ఈసీ కడాయ్ పనీర్ మసాలా | పనీర్ కర్రీ రుచిగా రావాలంటే ఓ సారి ఇలా చేసి చుడండి

Curries
5.0 AVERAGE
5 Comments

అందరికీ ఎంతో ఇష్టమైన ఘాటైన హోమ్ మేడ్ స్టైల్ కడాయ్ పనీర్ మసాలా రెసిపీ స్టెప్ బై స్టెప్ ఇమేజెస్ ఇంకా వీడియోతో ఉంది చూడండి. కడాయ్ పనీర్ ఫేమస్ పంజాబీ రెసిపీ. మిగిలిన పనీర్ కర్రీస్ కంటే కడాయ్ పనీర్ మాత్రం ఘాటుగా మసాలాలతో చాలా బాగుంటుంది. ఇది రోటీ నాన్ లోకి చాలా రుచిగా ఉంటుంది.

నేను ఈ కడాయ్ పనీర్ పూర్తిగా హోం మేడ్ స్టైల్ లో చెప్తున్నా! రెస్టారెంట్ కి మల్లె జీడిపప్పు పేస్టు అవేవి వేయకుండా చాలా సింపుల్ గా చేస్తున్నా! అయినా కూడా రెస్టారంట్ కి ఏమాత్రం తీసిపోదు ఈ కూర. చిక్కని గ్రేవీతో చాలా రుచిగా ఉంటుంది. ఈ మెథడ్ చాలా ఈసీ కూడా.

రెస్టారెంట్ స్టైల్ కాడాయి పనీర్ అంటే మసాలాలు మాంచి సువాసన వచ్చే దాకా వేపి పొడి కొట్టి దాన్ని కూరలో వేస్తారు. ఆ స్టైల్ కి బదులు, చాలా సింపుల్ గా బెస్ట్ టేస్ట్ వచ్చేలా చేస్తున్నా ఈ కూర.

ఈ కూర ఘాటుగా ఉంటుంది. స్పైస్ని ఇష్టపడే వారికి నచ్చేలా ఉంటుంది!

టిప్స్

  1. మసాల దినుసులు కాస్త బరకగా దంచుకోవాలి.

  2. ముందుగా వేసే ఉల్లిపాయ సన్నని తరుగు ఎర్రగా వేగాలి, రెండో సారి వేసే ఉల్లి, కాప్సికం రెండు కాస్త పెద్ద పాయలుగా గులాబీ రేకులలా ఉండాలి.

  3. కాప్సికం, ఉల్లిపాయ పాయలు వేసి రెండు నిమిషాలు మగ్గిస్తే చాలు. కూరలో ఉల్లి కాప్సికం ముక్కలు పంటికి కరకరలాడుతూ తగలాలి, అప్పుడే రుచి.

  4. కూర మగ్గడానికి వేడి నీళ్ళు పోస్తే కూరలో మసాలాలు వేగాక వచ్చే ఫ్లేవర్స్ దిగిపోవు. చన్నీళ్ళు పోస్తే ఫ్లేవర్స్ దిగిపోతాయ్.

  5. పనీర్ కూరలో వేయడానికి మునుపే 10 నిమిషాలు వేడి నీళ్ళలో ఉంచితే, పనీర్ మెత్తబడుతుంది కూర రుచిగాను ఉంటుంది.

  6. ఆఖరున వేసే నెయ్యి కూరకి రుచి మాంచి సువాసన. నచ్చకుంటే వదిలేవచ్చు.

ఈసీ కడాయ్ పనీర్ మసాలా | పనీర్ కర్రీ రుచిగా రావాలంటే ఓ సారి ఇలా చేసి చుడండి - రెసిపీ వీడియో

Kadai Paneer Recipe | Shahi Paneer Recipe | How to make Kadai Paneer Gravy Recipe | Homemade Kadai Paneer Recipe

Curries | vegetarian
  • Prep Time 5 mins
  • Cook Time 20 mins
  • Total Time 25 mins
  • Servings 4

కావాల్సిన పదార్ధాలు

  • 200 gms పనీర్
  • 1/2 cup సన్నని ఉల్లిపాయ తరుగు
  • 1 cup టమాటో ప్యూరీ (200 ml)
  • 1 టమాటో ముక్కలు
  • 1 ఉల్లిపాయ పెద్ద పాయలు
  • 10 - 15 సగం కాప్సికం ముక్కలు
  • 1 tbsp అల్లం వెల్లూలి ముద్దా
  • 1/4 cup నూనె
  • 1 tsp నెయ్యి
  • 1 tbsp దంచిన ధనియాలు
  • 1 tsp జీలకర్ర
  • 1 tsp సోంపు
  • 3 ఎండు మిర్చి
  • 1 tsp ధనియాల పొడి
  • 1 tsp వేయించిన జీలకర్ర పొడి
  • సాల్ట్
  • 1/4 tsp పసుపు
  • 1 tsp కారం
  • 1/2 tsp గరం మసాలా
  • 150 ml నీళ్ళు

విధానం

  1. నూనె వేడి చేసి దంచిన ధనియాలు, జీలకర్ర, సోంపు, ఎండుమిర్చి వేసి వేపుకోవాలి.
  2. ఇప్పుడు ఉల్లిపాయ సన్నని తరుగు వేసి ఉల్లిపాయలు ఎర్రబడేదాక వేపుకోవాలి, ఆ తరువాత అల్లం వెల్లూలి ముద్ద వేసి వేపుకోవాలి.
  3. మాసాలు వేగాక ఉల్లిపాయ పాయలు ఇంకా కాప్సికం ముక్కలు వేసి ఉల్లిపాయలు కాస్త మెత్తబడేదాక వేపుకోవాలి.
  4. తరువాత ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, వేయించిన జీలకర్ర పొడి వేసి మసాలాలు బాగా వేపుకోవాలి 1 tbsp నీళ్ళు వేసి.
  5. టమాటో గుజ్జు పోసి నూనె పైకి తేలేదాకా బాగా కలిపి మీడియం ఫ్లేం మీద మూత పెట్టి మగ్గనివ్వాలి.
  6. ఆ తరువాత టమాటో ముక్కలు వేసి బాగా కలిపి టమాటో ముక్కలు మెత్తగా మగ్గనివ్వాలి. టొమాటో ముక్కలు ముక్కలుగానే ఉండాలి.
  7. టమాటో ముక్కలు కూడా మగ్గాక 150 ml వేడి నీళ్ళు పోసి పనీర్ ముక్కలు వేసి కలిపి మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించి నెయ్యి వేసి కలిపి దిమ్పెసుకోవాలి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

5 comments

  • R
    Ramaa
    Recipe Rating:
    Today I tried it. It is delicious.
  • V
    Vanaja
    Recipe Rating:
    I learnt to cook paneer curry by watching this video and following this recipe . It turned out to be delicious and everyone in my family liked it a lot
  • S
    Sk Nazma
    Okka recipe ani kadandi maximum mee recipes chuse nenu intlo vanta chestunna.. Okkati kuda fail avvaledu. Paneer, biryani em vandina super ga vastai.. Best channel in YouTube
  • S
    Santhosh Kumar pannem
    We tried it today. Good recipe. Thanks
  • S
    Sandhya
    Recipe Rating:
    What a recipe😋
Kadai Paneer Recipe | Shahi Paneer Recipe | How to make Kadai Paneer Gravy Recipe | Homemade Kadai Paneer Recipe