సగ్గుబియ్యం అట్లు | ఆరోగ్యకరమైన అట్లు
మెత్తగా దూదిలా, నోట్లో పెటుకుంటే వెన్నలా కరిగిపోయే అట్లు తినాలని ఉందా? అయితే సగ్గుబియ్యం దోశ చేయండి. ఈ సింపుల్ రెసిపీ స్టెప్ బై స్టెప్ ఇమేజెస్ ఇంకా వీడియోతో ఉంది చూడండి.
దక్షిణ భారత దేశం వారికి అట్టుతో ఒక అనుబంధం. ఎన్ని రకాల అట్లున్నాయో. నాకు తెలిసి ప్రతీ 40 కిలోమీటర్లకి అట్లు రుచి మారిపోతుంది. అలాగే ఈ సగ్గుబియ్యం అట్టు కూడా చాలా కొత్తగా భలే రుచిగా ఉంటుంది. జస్ట్ 2 గంటలు నానితే చాలు వెంటనే అట్లు పోసుకోవచ్చు.
మా ఇంట్లో సగ్గుబియ్యం పిండితో పునుకులు కూడా వేస్తారు, చాలా రుచిగా ఉంటాయ్ అల్లం పచ్చడితో బొండాలు.

టిప్స్
సగ్గుబియ్యం:
సగ్గుబియ్యం కచ్చితంగా రెండు గంటలు నానితేనే పిండి మెత్తగా మెదుగుతుంది, అట్లు రుచిగా ఉంటాయ్.
బియ్యం:
నేను సోనా మసూరి బియ్యం వడాను, మీరు కావాలంటే దోశల బియ్యం కూడా వాడుకోవచ్చు.
ఉల్లిపాయ తరుగు:
నచ్చితే వేసుకోండి లేదంటే అవసరం లేదు. ఉల్లిపాయ ముక్కలు ఉంటే అట్టు సరైన తీరులో గుండ్రంగా రాదు. అట్టు ఉల్లిపాయ వేస్తే ఒక రుచి లేకుంటే మరో రుచి.
పిండి:
పిండి పులియబెట్టాలనుకంటే పెరుగు అవసరం లేదు. మామూలుగా అట్టు పిండి మాదిరి రాత్రంతా పులియబెట్టుకోండి. పొద్దున్నే అల్లం పచ్చిమిర్చి పేస్ట్, ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు కలుపుకోండి. పిండి గట్టిగా రుబ్బుకుని ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి పునుకులు వేపుకున్నా చాలా బాగుంటాయ్.
అట్టు:
ఈ అట్టు కాలడానికి కాస్త సమయం పడుతుంది, కాబట్టి ఓపికగా కాల్చుకోవాలి. త్వరగా తీసేస్తే అట్టు లోపల పిండిగా ఉంటుంది.
సగ్గుబియ్యం అట్లు | ఆరోగ్యకరమైన అట్లు - రెసిపీ వీడియో
Instant Sabudana Dosa | Healthy Dosa Recipe | How to make Instant Dosa
Prep Time 5 mins
Soaking Time 2 hrs
Cook Time 20 mins
Total Time 2 hrs 25 mins
Servings 4
కావాల్సిన పదార్ధాలు
- 1 cup సగ్గుబియ్యం
- 1 cup బియ్యం
- 1 inch అల్లం
- 3 పచ్చిమిర్చి
- 1/4 cup పుల్లని పెరుగు
- 1 రెబ్బ కరివేపాకు
- కొత్తిమీర – చిన్న కట్ట
- ఉప్పు
- నూనె అట్టు కాల్చడానికి
విధానం
-
సగ్గుబియ్యంలో నీళ్ళు పోసి కనీసం రెండు గంటలు నానబెట్టుకోండి. బియ్యం కూడా మరో గిన్నెలో వేసి నీళ్ళు పోసి 2 గంటలు నానబెట్టుకోండి
-
నానిన సగ్గుబియ్యంని పలుకు లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోండి, అలాగే బియ్యం కూడా మెత్తగా రుబ్బుకోండి. స్టోన్ గ్రైండర్ వాడితే రెండూ కలిపి రుబ్బుకోవచ్చు. మిక్సీలో అయితే ఒక్కోటిగా రుబ్బుకోవడం మేలు
-
మిక్సీ జార్లో అల్లం పచ్చిమిర్చి ముక్కలు వేసి మెత్తని పేస్ట్ చేసుకోండి.
-
గిన్నెలో సగ్గుబియ్యం పిండి, బియ్యం పిండి, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, పెరుగు, ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయ తరుగు తగినన్ని నీళ్ళు చేర్చి అట్ల పిండి జారుగా కలుపుకోండి
-
పెనం మీద అట్ల మాదిరి పలుచగా పోసి నూనె వేసి రెండు వైపులా కాలుచుకుని తీసుకోండి. ఇవి గుంటూర్ అల్లం పచ్చడితో చాలా రుచిగా ఉంటాయ్.

Leave a comment ×
3 comments