోడాలో రవ్వ వేసి బాగా బీట్ చేయండి. ముప్పై నిమిషాలు ఊరనివ్వండి.
  3. నానిన అటుకులలో కొద్దిగా నీరు వేసి మెత్తని పేస్ట్ చేసుకోండి. తరువాత నానిన రవ్వలో, అటుకుల పేస్ట్, ఉప్పు వేసి మళ్ళీ బాగా బీట్ చేయండి. అవసరాన్ని బట్టి కొద్దిగా నీరు వేసుకోండి.
  4. ఇడ్లీ ప్లేట్స్ లో పిండి వేసి, హై ఫ్లేమ్ మీద 5 నిమిషాలు, లో ఫ్లేమ్ మీద మూడు నిమిషాలు ఉంచిన తరువాత స్టవ్ ఆపేసి 5 నిమిషాలు అలా వదిలేయండి.
  5. తరువాత ఇడ్లీలు తీసి, నెయ్యి కారం పొడి వేసి సర్వ్ చేసుకోండి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

3 comments

  • M
    Mubeena
    Recipe Rating:
    Wooooowww easy recipe
    • M
      Mery Jyothi Panthadi
      Recipe Rating:
      Hi sir Briyani chesanu superga vachidi hotel style lo ne
    • M
      Mery Jyothi Panthadi
      Recipe Rating:
      Hi sir Briyani chesanu superga vachidi hotel style lo ne