కాల్షియమ్ రిచ్ రాగి దోశ
ఇన్స్టంట్ ఫుడ్ అంటే పాకింగ్లో దొరికే జంక్ ఫూడే కాదు, రోజంతా ఉత్సాహంగా ఉంచే ఎన్నో రెసిపీస్ ఉన్నాయి అందులో ఒకటి ఇన్స్టంట్ రాగి దోశ.
ఉదయాన్ని ఉత్సాహంగా మొదలెట్టాడానికి రాగితో చేసే రెసిపీస్ ఎంతో మేలు చేస్తాయ్. అలాగే ఈ రాగి దోశ కూడా. ఈ రాగి దోశ రెసిపీకి ప్రీ-ప్రిపరేషన్ ఏమి అవసరంలేదు. 30 నిమిషాలు ఓపిక పడితే చాలు. టేస్టీ హెల్తీ రాగి దోశలు రెడీ!!!
రాగి దోశలు చాలు తీరుల్లో చేస్తారు. కొందరు రాగిపిండి నానబెట్టి ఇంకొందరు రాగులు మినపప్పు నానబెట్టి రాత్రంతా పులియబెట్టి చేస్తారు. ఒక్కో తీరుకి ఒక్కో రుచి. అన్నీ బాగుంటాయ్ కమ్మని కొబ్బరి పచ్చడితో.

టిప్స్
-
రాగి పిండిలో కొద్దిగా బియ్యం పిండి వేస్తే పిండిలో జిగురొచ్చి అట్టు విరగదు, ఇంకా కాస్త క్రిస్పీగా వస్తాయ అట్లు
-
ఈ పిండిలో నేను ఉల్లిపాయ తరుగు వేశాను దీనివల్ల అట్టు సరైన షేప్ రాదు, కానీ అట్టు చల్లారాక కూడా మెత్తగా ఉంటుంది
-
అట్టు రుచి మరింత పెంచడానికి ఎండుమిర్చి సువాసన కోసం సొంపు వేశాను. సొంపు లేకపోతే జీలకర్ర వేసుకోండి
-
పిండి కొంచెం నానితే మృదువుగా ఉంటాయ్ అట్లు. పిండి నిలవ ఉంచుకోదలిస్తే ఉల్లిపాయ వేయకండి ఫ్రిజ్లో ఉంచినా సరే!
-
ఇన్స్టంట్ రాగి అట్టు కాలడానికి కాస్త సమయం పడుతుంది అందుకే మీడియం ఫ్లేమ్ మీదే కాల్చాలి. అప్పుడు అట్టు చక్కగా లోపలిదాకా కాలుతుంది. బాగా వేడి మీద కాలిస్తే రంగొస్తుంది కానీ, అట్టు గొంతుకు చుట్టుకుంటున్నట్లుగా ఉంటుంది, అంత రుచిగా ఉండదు.
కాల్షియమ్ రిచ్ రాగి దోశ - రెసిపీ వీడియో
Instant Ragi Dosa | Instant Spongy Ragi Dosa | How to make Instant Dosa
Prep Time 2 mins
Cook Time 3 mins
Resting Time 30 mins
Total Time 35 mins
Servings 3
కావాల్సిన పదార్ధాలు
- 1 cup రాగి పిండి
- 2 tbsp బియ్యం పిండి
- 5 ఎండుమిర్చి
- 1 tsp సొంపు
- 1/3 cup ఉల్లిపాయ తరుగు
- ఉప్పు
- కొత్తిమీర – కొద్దిగా
- వేడి నీళ్ళు – తగినన్ని
- నూనె – అట్లు కాల్చుకోడానికి
విధానం
-
మిక్సీలో ఎండుమిర్చి, సొంపు వేసి మెత్తని పొడి చేసుకోడని
-
గిన్నెలో రాగిపిండి, ఎండుమిర్చి సొంపు పొడితో పాటు మిగిలిన పదార్ధాలన్నీ వేసి పిండి అట్ల పిండి జారు కలిపి 30 నిమిషాలు రెస్ట్ ఇవ్వండి
-
బాగా వేడెక్కిన పెనం మీద పిండి పోసి అంచుల వెంట కొద్దిగా నూనె వేసి రెండు వైపులా కాల్చి తీసుకోండి. (అట్టు కాల్చే విధానం టిప్స్లో చూడండి)
-
ఇవి వేడిగా చల్లగా ఎలా అయినా కొబ్బరి పచ్చడి అల్లం పచ్చడితో చాలా రుచిగా ఉంటాయ్.

Leave a comment ×