మసాలా దోశ | ఇన్స్టంట్ మసాలా దోశ రెసిపీ | దోశ రెసిపీ | మసాలా దోశ రెసిపీ
ఇన్స్టంట్ మసాలా దోశ రెసిపీ- మెత్తగా ఉడికించుకున్న ఆలూకి ఆవాలు మినపప్పు తాలింపు పెట్టి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి చేసే కూర మసాలా దోశ కూర, గోధుమపిండితో, రవ్వ, బియ్యం పిండి వేసి కేవలం పది నిమిషాలు ఊరనిచ్చి అట్టుగా పోసి ఎర్రగా కాల్చి ఆలూ కూర మధ్యలో పెట్టి ఇచ్చే మసాలా దోశ మామూలుగా పిండి పులియబెట్టి చేసే మసాలా దోశకి ఏమాత్రం తక్కువ కాదు.
పొద్దున్నే ఏ టిఫిన్ చేయాలి అని ఆలోచించే వారికి అందరికి నచ్చే గొప్ప రెసిపీ ఈ గోధుమ పిండి తో చేసే ఇన్స్టెంట్ మసాలా దోశ రెసిపీ. కేవలం 10 నిమిషాలు పిండి పులియబెడితే చాలు కరకరలాడే గోధుమపిండి మసాలా దోశ తయారవుతుంది. ఇది లంచ్ బాక్సులకి కూడా ఎంతో బాగుటుంది.

టిప్స్
ఆలూ కూర:
-
బంగాళా దుంపని ముందు రోజే ఉడికించి ఫ్రిజ్లో ఉంచుకుంటే పని ఇంకా సులభం అవుతుంది.
-
ఆలూ కూర మరీ పొడిగా కాకుండా కాస్త నీరు వేసి మెత్తగా చేసుకుంటే అట్టు మీద సులభంగా స్ప్రెడ్ అవుతుంది. లేదంటే పొడి పొడిగా ఉండి అట్టులోంచి జారిపోతుంది.
-
మసాలా అట్టులో పెట్టే ఆలూ కూరలో ఎండు కారం వేయరు. కారమంతా సన్నని అల్లం తురుము, పచ్చిమిర్చి తరుగు తోనే వస్తుంది. ఇంకా కొత్తిమీర కాస్త దండిగా ఉంటే చాలా రుచిగా ఉంటుంది.
-
నేను జీడిపప్పు వేపి కలిపాను. మీరు కావాలనుకుంటే వేరుసెనగ గుండ్లు కూడా వేపి కలుపుకోవచ్చు.
అట్టు పిండి:
- గోధుమపిండిలో నీరు పోశాక జిగురుగా ఉండి గడ్డలు ఏర్పడతాయి, కాబట్టి గడ్డలని చిదుముకుంటూ పిండి వేళ్ళతో బీట్ చేసుకుంటే గడ్డలు కరిగి పిండి తేలికపడుతుంది.
అట్టు కాల్చే తీరు:
- ఇనుప లేదా కాస్ట్ ఐరన్ (పోత పెనాలని) ముందుగా కొద్దిగా నూనె వేసి ఉల్లిపాయతో రుద్ది సీసన్ చేసుకుంటే అట్టు విరిగిపోకుండా వస్తుంది.
2.పిండి పోశాక అట్టు మధ్యన అంచులవెంట పైన అంతా నూనెతో కాల్చుకుంటే అట్టు కరకరలాడుతూ బంగారు రంగులో కాలడమే కాదు, చాలా రుచిగా ఉంటుంది.
-
అట్టు మీడియం ఫ్లేమ్ మీద నిదానంగా కాలిస్తే కరకరలాడుతూ వస్తుంది. అట్టు మధ్యలో ఎర్రబడేదాకా కాల్చండి, ఆ తరువాత తిరగేసి మరో వైపు కాల్చుకోండి.
-
రెండో వైపు కాలుతున్నప్పుడు పైన కొద్దిగా నూనె లేదా నెయ్యి వేసి కాలిస్తే చాలా రుచిగా ఉండడమే కాదు, అట్టు ఎండిపోయినట్లుగా అవ్వదు.
-
ఆలు కూర అట్టు మధ్యలో కాక అంచుకి పెట్టి లోపలకి స్ప్రెడ్ చేసుకుంటే అట్టుని మడవడం సులభమవుతుంది. మనం వేస్తున్నది చిన్న మసాలా దోశలు కదా, అందుకే ఈ తీరులో కాల్చుకోండి.
మసాలా దోశ | ఇన్స్టంట్ మసాలా దోశ రెసిపీ | దోశ రెసిపీ | మసాలా దోశ రెసిపీ - రెసిపీ వీడియో
Instant Masala Dosa | Wheat flour Masala Dosa | Masala Dosa Recipe | Instant Masala Dosa Recipe
Prep Time 15 mins
Cook Time 30 mins
Resting Time 10 mins
Total Time 55 mins
Servings 4
కావాల్సిన పదార్ధాలు
-
ఆలూ మసాలా కోసం:
- 2 ఉడికించుకున్న ఆలూ
- 4 tbsp నూనె
- 3 tbsp జీడిపప్పు
- 1 tsp ఆవాలు
- 1 tbsp పచ్చిశెనగపప్పు
- 1 tbsp మినపప్పు
- 1 tsp జీలకర్ర
- 1 tbsp అల్లం తురుము
- 1 cup ఉల్లిపాయ చీలికలు
- 2 slit పచ్చిమిర్చి చీలికలు
- ఉప్పు (రుచికి సరిపడా)
- ¼ tsp పసుపు
- 2 sprigs కరివేపాకు
- ఇంగువ (కొద్దిగా)
- ⅓ cup నీరు
- ¼ cup కొత్తిమీర తరుగు
-
గోధుమ పిండి దోశ కోసం:
- 2 cups గోధుమపిండి
- 2 tbsp బొంబాయి రవ్వ
- 4 tbsp బియ్యం పిండి
- ఉప్పు (రుచికి సరిపడా)
- ¼ tsp వంట సోడా
- 2 - 2. ¼ cups నీరు
- నూనె (అట్టు కాల్చుకోడానికి )
విధానం
-
గోధుమ పిండిలో అట్టు పిండికి కావలసిన పదార్ధాలన్నీ వేసి గడ్డలు లేకుండా బాగా వేగంగా బీట్ చేసుకుంటూ కలుపుకోవాలి.
-
బాగా బీట్ చేసుకున్న పిండిని కనీసం పది నిమిషాలు ఊరనివ్వండి.
-
నూనె వేడి చేసి అందులో జీడిపప్పు వేసి ఎర్రగా వేపి తీసుకోండి.
-
నూనెలో ఆవాలు శనగపప్పు మినపప్పు వేసి ఎర్రగా వేపుకొవాలి. వేగిన పప్పుల్లో జీలకర్ర ఇంగువ అల్లం తరుగు వేసి వేపుకోవాలి.
-
వేగిన తాలింపులో ఉల్లిపాయ చీలికలు పచ్చిమిర్చి చీలికలు కరివేపాకు ఉప్పు వేసి ఉల్లిపాయ మెత్తబడేదాకా మూతపెట్టి మగ్గించుకోండి.
-
రంగు మారి మెత్తబడిన ఉల్లిలో పసుపు ఉడికించుకున్న ఆలూని చిదిమి వేసుకుని బాగా కలిపి నీరు పోసి దగ్గరగా ఉడికించుకోండి.
-
ఉడికిన ఆలూలో కొత్తిమీర తరుగు వేసి కలిపి దింపేసుకోండి.

Leave a comment ×
1 comments