జీడిపప్పు అంటే అందరికీ ఇష్టమే! ప్రసాదాల్లో కూరల్లో ఎరుకుని మరీ తినేస్తారు. అలాంటిది జీడిపప్పుతో కూర అంటే చెప్పాలా ప్రేత్యేకంగా దాని రుచి గురుంచి. రొటీస్ నాన్ చపాతీలలోకి బెస్ట్ కర్రీ కాజు కర్రీ

కాజు కర్రీ పేరుతో దక్షిణ భరతదేశ పెళ్ళిళ్ళలో కూడా ప్రేత్యేకంగా కూరలు చేస్తారు. కానీ ఎక్కువగా మసాలాలు దట్టించి కారంగా ఘాటుగా ఉంటుంది. కానీ నేను పంజాబీ రెస్టారెంట్ స్టైల్ కాజు మసాలా కర్రీ చేస్తున్నాను. ఈ కూరలో కారం, మసాలాలు చాలా తక్కువగా కమ్మగా ఉంటుంది.

ఎప్పుడైనా స్పెషల్ కర్రీ చేసుకుందాం అనుకున్నప్పుడు తప్పక ఈ కాజు కర్రీ గుర్తుకొచ్చేంత రుచిగా ఉంటుంది. కాజు కర్రీ చేసే ముందు టిప్స్ చూసి చేస్తే చాలా సందేహాలకు సమాధానాలు దొరుకుతాయ్!

Kaju Curry | How to make Cashew Nut Curry

టిప్స్

కర్రీ:

  1. ఈ స్టైల్ కాజు కర్రీ తెల్లగా ఉంటుంది. అందుకే ఏది ఎర్రగా వేపుకోకూడదు. అలా వేగితే కూర రుచి మారుతుంది.

  2. ఈ పద్ధతిలో చేసే కాజు కర్రీ కమ్మగా కాస్త తియ్యగా ఉంటుంది. కారంగా ఉండదు. అందుకే ఒకే పచ్చిమిర్చి వేశాను. లేదు కారంగా ఉండాలి అనుకుంటే పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకోండి

  3. ఉల్లిపాయ జీడిపప్పుని మెత్తగా వెన్నలా రుబ్బుకుంటే గ్రేవీ అంత చిక్కగా ఉంటుంది

  4. గ్రేవీని కలుపుతూ నిదానంగా చిక్కబరిస్తేనే ఫ్లేవర్స్ అన్నీ గ్రేవీలో దిగి రుచిగా ఉంటుంది. గ్రేవీని కలుపుతూ ఉడికించుకోవాలి లేదంటే గ్రేవీ అడుగుపట్టేస్తుంది, కూర రంగు మారుతుంది.

జీడిపప్పు:

  1. జీడిపప్పు మరీ ఎర్రగా నెయ్యిలో వేపి తీస్తే చల్లారే పాటికి ముదురు బంగారు రంగులోకి వస్తాయ్. కాబట్టి లేత బంగారు రంగులోకి వేపి తీసుకోండి

నెయ్యి- బటర్ – నూనె :

  1. ఈ కమ్మని కూర నెయ్యితో చేస్తే చాలా రుచిగా ఉంటుంది. నచ్చని వారు నూనె వేసి చేసుకోవచ్చు. కావాలంటే తగ్గించుకోవచ్చు.

కాజు కర్రీ - రెసిపీ వీడియో

Kaju Curry | How to make Cashew Nut Curry

Restaurant Style Recipes | vegetarian
  • Prep Time 2 mins
  • Cook Time 30 mins
  • Total Time 32 mins
  • Servings 4

కావాల్సిన పదార్ధాలు

  • 150 gms జీడిపప్పు
  • 2 tsp నెయ్యి
  • 2 tsp నూనె
  • గ్రేవీ కోసం
  • 20 జీడిపప్పు (గ్రేవీ కోసం)
  • 5 బాదం
  • 1 tbsp కర్బూజా గింజలు
  • ఉల్లిపాయ ఒక్కటి
  • 1 ఇంచ్ దాల్చిన చెక్క
  • 1/2 tsp మిరియాలు
  • 4 యాలకలు
  • 2 లవంగాలు
  • 1/3 cup పెరుగు
  • 300 ml నీళ్ళు
  • 1 పచ్చిమిర్చి
  • కర్రీ కోసం
  • 2 tsp నెయ్యి
  • 1 బిరియాని ఆకు
  • 2 లవంగాలు
  • 4 యాలకలు
  • 1 ఇంచ్ దాల్చిన చెక్క
  • 1 tsp అల్లం వెల్లులి ముద్ద
  • 1/2 liter నీళ్ళు
  • 1/2 tsp కసూరి మేథి
  • ఉప్పు
  • 1/2 tsp పంచదార
  • కొత్తిమీర – కొద్దిగా
  • 100 gm పనీర్
  • 2 tsp ఫ్రెష్ క్రీమ్
  • 1 tbsp బటర్

విధానం

  1. నెయ్యి నూనె వేడి చేసి అందులో జీడిపప్పు వేసి లేత బంగారు రంగు వచ్చీ రాగానే తీసి పక్కనుంచుకోండి
  2. గ్రేవీ కోసం ఉంచిన మసాలా దినుసులు ఉల్లిపాయ వేసి ఉల్లిపాయ రంగు మారకుండా ఒక నిమిషం వేపుకోవాలి
  3. బాదాం, కర్బూజా గింజలు, జీడిపప్పు వేసి ఒక నిమిషం వేపి నీళ్ళు పోసి మూతపెట్టి జీడిపప్పు మెత్తగా అయ్యేదాక ఉడికించి దింపేసుకోవాలి
  4. ఉడికిన జీడిపప్పుని మిక్సీ జార్లో వేసుకోండి ఇంకా పెరుగు పచ్చిమిర్చి వేసి స్మూత్ పేస్ట్ చేసుకోవాలి
  5. పాన్లో నెయ్యి కరిగించి అందులో దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, అల్లం వెల్లులి ముద్ద వేసి వేపుకోవాలి
  6. జీడిపప్పు పేస్ట్ నీళ్ళు పోసి నాలిపిన కసూరి మేథి పంచదార, రుచికి సరిపడా ఉప్పు వేసి 15 నిమిషాలపాటు కలుపుతూ చిక్కబరుచుకోవాలి
  7. గ్రేవీ చిక్కబడ్డాక వేపుకున్న జీడిపప్పు, క్రీమ్, బటర్ వేసి ఒక నిమిషం మూతపెట్టి ఉడికించుకోండి
  8. దింపే ముందు కొత్తిమీర తరుగు వేసుకోండి కూర పైన 100గ్రాముల పనీర్ తురుము వేసి కలిపి సర్వ చేసుకోండి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

2 comments

  • N
    nutterly
    Recipe Rating:
    Try nutterly.co - We're trying to make Dry Fruits more AFFORDABLE without compromising on QUALITY - you shouldn't miss out on the health benefits of nuts just cause they're expensive. Give us a try - we will NOT disappoint! :)
  • S
    Sireesha
    Recipe Rating:
    Can I have details of white casserole which u used in kaju curry recipe
Kaju Curry | How to make Cashew Nut Curry