కాజు పులావు | జీడిపప్పు పులావ్

చిటికెలో తయారయ్యే స్పెషల్ రెసిపె అంటే కాజూ పులావ్ అంటాను. ఎప్పుడైనా స్పెషల్ పులావు తినాలనుకుంటే ఇది పర్ఫెక్ట్. తిన్నకొద్దీ తినాలనిపిస్తుంది. సింపుల్ కాజు పులావ్ రెసిపీ టిప్స్ స్టెప్ బై స్టెప్ ఇమేజెస్తో పాటు వీడియో తో ఉంది చూడండి.

కాజు పులావ్ రెసిపీ అసలు వంతరాని వారు కూడా సులభంగా చేసేవచ్చు. ఏదైన స్పైసీ కర్రీ ఉంటే చాలు.

Kaju Pulao | Cashew Nut Rice | How to Make Cashew Rice recipe

టిప్స్

బాస్మతి బియ్యం:

• నేను ఈ పులావ్కి గంట నానబెట్టిన బాస్మతి బియ్యం వాడను, మీరు కావాలంటే సోనా మసూరి బియ్యం కూడా వాడుకోవచ్చు

• బాస్మతి బియ్యం గంట సేపు నానితే కప్పు కి కప్పు నీళ్ళు చాలు, సోనా మసూరి గంట నానితే కప్ కి 1.3/4 కప్స్ నీళ్ళు

• ఈ పులావ్ సువాసన మరింత పెంచడానికి ఎండిన గులాబీ రేకులు వాడాను, అందుబాటులో లేని వారు ½ tsp రోజ్ వాటర్ వేసుకోవచ్చు. రోజ్ వాటర్ అంటే కేర్ బ్యూటీలో వాడేదే.

కాజు పులావు | జీడిపప్పు పులావ్ - రెసిపీ వీడియో

Kaju Pulao | Cashew Nut Rice | How to Make Cashew Rice recipe

Flavored Rice | vegetarian
  • Soaking Time 1 hr
  • Cook Time 20 mins
  • Resting Time 15 mins
  • Total Time 1 hr 35 mins
  • Servings 2

కావాల్సిన పదార్ధాలు

  • 2 tbsps నెయ్యి
  • 2 tbsps నూనె
  • 5 లవంగాలు
  • 5 యాలకలు
  • 1 ఇంచ్ దాల్చిన చెక్క
  • 1 tbsp షాహీ జీరా
  • 1 బిర్యానీ ఆకు
  • 1 ఉల్లిపాయ చీలికలు
  • 2 పచ్చిమిర్చి చీలికలు
  • 75 gms జీడిపప్పు
  • 1 tbsp అల్లం వెల్లులి ముద్ద
  • 2 tsp పుదీనా తరుగు
  • 2 tbsp కొత్తిమీర తరుగు
  • ఉప్పు
  • 2 చిటికెళ్ల పసుపు
  • 1 tbsp ఎండిన గులాబీ రేకులు/ ½ tsp రోస్ వాటర్
  • 1 cup బాస్మతి బియ్యం (గంట నానబెట్టినది)

విధానం

  1. ముందుగా కుక్కర్ లో నూనె, నెయ్యి వేడి చేసుకుని, అందులో లవంగాలు, యాలకలు, దాల్చిన చెక్క, బిరియాని ఆకు, షాజీరా వేసి ఫ్రై చేసుకోండి.
  2. ఒక ఉల్లిపాయ సన్నని చీలికలు వేసి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ సగం పైన ఫ్రై అయ్యాక జీడిపప్పు వేసి ఎర్రగా వేపుకోండి. జీడిపప్పు ఎర్రగా వేగితేనే రుచి చాల బావుంటుంది.
  3. జీడిపప్పు సగం పైన వేగి రంగు మారుతుండగా పచ్చి మిర్చి చీలికలు, పుదినా, కొత్తిమీర, అల్లం వేల్లూలి పేస్టు వేసి పచ్చి వాసనా పోయేదాక వేపుకుని సాల్ట్, పసుపు వేసి వేపుకోండి.
  4. కప్ నీళ్ళు పోసుకుని నానా బెట్టిన బాస్మతి బియ్యం వేసుకోండి (ఇక్కడ సోన మసూరి బియ్యం వాడుకుంటే గనుక బియ్యం గంటకు పైగా నానబెట్టాలి, 1.3/4 cup నీళ్ళు పోసుకోవాలి)
  5. ఎసరులోనే ఎండిన దేశవాళీ గులాబి రేకులు 1 tsp వేసుకోండి. ఇది లేకపోతే పులావు దింపే ముందు 1/2tsp రోజ్ వాటర్ వేసుకోండి.
  6. కుక్కర్ మూత పెట్టి హై ఫ్లేమ్ మీద 1 whistle రానివ్వండి. సోనా మసూరి బియానికి అయితే 2 కూతలు రానివ్వండి.
  7. ఆ తరువాత 15 నిమిషాలు కదపకుండా వదిలేయండి.(ఇది చాల ముఖ్యం)
  8. 15 నిమిషాల తరువాత అడుగు నుండి అట్ల కాడతో కలుపుని సర్వ్ చేసుకోండి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

1 comments

  • V
    Venkat Balanagu
    Recipe Rating:
    Tried this Kaju Pulao last week, got ultimate results. Yummy in taste, temptation in flavours.. and I tried an another item before last week, that was fabulous taste, I got the taste feels like restaurant style, as I'm an eggetarian, i tried egg in the place of chicken joints, and the results are utmost touched the sky... Yummy... 😋