కాకరకాయ కారం రెసిపి | గుంటూరు కాకరకాయ కారం | గుంటూరు కారం

గుంటూరు కాకరకాయ కారం మితమైన చేదుతో కారంగా ఉప్పగా తెలిసి తెలియని తీపితో కనీసం నెలరోజులు పైన నిలవుండే గుంటూరు కాకరకాయ కారం ఒక్క సారి చేసుంచుకున్నారంటే ఇక తరచూ చేస్తూనే ఉంటారు అంత గొప్పగా నచ్చేస్తుంది మరి!

కాకరకాయ కారం తెలుగువారు ఎక్కువగా చేసేదే కానీ ఇది మా ఇంటి తీరు చాలా రుచిగా ఉంటుంది. మా అమ్మ నేను హోస్టల్కి వెళ్లేప్పుడు ఈ కాకరకాయ కారం సీసాలో పెట్టి ఇచ్చేది. ఏదో నెల రోజులు నిల్వ ఉంటుంది అని తీసుకెళ్ళేవాడినే కానీ ఉంచుతారా ఫ్రెండ్స్ తీసుకెళ్లిన రోజే ఖాళీ ఐపోవాల్సిందే సీసా!!!

ఇలాంటి జ్ఞాపకాలు ఎన్నున్నాయో కాకరకాయ కారంతో!!! ఏది ఏమైనా ఒక గొప్ప రెసిపీని మీరు ఆస్వాదిస్తారు!!!

టిప్స్

కాకరకాయ:

*సాధ్యమైనంత వరకు లేత కాకరకాయ వాడుకోండి, గింజలు తక్కువగా ఉంటాయి. కాకరకాయల పైన చెక్కు పూర్తిగా తీసేస్తే ఘాటైన చేదు తగ్గుతుంది. ముక్కలు మరీ పల్చగా కాకుండా కాస్త మందంగా కోసుకుంటే ముక్క వేగాక నిలుస్తుంది తినేందుకు బాగుంటుంది.

పుల్లని మజ్జిగ:

*కాకరకాయ ముక్కలని ఉప్పు పసుపులో ఉరేసి పసరు పిండేశాక పుల్లని మజ్జిగ ఒక రెబ్బ చింతపండులో ఇగరబెడితే కాకరకాయలో ఉండే చాలా వరకు తగ్గుతుంది.

బెల్లం:

*నిజానికి కాకరకాయ కారంలో బెల్లం ఎంతో రుచిగా ఉంటుంది, తప్పక వేయడానికి ప్రయత్నం చేయండి. తీపి పులుపు చేదుని చక్కగా అదుపు చేస్తుంది.

కాకరకాయ కారం రెసిపి | గుంటూరు కాకరకాయ కారం | గుంటూరు కారం - రెసిపీ వీడియో

Kakarakaya Karam | Guntur Kakarakaya Kaaram Recipe | Guntur Kaaram | Bitter Gourd Kaaram

Pickles & Chutneys | vegetarian
  • Prep Time 10 mins
  • Cook Time 1 hr
  • Resting Time 30 mins
  • Total Time 1 hr 40 mins
  • Servings 4

కావాల్సిన పదార్ధాలు

  • కాకరకాయ ముక్కలు ఊరబెట్టానికి:
  • ½ kg చెక్కు తీసుకున్న కాకరకాయ ముక్కలు
  • 1 tsp పసుపు
  • 1 tsp ఉప్పు
  • కాకరకాయ ముక్కలు ఉడికించడానికి:
  • 1 cup పుల్లని మజ్జిగ
  • చింతపండు - చిన్న ఉసిరికాయంత
  • కాకరకాయ కారం పొడి కోసం:
  • 3 tbsp నూనె
  • 2 tbsp సెనగపప్పు
  • 1 tbsp మినపప్పు
  • 1 tbsp ధనియాలు
  • 1 tsp జీలకర్ర
  • 1 ¼ tbsp ఉప్పు
  • ½ cup వెల్లుల్లి
  • 4 - 5 tbsp కారం
  • కాకరకాయ కారం కోసం:
  • ½ cup నూనె
  • ¼ cup బెల్లం

విధానం

  1. ½ కిలో కాకరకాయలని చెక్కు తీసేసి 1/2 అంగుళం ముక్కలుగా కోసుకోండి.
  2. కోసుకున్న ముక్కల్లో ఉప్పు పసుపు వేసి ముప్పై నిమిషాలు ఊరనివ్వాలి. ఊరిన ముక్కుల్లోంచి నీటిని గట్టిగా పిండేసుకోవాలి.
  3. చేదు నీరు పిండేసుకున్న కాకరకాయ ముక్కల్లో పుల్లని మజ్జిగా చింతపండు వేసి మజ్జిగ ఇగిరిపోయేదాకా మూతపెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి. మజ్జిగ ఇగిరిపోయాక దింపేసుకోవాలి.
  4. కాకరకాయ కారం కోసం నూనె వేడి చేసి సెనగపప్పు మినపప్పు ధనియాలు జీలకర్ర వేసి పప్పు మాంచి సువాసన వచ్చేదాకా ఎర్రగా నిదానంగా వేపుకోవాలి.
  5. వేగిన పప్పుని మిక్సర్ జార్లోకి తీసుకోండి. అందులో మిగిలిన పదార్ధాలు వేసి కేవలం 3-4 సార్లు మాత్రమే పల్స్ చేసి తీసుకోవాలి. ఈ పల్స్ కేవలం అన్నీ కలవడానికి ఇంకా వెల్లులి కచ్చా పచ్చాగా నలగడానికి మాత్రమే అని గుర్తుంచుకోండి.
  6. ఇప్పుడు కాకరకాయ కరం కోసం నూనె వేడి చేసి అందులో మజ్జిగలో మగ్గించుకున్న కాకరకాయ ముక్కలు వేసి లేత బంగారు వచ్చేదాకా మీడియం ఫ్లేమ్ మీద వేపుకోవాలి. కాకరకాయ ముక్కలు వేగేప్పుడు చింతపండు పిక్కలు కనిపిస్తే తీసేయండి.
  7. కాకరకాయ ముక్కలు రంగు మారి గట్టిపడతాయి అప్పుడు గ్రైండ్ చేసుకున్న వెల్లులి కారం బెల్లం తురుము వేసి బాగా కలిపి కేవలం రెండు పొంగులు రానిచ్చి దింపేసుకోండి. లేదంటే కారం మాడిపోతుంది.
  8. 2-3 గంటల తరువాత కాకరకాయ కారం చల్లారుతుంది అప్పుడు సీసాలోకి తీసుకుంటే కనీసం నెల రోజుల పైన నిల్వ ఉంటుంది.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.