సేమియా ఊతప్పం రెసిపీ | సేమియా ఊతప్పం
పుల్లని పెరుగులో సోడా వేసి పొంగించి రవ్వ సేమియా కరివేపాకు ఉల్లిపాయ తరుగు పచ్చిమిర్చి అల్లం పేస్ట్ వేసి కలిపి పిండిని మందంగా పెనం మీద పోసి ఎర్రగా కాల్చి తీసే సేమియా ఊతప్పం అతి సులభం!!!
రోజూ పొద్దున్నే ఏమి టిఫిన్ చేయాలి అనుకునే వారికి చాలా ఉపయోగపడుతుంది ఈ సేమియా ఊతప్పం. ఈ సింపుల్ సేమియా ఊతప్పం పిండి నానడానికి పెట్టె సమయం కేవలం ముప్పై నిమిషాలంతే!!!
సాధారణంగా అట్టు పిండికి ప్రిపరేషన్ ముందు రోజు మొదలవుతుంది. అలా అని ఇన్స్టెంట్గా ఏమైనా దోస వేద్దామంటే అది అంత మృదువుగా రాదు, చల్లారాక బిగుసుకుపోతుంది. కానీ ఈ సేమియా ఊతప్పం అలా ఉండదు చల్లారాక కూడా ఎంతో మృదువుగా ఉంటుంది.
చేసే ముందు కింద టిప్స్ చుడండి.

టిప్స్
పెరుగు:
• పుల్లని పెరుగు వాడుకోగలిగితే ఊతప్పం చాలా రుచిగా ఉంటుంది, లేని వారు మామూలు పెరుగైనా వాడుకోవచ్చు.
సేమియా ఊతప్పానికి అతి సులభమైన కొలత:
• ఏ కొలతకి చేసుకున్నా సేమియా రవ్వ పెరుగు అన్నీ సమానం.
ఉల్లిపాయ కచ్చితంగా వేపాలి:
• ఉల్లిపాయ పచ్చిగా ఉన్నవి పిండిలో వేస్తే అవి ఊతప్పం కాలే సమయానికి మగ్గవు, ఇంకా అవి తింటే చాలా మందికి అరగవు, అందుకే ఉల్లిపాయ తరుగుని ఒక్క నిమిషమైనా వేపి పిండిలో కలిపితే ఊతప్పం రుచిగా ఉంటుంది ఇంకా సులభంగా అరుగుతుంది.
ఇంకా:
• నచ్చితే కొంచెం కేరట్ కాప్సికం తురుము కూడా వేసుకోవచ్చు.
సేమియా ఊతప్పం రెసిపీ | సేమియా ఊతప్పం - రెసిపీ వీడియో
Instant Semiya Uthappam | Semiya Uthappam Recipe | Vermicelli Uttapam
Prep Time 2 mins
Soaking Time 30 mins
Cook Time 20 mins
Total Time 52 mins
Servings 3
కావాల్సిన పదార్ధాలు
- 1 Cup పెరుగు
- 1 Cup రవ్వ
- 1 Cup సేమియా
- 1/2 Cup వంట సోడా
- 1/2 Piece అల్లం
- 3 పచ్చిమిర్చి
- నూనె - ఊతప్పం కాల్చుకోవడానికి
- ఉప్పు - రుచికి సరిపడా
- 1 ¼ Cups నీరు
-
తాలింపు కొరకు:
- 1/2 tbsp నూనె
- 1/3 Cup ఉల్లిపాయ తరుగు
- 1/2 tsp జీలకర్ర
- కరివేపాకు - 2 రెబ్బల తరుగు
విధానం
-
పెరుగులో, వంట సోడా కలిపి 30 సెకన్లు వదిలెయ్యండి . పెరుగు పొంగుతుంది.
-
అల్లం, పచ్చిమిర్చిని మెత్తగా దంచుకోండి.
-
పొంగిన పెరుగులో, రవ్వ, సేమియా, ఉప్పు, నీరు, దంచిన అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసి బాగా కలిపి కనీసం 30 నిమిషాలు వదిలేయ్యండి. పిండి పొంగుతుంది సేమియా మెత్తబడుతుంది.
-
నూనె వేడి చేసి, ఉల్లిపాయ జీలకర్ర కరివేపాకు వేసి ఒక నిమిషం వేపి, పులిసిన పిండిలో కలిపేయ్యండి.
-
పెనంని వేడి చేసి, పెద్ద గరిటెడు పిండిని పెనం మీద పోసి నెమ్మదిగా తడితే, కాస్త స్ప్రెడ్ అవుతుంది పిండి.
-
పిండి అంచుల వెంట నూనె వేసి మీడియం ఫ్లేమ్ మీద ఎర్రగా కాల్చండి. తరువాత ఫ్లిప్ చేసి మళ్ళీ ఇంకో 2 నిమిషాలు కాల్చి వేడి వేడిగా నచ్చిన పచ్చడి సాంబారుతో సర్వ్ చేసుకోండి.

Leave a comment ×
4 comments